ఐడియా

ఆయుర్వేదంలో మామిడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆయుర్వేదంలో ఔషధంగా మామిడి పండు ఉపయోగపడుతుంది. వేసవి కాలంలో మధురమైన మామిడి పండు తినటం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మధుమేహంతో బాధపడేవారు ఈ పండు తినరు. కాని దీని ఆకులు మధుమేహం నివారణకు ఉపకరిస్తుంది. ఎలా అంటే దీని ఆకులు, వేప లేత చిగుళ్లును సమ భాగాల్లో కలిపి మెత్తగా నూరి తినాలి. అలాగే మామిడి పూతను, పిందెలను, పండిన నేరేడు గింజలను మెత్తగా చూర్ణం చేసుకుని సీసాలో పెట్టుకోవాలి. ఈ చూర్ణాన్ని ప్రతిరోజూ చిన్న స్పూన్ తీసుకుంటే మధుమేహ రోగులకు ఉపయోగం.
వడదెబ్బ తగలకుండా..
వేసవిలో వడదెబ్బ తగలకుండా ఉండాలంటే పచ్చిమామిడి కాయను నిప్పుల మీద వేడిచేసి గుజ్జును పిండాలి. ఇందులో కొద్దిగా చల్లటి నీళ్లు, పంచదార వేసుకుని తాగితే దప్పిక తీరటమే కాదు ఎండల వల్ల కోల్పోయిన శక్తని పొందవచ్చు.
చెమట పొక్కులు రాకుండా..
రెండు మామిడి కాయలను గినె్నలో నీళ్లుపోసి ఉడికించాలి. చల్లారిన తరువాత గుజ్జును పిండి పంచదార, ఉప్పు కలిపి సేవించండి. దీనివల్ల ఒళ్లు పేలకుండా, వేడి తగ్గుతుంది.
మామిడి టెంకలోని జీడిని వేరు చేసి ఆరబెట్టుకోవాలి. దీనిలో పెద్ద చెంచా మెంతులు కలిపి మెత్తగా నూరి ఒక సీసాలో పెట్టుకుని కొన్నిరోజుల పాటు మజ్జిగతో తీసుకుంటే కడుపులో పురుగులు పోతాయి.
మామిడి వేర్లను మెత్త గా నూరి అరికాళ్లకు, అరిచేతులకు రాసుకుంటే జ్వరంలో కనిపించే వేడి తగ్గుతుంది.