మెయిన్ ఫీచర్

కల చెదిరింది... కన్నీరే మిగిలింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాఖండ్‌లో కార్చిచ్చు వార్త చదువుతుంటే నా గుండెల్లో మంటలు చెలరేగాయి. అందమైన సరస్సులు, పక్షులకు ఆలవాలమైన ఆ ప్రాంతం నేడు మంటల్లో మసిబారిపోవటం చూస్తుంటే నా గుండెల్లో రక్తప్రసరణ ఆగిపోయిందా అని పిస్తోంది. వేసవి వచ్చిందంటే పక్షుల ప్రేమికులు అక్కడ వాలిపోతారు. అందులో గీతాంజలి కృష్ణ అనే పర్యాటకురాలు తరుచూ అక్కడకు వెళతారు. ఆమె మనో భావాలు ఇలా ఉన్నాయ...
ఎంతె్తైన పర్వతాలు, అందమైన సరస్సులు, పక్షుల కుహు కుహు రాగాలతో స్వాగతం పలికే ఉత్తరాఖండ్‌లోని కుమావోనీ సరస్సు ప్రాంతం నేడు మంటల్లో మసిబారిపోవటం నా హృదయంలో వేదన మిగిల్చింది. పక్షుల ప్రపంచంగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతాన్ని కార్చిచ్చు దహించివేస్తుంటే ప్రకృతి పర్యాటకులను తమ కమ్మటి రాగాలతో రంజింపజేస్తూ స్వాగతం పలికే ఈ చిట్టి నేస్తాలు నేడు సజీవ దహనమవుతుంటే నా చేతుల్లోని ‘‘ది బుక్ ఆఫ్ ఇండియన్ బర్డ్స్’ కన్నీరు కార్చింది. ఈ పుస్తకం ఆధారంగానే నేను వేసవిలో ఈ ప్రాంతానికి వెళ్లి పక్షులను అధ్యయనం చేస్తుంటాను. కావ్యంలాగే సాగే నా వేసవి ప్రయాణంలో ఈ ప్రాంతంలో ఎన్నో మధురానుభూతులు ఉన్నాయి. సరస్సులపై నుంచి తేలియాడుతూ పలుకరించే చల్లటి గాలి సవ్వడుల మధ్య సాగే ప్రయాణంలో చిట్టి గువ్వలు చేసే సందడి చూస్తేంటే లోకమంతా వెతికి చూసినా ఇంతకన్నా అద్భుతమైన ప్రదేశం మరొకటి లేదనిపిస్తోంది. ప్రపంచంలోని పక్షులన్నీ ఇక్కడే కొలువుతీరి ఉన్నాయా? అని అనిపించేది. ప్రపంచంలోనే అతి చిన్న పక్షి ఈ ప్రాంతంలోనే కనువిందు చేస్తోంది. ఇపుడు నువ్వెక్కడున్నావు? అని వెక్కి వెక్కి ఏడవాలనిపిస్తోంది. మా ప్రయాణంలో గైడ్ ఈ చిన్న పక్షి గురించి
వివరిస్తూ.. అదిగో ఆ పక్షే అని వేలుపెట్టి చూపించటం, ఏది? ఎక్కడ?
అనే లోపే అది రివ్వున ఎగిరిపోవటం జరిగేది.2మేము బస చేసిన ప్రాంతంలో ఎన్నో రకాల పక్షులు ఉన్నాయి. నిజంగా అవి ఎంత అమాయకంగా కనిపించేవి. వాటిని సంభ్రమాశ్చర్యాలతో చూస్తూ.. అవి ఏ జాతికి చెందిన పక్షులో? అని తెలుసుకునే లోపునే రెక్కలు రెక్కలు టప టప లాడిస్తూ ఎగిరిపోతాయి. వాటి పేర్లు కూడా మన మనసులోకి స్పురణకు కూడా రాదు. ఇంతలోనే మాయమవుతాయి. సాధారణ పక్షుల జంటలకు కొదవేలేదు. వేసవి కాలంలో ఇక్కడ విడిది చేయటానికి వేలాది వలస పక్షులు సైతం వస్తాయి.
ఇక్కడే స్వచ్ఛమైన నీటితో నిండిన ఏడు సరస్సులు ఉన్నాయి. ఒక సరస్సు నుంచి మరొక సరస్సుకు పచ్చిక బయళ్ల మధ్య నడుచుకుంటూ వెళుతుంటే ఆ అనుభూతి మాటల్లో వర్ణించలేం. ఎన్నో గంటలు ఆనందంగా ఇక్కడ గడపటం జరిగింది. పక్షుల ధ్వనులతో అడవి అంతా ప్రతి ధ్వనించేది. ఒకచోట ఓపిగ్గా కూర్చొని ఉంటే పక్షులను క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం దక్కేది. ఆసియన్ ప్యారడైజ్ ఫ్లైక్యాచర్స్, తెలుపు, నలుపు రంగుల్లో కనిపించే చిన్న చిన్న పక్షులు, ముదురు ఎరుపు రంగు ఈకలతో ఉన్న పక్షులు.. ఇలా ఒకటేమిటి ఎన్నో రకాల పక్షులు అక్కడ సవ్వడి చేసేవి. పొడవాటి తోకలు ఉండే పక్షులు కొంచెం కష్టంగా ఎగిరేవి. కాని వాటిని చూస్తుంటే అసాధారణమైన పండుగ వాతావరణం అక్కడ కనిపించేది. నాలుగు గంటల పాటు అక్కడే వేచి ఉండి జంట పక్షుల విన్యాసాలను తిలకించాను. అంతేకాదు నేను వెళ్లిన సమయం వాటి సంతానోత్పత్తికి దోహదం చేసే కాలం. దీంతో ఎన్నో గూళ్లు కనిపించాయి. వాటిల్లో గుడ్లు ఉన్నాయి. ఆహారం కోసం బయటకు వెళ్లిన సమయం మినహాయించి మిగిలిన సమయమంతా ఆ గుడ్లకు కాపాలాకాస్తూంటాయి. సత్తాల్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న నౌకుచితల్ ప్రాంతం కూడా నేడు అగ్నికి ఆహుతైంది. నాతో పాటు విశాల్, వీర్‌సింగ్ ప్రయాణం చేశారు. కలదూంగి నుంచి భోవాలి వరకు కూడా మంటలు, పొగలతో నేడు చూడటానికే భయానకంగా మారటం వేదన కలిగిస్తోంది.
అడవిలో నడిచి వెళుతుంటే ఓక్ వృక్షాల ఆకులు నేలంతా పరచి ఉంటాయి. ఆ ఆకులపై నడిచి వెళుతుంటే ఆ ఆకుల సవ్వడి భలే గమ్మత్తుగా ఉండేది. గాలి సైతం సువాసనాభరితంగా ఉండేది. సరస్సులు అందమైన ప్రాంతాలే కాదు అక్కడ కూర్చొని వేసవి విడిది చేసే రకరకాల పక్షులను చూస్తుంటే కాలం ఇట్టే గడిచిపోయేది. నౌకుచితల్‌కు 130 అడుగుల దిగువన అడివిలోకి వెళితే అక్కడ సరస్సు వద్ద చేపలు పట్టుకునేవారు కనిపిస్తారు. సరస్సు అంచున నీటిలో తినిపడేసిన చిప్స్ ప్యాకెట్లు కనిపిస్తుంటాయి.
ప్రకృతి ప్రసాదించిన ఈ స్వచ్ఛమైన నీటిని గత ఇరవై ఏళ్ల నుంచి శుభ్రమే చేయలేదు. అయినప్పటికీ పరిశుభ్రంగా కనిపించాయి. ఆనాటి జ్ఞాపకాలు నేడు గుర్తుకు వస్తున్నాయి. అనుకోని ఈ ఉత్పాతం వచ్చి ఒక్కసారి నా కల చెల్లాచెదరైపోయింది. ప్రకృతి ప్రసాదించిన ఈ స్వర్గ్ధామానికి ఏ క్షణమైనా వెళ్లిపోవాలనిపించేది. అక్కడ ప్రతి ధ్వనించే శబ్ధాలు వేయి తరంగాల అలల సవ్వడి వలే చెవులకు వినిపిస్తూనే ఉన్నా.. ఆ జ్ఞాపకాలు నేడు ఏడిపిస్తున్నాయి..

ఈ కార్చిచ్చులో ఇప్పటివరకు ఆరుగురు మృతిచెందారు. వేలాది మంది ప్రాణాలు అరచేత పట్టుకుని పరుగులు తీస్తున్నారు.
స్వచ్ఛమైన గాలి వింజామరలు వీచే ఈ ప్రాంతం గాలి మంటలతో కలుషితమైంది.
4,700 ఎకరాలకుపైగా అటవీ ప్రాంతం దగ్ధమైంది.
మొట్టమొదటిసారిగా హెలికాఫ్టర్లతో మంటలను అదుపు చేయాల్సిన పరిస్థితి ఈ రాష్ట్ర చరిత్రలో తలెత్తింది. వర్షపాతం తక్కువగా నమోదవుతున్న నేపధ్యంలో గాలిలో తేమ శాతం తగ్గి మంటలను అదుపుచేయటం కష్టమవుతోంది.