సబ్ ఫీచర్

బానిస సంకెళ్లు ఇంకెన్నాళ్లు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలోబానిసత్వం పనులు చేసేవారి సంఖ్య అధికంగా ఉన్న దేశాలలో భారతదేశం ఒకటి. ఎక్కడా లేనివిధంగా ఇక్కడ కోట్లాదిమంది బానిస పనులు చేస్తున్నారని కొత్త అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దాదాపు 1.835 కోట్లమంది అంటే 1.3 బిలియన్ల మంది వెట్టి చాకిరిలో మగ్గుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 46 బిలియన్ల మంది ఉన్నారు. గత రెండేళ్లలో ఈ సంఖ్య మరింత పెరిగింది. ఇలాంటివారు కటిక పేదరికంలో మగ్గుతూ వెట్టి చాకిరి పనులు చేస్తున్నారు. వీరికి ఎలాంటి చట్టాలు వర్తించవు. కనీస వేతనాలు అసలే లభ్యంకావు. పొద్దస్తమానం వెట్టిచాకిరీ చేస్తూ అర్థాకలితో గడుపుతున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన మానవ హక్కుల సంఘమైన ‘వాక్ ఫ్రీ ఫౌండేషన్ ప్రపంచవ్యాప్తంగా బానిసత్వంలో మగ్గుతున్న కార్మికులపై అధ్యయనం చేసింది. 2014లో మనదేశంలో 1.43 కోట్లమంది బానిసత్వంలో మగ్గగా...2016నాటికి ఈసంఖ్య 1.835కోట్లకు చేరుకుంది. వీరి అధ్యయనంలో 167 దేశాలలో ఈ బానిసత్వంలో మగ్గుతున్న కార్మికులు ఉన్నారట. ఇందులో కొరియా అగ్రస్థానం వహించింది. ఆసియా దేశాలలో ఈ సమస్య అధికంగా ఉంది. కొరియా తరువాత చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఉజికిస్థాన్ ఉన్నాయి. ఆధునిక బానిసలు వేతనాల పరంగానే కాకుండానే శారీరకంగా ఎన్నో బాధలు అనుభవిస్తున్నారు. వీరికి తిట్లు, హింసకు గురవ్వటమనేది సర్వసాధారణం. నిస్తేజంగా, నిర్వేదంగా గడిపే ఈ బానిస బతుకులకు ముగింపు పలికేదెపుడో..?

భూమికకు రచనలు
పంపాలనుకునే వారు రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా పిడిఎఫ్ ఫార్మాట్‌లో bhoomika@andhrabhoomi.netకు మెయల్ చేయవచ్చు.
లేదా ఈకింది చిరునామాకు పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, భూమిక, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్ , సికిందరాబాద్- 03