మెయిన్ ఫీచర్

సింపుల్‌ వాచీలు.. సరికొత్త అందాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధునిక ఫ్యాషన్లు ఎన్ని వచ్చినా.. కొంతమంది మహిళలు సింపుల్‌గా ఉండటానికే ప్రాధాన్యం ఇస్తారు. కుడి చేతికి రెండు బంగారు గాజులు, ఎడమ చేతికి వాచీ పెట్టుకుని తమ ప్రత్యేకతను చాటుకుంటారు. మరికొందరు కొత్తగా కనిపించాలను కుంటారు. కొత్తగా కనిపించాలనుకున్నపుడు తమ ఆహార్యంలో ఎలాంటి మార్పు రావాలనుకుంటున్నారో ముందు ఆలోచించండి. అందుకు అనుగుణంగా తయారవ్వండి. తరాలు మారినా తరగని క్రేజ్ సంపాదించుకున్న వాచీల ఎంపికలో కాస్తంత ఆధునికత చూపించాల్సిన అవసరం ఉంది. అపుడే మీచేతిని అందం చుట్టేస్తోంది. ఏవి పడితే వాటిని ధరించటం వల్ల చూడ్డానికి ఎబ్బెట్టుగా ఉండవచ్చు. కళ్లను కట్టిపడేసేలా.. ట్రెండ్‌గా ఉండాలనుకుంటే తేలికగా చేతికి అమరిపోవాలి. చేతిమణికట్టును కట్టిపడేసేలా మార్కెట్లోకి మహిళలకు సంబంధించిన వాచీలు కొత్త డిజైన్లలో వచ్చాయి. అందంగా కనిపించే డిజైన్లలో కాలేజీకైనా, పార్టీలకైనా వారెవ్వా అనిపించేటట్లు కనువిందు చేస్తున్నాయి. వాటి నుంచి చూపు తిప్పుకోవటం కష్టమే.
ప్రస్తుతం ట్రెండ్‌కు తగ్గట్టుగా వాచీలకు సొబగులు అద్దితే.. ఇవిగో ఇలానే అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. రెండు వందల రూపాయల నుంచి వేలాది రూపాయల ఖరీదు వరకు నేడు కొత్తగా మార్కెట్లోకి అరుదెంచాయి. అనలాగ్ వాచీ లెదర్‌తో మెరూన్ కలర్‌లో మెరిసిపోతుంది. కడ వాచీ స్ట్రాప్ బంగారం రంగులో ధగధగలాడుతోంది. నాలుగు వాచీల సెట్ ఏ పార్టీకైనా చేతికి పెట్టుకునేలా డిజైన్ చేశారు. మన్నికతో పాటు అపూర్వంగా డిజైన్ చేశారంటే అతిశయోక్తికాదు. మహిళలకే కాదు పిల్లలు కూడా పార్టీలకు, ఫంక్షన్లకు పెట్టుకోవచ్చు. ఇంపోర్టెడ్ ఎంపోరియా ఆర్మనీ వాచీ ఖరీదు వేలల్లో ఉన్నప్పటికీ రోజ్‌గోల్డ్ కలర్‌లో డిజైన్ చేశారు. డయల్ కలరేమో వైట్‌లో ఉండి పట్టీ ఎర్ర రంగుల్లో మెరిసే వాచీ సింపుల్‌గా ఉంటుంది. డయల్ కలర్ బ్లాక్‌తో పాటు రౌండ్ షేపులో ఉండే స్టీల్ పట్టీ ఉండే వాచీ మీ చేతిని మెరిపిస్తోంది. ఫ్యాన్సీ డిజైన్లలో సైతం వాచీలు వారెవ్వా అనిపిస్తున్నాయి. వైట్ కలర్‌లో కనిపించే వాచీలు బ్రాస్‌లెట్ వలే బాగున్నాయి. మల్టీకలర్‌లో కనిపించే వాచీలు సైతం మహిళల మనసు దోచుకుంటున్నాయి. ఇలా ఎన్నో రకాల డిజైన్లలో, రంగుల్లో మార్కెట్లో సందడి చేస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఇలా...