సబ్ ఫీచర్

మాంగల్యానికి ‘మరో ముడి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వివాహంలో వరుడు వధువు మెడలో కట్టే ‘మంగళసూత్రా’నికి లేక ‘మాంగల్యతంతు’నకే ‘మాంగల్యం’ అనేది సంక్షిప్తనామం.
‘వివాహం’లో వరుడు వధువు మెడలో ‘మాంగల్యం’ కడుతూ మూడు ముళ్లు వేయడం అనాదిగా వస్తున్న అద్భుత సంప్రదాయం.
మూడు ముళ్లు వేయడం ఎందుకు- అంటే, ఒక్కొక్క ముడితో ఒక్కొక్క వాగ్దానం చెయ్యలి కాబట్టి.
వివాహ సమయంలో ‘వరుడు’ తన జీవిత భాగస్వామి అవుతున్న ‘వధువు’ మూడు వాగ్దానాలు చెయ్యాలి. ధర్మేచ నాతి చరామి- అర్థేచ నాతిచరామి- కామేచ నాతి చరా మి అని ‘్ధర్మం’ విషయంలో నిన్ను నిర్లక్ష్యం చెయ్య ను. ‘అర్థం’ విషయంలో నిన్ను నిర్లక్ష్యం చెయ్యను. ‘కామం’ విషయంలో నిన్ను నిర్లక్ష్యం చెయ్యను అని. అంటే ‘వరుడు’ ఇకపై అన్ని వ్యవహారాలలోనూ ‘వధువు’ ఇష్టాయిష్టాలు తెలుసుకొని ఆమెకు అయిష్టమైన పనులు చేయకుండా, ఇష్టమైన పనులే చేస్తూ, ఆమెను ఆనందింపచేయడానికి సిద్ధపడి అట్టి వాగ్దానం చేయాలి అన్నమాట.
అయితే ఈ సంప్రదాయంలోని ధర్మం, అర్థం, కామం అంటే కూడా ఏమిటో ఆ వధువు, వరుడు మాత్రమే కాక అందరూ అర్థం చేసుకోవాల్సి వుంటుంది.
‘్ధర్మం’ అంటే తాము ఏ వృత్తికి చెందినవారో ఏ వర్గానికి అనగా- బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్గాలలో దేనికి చెందినవారో సరిగా తెలుసుకొని ఆ వర్గ ధర్మాన్ని ఆచరించాలి.
‘అర్థం’ అంటే ప్రతి వ్యక్తీ తన చుట్టూ ఉన్న సమాజ సంక్షేమం కోసం, కుటుంబ సంక్షేమం కోసం అవసరం అయిన అనేక విధులు నిర్వహించడం.
‘కామం’ అంటే ‘వ్యక్తిగత సౌఖ్యాలూ, ఆశయాలూ’ సాధించుకొనడం.
ప్రతి మనిషీ- పురుషుడు కానీ, స్ర్తి కానీ నాలుగు ప్రయోజనాలను, పురుషార్థాలను పొందవలసి యుంటుంది.
పైన పేర్కొన్న మూడే కాక ‘మోక్షం’ అనే నాల్గవ పురుషార్థం కూడా వుంది. ‘మోక్షం’ అంటే- భౌతిక బంధనాలనుండి విముక్తి చెందుతూ ప్రతిరోజూ కొంతసేపు నిర్మల ధ్యానం చేసి మనశ్శాంతిని పొందటం.
ఈ నాలుగూ ప్రతి పురుషుడూ, స్ర్తి సాధించుకోవాల్సిన నాలుగు పురుషార్థాలు.
అయితే ‘వరుడు’ తన ‘వధువు’నకు సర్వదా సంరక్షకుడై ఉండాలి అనేది ప్రజలంతా సర్వవిధాలా యోచన చేసి తీసుకున్న నిర్ణయం. ఎల్లప్పుడూ తిరిగి తిరిగి నిర్థారించి ప్రకటించే నిర్ణయం.
‘స్ర్తిలు’ అందరూ ‘సహజమైన రత్నాలు’ కాబట్టి ఆ రత్నాలను స్వంతం చేసుకొనడానికై దాదాపు ‘ప్రతి పురుషుడూ’ సద్బుద్ధితోనో, దుర్బుద్ధితోనో ప్రయత్నిస్తూనే ఉంటాడు.
అలా అనివార్యమైన పురుష ‘దౌష్ట్యం’ నుండి రక్షించడానికే వివాహ సమయంలో ‘వరుడు’ తన ‘వధువు’కు ముఖ్యమైన మూడు వాగ్దానాలు చేస్తూ ఆమె మెడలో ‘మాంగల్యం’ కడుతూ మూడు ముళ్ళు వేయడం అనాదిగా ఆచారం అయింది. కాని కాలక్రమేణా ఆ మూడు ముళ్ల అంతరార్థాన్ని ప్రజలు చాలావరకు విస్మరిస్తున్నారు. వధువుకు రక్షణ కల్పించలేని ముసలివారైనా, పసివారయినా, ఆమెను మోసం చేసి అవస్థల పాలు చేయదలచినవారైనా పెళ్లికాని యువతి లేక బాలిక మెడలో ఒక తాడు కట్టి అదే ‘మాంగల్యం’ అంటూ ఆ ‘మాంగల్యం’ ఆమె మెడలో ఎలా పడినా ఇక జీవితాంతం ఆమె ఆ వ్యక్తికి దాసురాలై ఉండాలి అనే దౌర్భాగ్య స్థితిని కల్పించడం ఎవ్వరూ సహించరాని నేరం. ‘ఇలాంటి నేరం జరగలేదు’ అని నిర్థారిస్తూ మాంగల్యానికి ‘మరో ముడి’ పడడం ఈనాడు అత్యవసరం అని అందరూ ఒప్పుకుంటారు. అవునా! కాదా?

- సన్నిధానం యజ్ఞనారాయణమూర్తి