మెయిన్ ఫీచర్

మలి వయసులో మనశ్శాంతికి బాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జన్ననిచ్చిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో వదలించుకుంటున్న ఈ సమాజంలో వారికి ఉపశమనం కలిగించే ఆధునిక సెంటర్లు ఎన్నో ఉన్నాయి. జీవిత చరమాంకంలో ఎలాంటి బాధలు లేకుండా ప్రశాంతంగా కన్నుమూయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కాని ఆధునిక జీవనశైలి, ఆర్థిక సంబంధాలు వారిని అలాంటి సున్నితమైన మమకారానికి దూరం చేస్తున్నాయి. తొంబై ఏళ్ల అంధురాలైన తల్లి కేతకీదేవిని కావడిపై మోస్తూ ఇప్పటి వరకు ముప్పయివేల కిలోమీటర్ల వరకు పయనిస్తూ పుణ్య క్షేత్రాలను సందర్శిస్తూ.. ఆ పుణ్యక్షేత్రాల వివరాలను తల్లికి వివరించే కైలాస్‌గిరి లాంటి అభినవ శ్రవణకుమార్‌లాంటి వారు మనదేశంలో అతి తక్కువ మంది మాత్రమే ఉన్నారు. ఇలాంటి కొడుకులు ఉన్న ముదుసలి తల్లిదండ్రులను ఎలాంటి ఉపశమన కేంద్రాలకు తీసుకుని వెళ్లనక్కర్లేదు. కాని వయసుపైబడగానే కాళ్ల నొప్పులతో బాధపడుతూ నడవలేని తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బిడ్డలు ఉన్నా వారికి సమయాభావం లేక అనేకమంది నానా యాతనలు పడుతుంటారు. ఇలాంటివారు జీవిత చరమాంకంలో ప్రశాంతంగా కన్నుమూయలేకపోవటమనేది జగమెరిగిన సత్యం. ఇలాంటి పరిస్థితిపై ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా సర్వే నిర్వహించగా.. బ్రిటన్ దేశంలో ముసలి ప్రాయంలో ప్రశాంతంగా కన్నుమూస్తున్నారట! కారణం అక్కడ ఉన్న ఉపశమన కేంద్రాలే. ఇవి ఇలాంటి బాధితులను అక్కున చేర్చుకుంటూ సేవలందిస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా 1.3 బిలియన్ ప్రజలను సర్వే చేశారు. 80 దేశాలలో సర్వే నిర్వహించగా.. ఈ విషయంలో మనదేశం 67వ స్థానంలో నిలిచింది. అయితే మనదేశంలోని కేరళ రాష్ట్రం ఉపశమన కేంద్రాల సంఖ్య అత్యధిక సంఖ్యలో కలిగి ఉన్నాయి. వృద్ధులను అక్కున చేర్చుకునే ఉపశమన కేంద్రాలు అన్ని సదుపాయాలతో పనిచేస్తున్నాయి. ముఖ్యంగా క్యాన్సర్, హెచ్‌ఐవి తదితర ప్రాణాంతక జబ్బులబారిన పడ్డవారు ఇలాంటి ఉపశమన కేంద్రాలలో చేరి చివరి దశలో ప్రశాంతంగా కన్నుమూస్తున్నారు.
కేరళలోఈ ఉపశమన కేంద్రాలలో వేలాదిమంది వలంటీర్లు వారికి సేవలు అందిస్తారు. అనారోగ్యం పాలైనవారు, చరమాంక దశలో మంచానపడ్డవారు తదితరులు ఇక్కడ తమ జీవితాలను ముగిస్తారు. ఇలాంటివారిని అభిమానించేవాళ్లు, ప్రేమించేవారు అక్కడ ఎంతోమంది ఉంటారు. వారి ఆత్మీయానురాగాలే వారికి కొండంత బలం. ఆ బలం ముందు అంతకు ముందు వారుపడిన అనారోగ్య సమస్యలు చిన్నవైపోతాయి. శిక్ష ణ పొందిన వైద్యసిబ్బంది, ఆత్మీయతను పంచిపెట్టే వైద్యులు అంతా కలిసి వీరిని సొంత మనుషులు కన్నా మిన్నగా చూసుకుంటారు. ఎక్కువకాలం మంచానపడ్డవారికి పుండ్లు ఏర్పడతాయి. వీరి శరీరంపై పడిన పుండ్లను శుభ్రం చేసి వారికి ఆహారాన్ని అందిస్తారు. చక్కగా వారితో సంభాషణ చేస్తారు. భర్త చనిపోయిన ఉపాసర్ణ మాట్లాడుతూ దీనిని సేవగా భావించటం లే దని, నా సమకాలీన వయసువారు తాము ఒంటరివారమని భావించకుండా..వారితో మాట్లడటం వల్ల వారికి మనసిక ఉపశమనం కలుగుతుందని భావిస్తున్నానని అంటున్నారు. నేడు ఓ ఉపశమన కేంద్రంలో వందమంది నర్సులు, 50మంది డాక్టర్లు, 300 గ్రూపులు పనిచేస్తున్నాయి. అలాగే కేరళ ఆసుపత్రులలో అవసరమైనవారికి, అవసరమైన మేరకు మత్తుమందు సైతం ఇస్తుంటారు. యాభైఐదేళ్ల జుబైర్ బోన్ ట్యూమర్ వ్యాధి వల్ల కుడికాలు దెబ్బతింది. చికిత్స తరువాత కాలు బాగైనా ఆ బాధ మాత్రం కొనసాగుతుండటంతో ఆమెకు వైద్యులు మత్తుమందు ఇస్తున్నారు. ఇలాంటి శారీరక బాధలకు మత్తుమందే శరణ్యమని రోగులు భావించరాదని, దీనివల్ల జీవితకాలం మరింత దుర్భరంగా మారుతుందని డాక్టర్ రాజగోపాల్ అంటున్నారు. కేరళలోనే కాదు పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాలలో సైతం ఈ ఉపశాంతి కేంద్రాలలో పెయిన్ కిల్లర్స్‌తో కొద్దిపాటి మత్తుమందు అలవాటు చేయటం వల్ల వారికి ఆ బాధ నుంచి ఉపశమనం కలుగుతోంది. సంజీవని ఆసుపత్రిలో దయాల్ దుర్లావ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. అతని కుటుంబ సభ్యులు అతనిని చూసుకోవటం దుర్లభంగా భావించారు. అటువంటి దయాల్ దుర్లావ్‌కు సంజీవని ఆసుపత్రిలో సేవలందిస్తున్నారు. ఇలా వృద్ధాప్యంలో బాగోగులు చూసుకునేవారిని ఇలాంటి ఉపశమన కేంద్రాలు ఆదుకుంటున్నాయి.
ఈ వయసులో బాధాకరమైన సంఘటనలు, కష్టాలు ఎదురైనపుడు చాలామంది బలహీనపడిపోతారు. కుంగికృశించి లేనిపోని జబ్బులు తెచ్చుకుంటారు. దీంతో అనారోగ్యసమస్యలు మరిన్ని వెన్నాడుతుంటాయి. ఈ జీవితం ఎపుడు ఎలా ఉంటుందో తెలియని మనిషి ఉన్నంత కాలం సంతృప్తిగా జీవించాలంటే ఇలాంటి ఉపశమన కేంద్రాలలో చేరి జీవాయుష్షును పెంచుకుంటే ఎంతో మేలు. *