మెయిన్ ఫీచర్

ఇది అమ్మల బజార్! (మహిళా సాధికారతకు నిలువెత్తు నిదర్శనం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అదో ఆడవాళ్ల బజారు. ఈశాన్య రాష్టమ్రైన మణిపూర్‌లో ప్రఖ్యాత పర్యాటక ప్రదేశంగా పేరు పొందింది. అందమైన ప్రదేశాలను చూడడానికి మణి పూర్ వచ్చే పర్యాటకులు తప్పనిసరిగా ఈ మార్కెట్‌ను చూసే వెళతారు. ఆసియాలోనే కాదు, ప్రపంచంలోనే అతి పెద్ద మహిళా మార్కెట్‌గా ప్రఖ్యాతి చెందింది. దాదాపు ఐదు వందల సంవత్సరాలుగా స్థానిక సంప్రదాయాలకు సాక్షీభూతంగా నడుస్తున్న మార్కెట్ అది. నాలుగువేల మంది మహిళా వర్తకులు, వేలాది మంది కొనుగోలుదారులతో నిత్యం కిటకిటలాడుతుంటుంది. పండగల సందర్భంగా అయితే ఇసకేస్తే రాలనంత జనాలతో కని పిస్తుంది ఈ మదర్స్ మార్కెట్. అమ్మకాల దగ్గర్నుంచి మార్కెట్ బాగోగులు చూసుకోవడం వరకూ అన్ని బాధ్యతలూ మహిళలే నిర్వహిస్తారు. ఇదేదో చిన్న కూరగాయల మార్కెట్ కాదు. ఇక్కడ దొరకని వస్తువు లేదు. మణిపూర్ సంప్రదాయాలకు సంబంధించిన వస్తువులు, స్థానిక ఉత్పత్తులు ఇక్కడ ఎక్కువగా కనబడతాయి.
ఎక్కడుందీ మార్కెట్..
మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో ఉన్న ఈ మార్కెట్‌ను స్థానికులు వారి భాషలో ఇమా కీతల్ అని పిలుచుకుంటారు. మణిపురి భాషలో ఇమా అంటే అమ్మ అని, కీతాల్ అంటే బజార్ అని అర్థం. అందుకే దీన్ని మదర్స్ బజార్ అని కూడా పిలుస్తారు. క్వైరంబంద్ బజార్ అని కూడా పిలుస్తారు. ప్రతిరోజు సమీప ప్రాంతాలనుంచి సుమారు నాలుగువేలమంది స్ర్తిలు తెల్లవారకముందే తమ తమ వస్తువులతో ఇక్కడికి చేరుకుంటారు. రాత్రి ఆరు గంటలవరకు అమ్మకాలు కొనసాగుతూనే వుంటాయి.
ఏనాటిదీ సంప్రదాయం?
ఈ మార్కెట్ ఇప్పుడేర్పడింది కాదు. తరతరాలు గా వస్తున్న సంప్రదాయపు మార్కెట్ ఇది. మదర్స్ బజార్ ఎప్పుడు ప్రారంభమైందన్న విషయంలో భిన్నాభిప్రాయాలు వినబడుతున్నాయి. దాదాపు అయిదు దశాబ్దాలు అంటే పదహారో శతాబ్దం నుం చి ఇది నడుస్తోందని స్థానికులు చెబు తుంటారు. అప్పట్లో ఈ ప్రాంత పురుషులు తరచుగా చైనా, బర్మాలతో జరిగే యుద్ధాలలో పాల్గొనడానికి వెళు తూ ఉండేవారట. దాంతో కుటుంబాల నిర్వహణా బాధ్యత క్రమంగా స్ర్తిలమీద పడింది. దాంతో స్ర్తిలు సంఘటితమై సరకుల విక్రయ బాధ్యతలను తీసుకోవడమే ఈ మార్కెట్ ఏర్పడడానికి కారణమని ఓ కథనం ఉంది. కాలం ఎంతగా మారినా ఈ మార్కెట్ కొనసాగుతూనే ఉంది.
అభాగ్యులకు ఆసరా
ఈ బజారులో మహిళలకు మాత్రమే విక్రయదారులుగా అర్హత లభిస్తుంది. ఇక్కడ దుకాణాలు నిర్వహించడానికి లైసెన్సులను పొందవలసి వుంటుంది. ఇక్కడ దుకాణాలు పెట్టకోవడానికి కుటుంబ బాధ్యతలు మోస్తున్న స్ర్తిలకు, ఏ ఆధారం లేని మహిళలకు ప్రాధాన్యత వుంటుంది. ఎన్‌కౌంటర్లలో భర్తలను కోల్పోయినవారు, ఇతరత్రా అన్యాయాలకు గురైనవారికి ఇక్కడ లైసెన్సు లేకుండా దుకాణాలు నిర్వహించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ బజారులో వస్తువులు కొనుక్కోడానికే తప్ప, అమ్మకానికి ఎట్టి పరిస్థితుల్లోను మగవారికి ప్రవేశం లేదు. ఎవరైనా మగవాళ్లు దుకాణాలు నిర్వహించడానికి ప్రయత్నిస్తే మహిళలు అడ్డుకుంటా రు. మహిళా వర్తకులు సామాజిక కార్యకలాపాలలోనూ ముందుంటారు. అతివలకు జరిగే అన్యాయాలను ఎదిరించడానికి తమ వంతు కృషి చేస్తారు. ఒకప్పుడు షెడ్లలో అమ్మకాలు జరిగేవి. ప్రసుతం పక్కా నిర్మాణాల్లో దుకాణాలు నిర్వహిస్తున్నారు. మహిళా సాధికారతకు నిలువెత్తు నిదర్శనంగా ఈ మార్కెట్ నిలుస్తోంది. ఇక్కడ దుకాణదారులు పర్యాటకులతో చాలా మర్యాదగా వ్యవహరిస్తూ ఆప్యాయత చూపుతుంటారు.

- మావూరు విజయలక్ష్మి