సబ్ ఫీచర్

పసిప్రాయం శాపమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేరళలో వెయ్యిమంది పిల్లలు పుడితే అందులో 12మంది ఏడాది లోపే ప్రాణాలు వదులుతున్నారు. ఇక్కడ శిశుమరణాల సంఖ్య పెరగటానికి కారణం పిల్లల ఎదుగుదల సరిగా లేకపోవటం, వారు సరిపడా ఆహారం తినకపోవటమే కారణం అని సర్వేలో వెల్లడైంది. సోమాలియాలో ప్రతి వెయ్యిమంది పిల్లలకు 85మంది చనిపోతున్నారు. అలాగే దేశంలోని అస్సాం, మధ్యప్రదేశ్, బీహార్, హర్యానా, ఉత్తరప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ట్రాలలో సైతం శిశు మరణాలు ఆఫ్రికా దేశాలను మించిపోవటం బాధాకరం.

తల్లి పొత్తిళ్లే పసిబిడ్డకు పదిలంగా కనిపిస్తోంది. కాని దురదృష్టం కొద్దీ మనదేశంలో పసిగుడ్డులు తల్లి పొత్తిళ్లలోనే ప్రాణాలు వదులుతున్నారు. దేశంలోని చాలా రాష్ట్రాలలో సంభవిస్తున్న శిశుమరణాల సంఖ్య పేద దేశాలైన ఉగండా, కెన్యా, సోమాలియా దేశాలను మించిపోతున్నాయి. మన దేశంలోని కేరళ పసిబిడ్డల మరణాల విషయంలో సోమాలియాను మించిపోతుందనటంలో ఆశ్చర్యం లేదు. ఇక్కడ అక్షరాస్యతలో అభివృద్ధి సాధించినా.. శిశు మరణాల సంఖ్య నానాటికి పెరిగిపోవటం ఆందోళన కలిగిస్తోంది. పిల్లలు ఆహారం సరిగా తినక బరువు పెరగలేకపోతున్నారనేది జగమెరిగిన సత్యం. దీనికి కుటుంబం, పెంపకం లోపాలే కారణాలుగా కనిపిస్తున్నాయి. పిల్లలు పసివయసులో బరువు ఎక్కువగా పెరుగుతారు. పుట్టిన పిల్లలు ఐదు నెలలు వచ్చేసరికి రెట్టింపు బరువు పెరుగుతారు. ఒక సంవత్సరం నిండే సరికి మూడింతలు.. రెండు-రెండున్నరేళ్లు వచ్చేసరికి నాలిగింతలు, పదేళ్లు వచ్చేసరికి పదింతలు అవుతారు. అంటే పుట్టినపుడు 3 కిలోలున్న పిల్లలు పదేళ్లు వచ్చేసరికి ముప్పయి కిలోలు పెరుగుతారు. సోమాలియాలో సరైన ఆహారం అందక కటిక దారిద్య్రాంలో మగ్గుతున్న బాల్యం మరణానికి చేరువవుతోంది. ఇటీవల ప్రధాన మంత్రి కేరళలో పర్యటిస్తూ.. ఈ రాష్ట్రం మరో సోమాలియాగా మారటం బాధాకరంగా ఉందని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం లేపినా వాస్తవ పరిస్థితికి అద్దం పడుతున్నాయని చెప్పవచ్చు.
ఎందుకంటే కేరళలో వెయ్యిమంది పిల్లలు పుడితే అందులో 12మంది ఏడాది లోపే ప్రాణాలు వదులుతున్నారు. ఇక్కడ శిశుమరణాల సంఖ్య పెరగటానికి కారణం పిల్లల ఎదుగుదల సరిగా లేకపోవటం, వారు సరిపడా ఆహారం తినకపోవటమే కారణం అని సర్వేలో వెల్లడైంది. సోమాలియాలో ప్రతి వెయ్యిమంది పిల్లలకు 85మంది చనిపోతున్నారు. అలాగే దేశంలోని అస్సాం, మధ్యప్రదేశ్, బీహార్, హర్యానా, ఉత్తరప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ట్రాలలో సైతం శిశు మరణాలు ఆఫ్రికా దేశాలను మించిపోవటం బాధాకరం. పిల్లలకు దైనందిన శారీరక అవసరాలకు ఖర్చయ్యే శక్తికోసమే కాదు ఎదుగుదల కోసమూ ఆహారం ముఖ్యం. వారి వయసుకు తగ్గట్టుగా ఎదుగుదల ఉంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. కాని పౌష్టికాహారం అందక శిశు మరణాల సంఖ్య రానురాను పెరుగుతోంది. అస్సాం, మధ్యప్రదేశ్‌లో శిశు మరణాల సంఖ్య 54కి చేరుకుని దేశంలోనే అత్యధిక మరణాలు సంభవించే రాష్ట్రాలుగా నిలిచాయి. అలాగే ఉత్తరప్రదేశ్, ఒడిసాలో 50కి చేరుకుని సుడాన్ దేశానికి చేరువయ్యాయి. రాజస్థాన్‌లో 47, హర్యానా, బీహార్‌లలో 42మంది శిశువులు మరణిస్తున్నారు. పశ్చిమబెంగాల్, కర్నాటక తదితర రాష్ట్రాలలో ప్రతి వెయ్యిమందికి 31మంది చనిపోతున్నారు. గుజరాత్‌లో సైతం శిశుమరణాల సంఖ్య 36కు చేరుకుని కెన్యా, ఉగండా, కాంగోదేశాల సరసన చేరింది. పేదరికం వెన్నాడుతున్నా పిల్లల పెంపకంలో పెద్దలు సాధ్యమైనంత వరకు వారి ఇష్టానికి అనుగుణంగా సమతుల ఆహారం అందిస్తే పసిప్రాయం శాపంగా కాకుండా వరంగా మారుతోంది.