ఈ వారం కథ

పాపం పసివాళ్లు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో శిశు మరణాల సంఖ్య నానాటికి అధికమవుతోంది. శాస్ర్తియ అవగాహన కొరవడటం వల్ల పురిట్లోనే పిల్లలకు నిండు నూరేళ్లు నిండుతున్నాయి. వెయ్యి మంది పిల్లలు పుడితే 40 మంది పిల్లలు చనిపోతున్నారు. అలాగే అపుడే పుట్టిన వెయ్యి మంది శిశువుల లో 28 మంది చనిపోతున్న ట్లు పార్లమెంట్‌లో ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలు చెబుతున్నాయి. ఐదేళ్ల లోపు పిల్లల మరణాలు మనదేశంలో ఎక్కువగా ఉంది. ప్రతి ఏడాది దాదాపు మిలియన్ మంది చిన్నారులు మృతిచెందుతున్నట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో కూడా సగం మంది పిల్లలు పుట్టిన మొదటి నాలుగు వారాల్లోనే చనిపోతున్నారు. ఐదేళ్లలోపు పిల్లల్లో 52శాతం మరణాలు కేవలం పోషకాహార లోపం, దానివల్ల తలెత్తే సమస్యల వల్లే చనిపోతున్నారు. మొక్క చెట్టుగా మారటానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామో మన చిన్నారుల పెంపకం పట్ల అంతే జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. నెలలు నిండకుండానే పుట్టడం, పోషకాహార లోపం వల్ల తక్కువ బరువుతో పుట్టడం, గర్భంలో ఉండగానే అంటువ్యాధులు వ్యాపించటం, శ్వాసకోశ సంబంధ సమస్యలు తదితర కారణాల వల్ల పురిట్లోనే ప్రాణాలు వదులుతున్నారు. కాని అంటువ్యాధుల విషయంలో సరైన అవగాహన లేక పోవటంతో పాటు అవసరమైన మందులు సరఫరా జరగక పిల్లల మరణాలు అధికమవుతున్నాయి. వ్యాక్సిన్లను సకాలంలో అందించేందుకు కేంద్రం ఎస్‌ఎంఎస్ ఆధారిత ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయటానికి సంకల్పించింది. అంతేకాదు 4,476 కోల్డ్ స్టోరేజ్ పాయింట్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది.
పోషకాహార లోపాలను ఇలా అధిగమించండి..
గర్భిణీ సమయంలో తల్లి బరువు పెరుగుతుంది. కాన్పు తర్వాత కొంత తగ్గినా.. మిగిలిన బరువంతా బిడ్డకు పాలివ్వటానికి సహకరించే ఆహారభద్రత అని గుర్తించినపుడు పిల్లలు చక్కగా ఎదుగుతారు. వీటన్నింటి కంటే ముఖ్యం శాస్ర్తియ దృక్పధంతో పిల్లల పెంపకం చేపట్టడం అనేది ఎంతో ముఖ్యం అంటున్నారు వైద్యులు. ఆరునెలలకే అన్నం ముట్టించాలని మన పెద్దలు ఎపుడో చెప్పారు. కాని చాలా మంది ఆచార వ్యవహారాలలో
భాగంగా అన్నం ముట్టించి 8,9 నెలలు దాటిన తరువాత పెడుతున్నారు. అందుకే చాలా మంది పిల్లలు అర్నెల్ల తరువాత బక్కగా ఉండటానికి కారణం ఇదే. పాశ్చ త్య దేశాలు కూడా ఇప్పుడు ఆర్నెల్లకే అదనపు ఆహారం పెట్టాలని బోధిస్తున్నాయి. మొదటి ఆర్నెల్లూ బిడ్డ పోషకావసరాలు నూటికి నూరుశాతం తల్లిపాల ద్వారానే తీరతాయి. 6-12 నెలల వయసులో 50 శాతం తల్లిపాలు, మరో 50శాతం అదనపు ఆహారం , ఇక 12 నెలలు నిండిన తర్వాత 33శాతం తల్లిపాలతో, మిగతా 67శాతం తినే ఆహారంతో ఇవ్వాలి. ఈ సమయంలోనే పిల్లలకు కొద్ది కొద్దిగా బరక గింజలు అలవాటు చెయ్యకపోతే వారికి తర్వాత ఆ అలవాటు చెయ్యటం కష్టమవుతోంది.
ఈ సమయంలోనే వాళ్లకు వాటిని పరిచయం చేస్తే పిల్లలు తేలికగా నమిలి మింగటానికి అలవాటుపడతారు. పండంటి బిడ్డ నట్టింట తిరుగుతుంటే ఏ తల్లికి మాత్రం ఆనందంగా ఉండదు. అందుకే నేటి తల్లులు పిల్లల పెంపకంలో కనీస అవగాహనతో పాటు శాస్ర్తియ పద్ధతులు అవలంభిస్తే వారి భావి జీవితం సాఫీగా సాగుతోంది.
--
బిడ్డ ఆరోగ్యానికి సీసా ప్రథమ శత్రువు. సకల జబ్బులకు అదే మూలం. కాని తల్లులు పాలు ఇవ్వటంలో శ్రద్ధ చూపటం లేదు. దీనివల్ల ఏటా ఐదు లక్షల మంది పిల్లలు సీసా పాల వల్ల చనిపోతున్నారు.