ఐడియా

ఐడియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం అరుదుగా ధరించే బట్టలు పెట్టెల్లో పెట్టి ఉంచుతాం. పెట్టెలలో చాలా రోజులు వుంచడంవల్ల కొన్ని రకాలైన చీడపురుగులు, క్రిమి కీటకాలు చేరి బట్టలను కొరికి పాడు చేస్తూంటాయి. వీటి బారిన పడకుండా బట్టలు సురక్షితంగా వుంచాలంటే కొద్దిగా కర్పూరం, లవంగాల పొడి మిశ్రమాన్ని పెట్టె మూలల్లో వేసి వుంచినట్లయితే ఎలాంటి పురుగులైనా సరే నాశనమవుతాయి. బట్టలు సురక్షితంగా ఎంతకాలమైనా వుంటాయి.
పెళ్ళీ పేరంటాలు, శుభకార్యాలకు కొత్త ఇళ్ళకు రంగులు వేస్తారు. రంగులు వేసిన కొద్ది రోజుల వరకు రంగు వాసన రావడం సహజం. ఇది దుర్గంధం, సువాసన కాకుండా ఏదో అసహజమైన వాసననిస్తుంది. ఆ రంగు వాసన పోవాలంటే ఉల్లిగడ్డను సన్నగా తరిగి రంగులు వేసిన గదిలో వుంచాలి. అవసరం అనుకుంటే రెండవసారి తరిగి వుంచాలి. రంగు వాసన పూర్తిగా పోతుంది.
కొత్తబట్టలు మొదటిసారి ఉతికినప్పుడు పైపై రంగు పోతుంది. కొన్ని బట్టలు ఉతికిన ప్రతిసారి రంగు కోల్పోతాయి. రంగు పోతుందనే భయం వున్న బట్టలను మొదటిసారి ఉతికేప్పుడు వంద గ్రాముల ఉప్పును చల్లటి నీటిలో కలిపి 15, 200 నిమిషాలపాటు నానబెట్టాలి. తరువాత సబ్బు నీళ్ళలో వేసి ఉతికినట్లయితే రంగు పోవడమనే సమస్య ఉండదు.
వంట చేసేప్పుడు, పాలు గట్రా కాచేప్పుడు గ్యాస్ స్టౌమీద పొంగి పడుతాయి. అలా జిగట మరకలు ఏర్పడతాయి. స్టౌమీద జిగట మరకలు తొలగించేందుకు చాలామంది కత్తితో గీస్తారు. అలా చేయడంవల్ల స్టౌమీద రంగు ఎగిరిపోతుంది. గీతలు పడతాయి. అలా కాకుండా నైలాన్ బట్టను నీటిలో తడిపి మెల్లిగా రుద్దితే రంగు సేఫ్, మరకలు మటుమాయం.

-బి.మాన్‌సింగ్