సబ్ ఫీచర్

ఎదురీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు రాష్ట్రాన్ని అన్యాయంగా విడగొట్టడం.. విభజనలో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం.. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేంద్రం పట్టించుకోపోవడం.. ఇవీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును వేధిస్తున్న అంశాలు. ఆ ఆవేదనే ఆయనలో కసి పెంచింది. అన్యాయంగా మిగిలిపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని దేశం యావత్తు నివ్వెరపోయేలా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ఆయన ముందుకు సాగుతున్నారు. ఓపక్క ఆర్థిక ఇబ్బందులు, మరోపక్క పాలనాపరమైన సమస్యలు, ఇంకోపక్క రాజకీయ వైషమ్యాలు చంద్రబాబును వేధిస్తున్నా, దృఢ సంకల్పంతో ఏటికి ఎదురీదుతూ రాష్ట్భ్రావృద్ధి కోసం అహరహం ఆయన శ్రమిస్తున్నారు. ఆర్థిక లోటు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట కోసం చంద్రబాబు రైతు రుణ మాఫీని అమలు చేయడానికి సాహసించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉద్యానవన రైతులకు తొలిసారిగా ఆయన రుణమాఫీ చేయడం గమనార్హం.
పట్టుదలకు దర్పణం
చంద్రబాబు అధికారం చేపట్టిన కొద్దిరోజుల్లోనే హుదూద్ తుపాను ఉత్తరాంధ్ర జిల్లాలను, మరీ ముఖ్యంగా విశాఖ నగరాన్ని ఛిన్నాభిన్నం చేసింది. ఆయన ఎంతగానో అభిమానించే విశాఖ నగర అందాలు తుపానులో తుడిచిపెట్టుకుపోవడం బాబును తీవ్రంగా కలచివేసింది. తుపాను వెలిసిన మరుక్షణం చంద్రబాబు విశాఖ చేరుకుని బస్సులోనే మకాం చేసి, సుమారు వారం రోజులపాటు దగ్గరుండి, సహాయక చర్యలను పర్యవేక్షించారు.
నదుల అనుసంధానం
కృష్ణా - గోదావరి నదుల అనుసంధానంపై దేశం గర్వించదగిన మన ఇంజనీర్లు మోక్షగుండం విశే్వశ్వరయ్య దగ్గర నుంచి కెఎల్ రావు వరకూ వందల సంవత్సరాల నుంచి కంటున్న కలలను చంద్రబాబు నిజం చేశారు. కృష్ణా - గోదావరి నదులను పూలహారం మాదిరి కలపాలని నలభై ఏళ్ల క్రితం కెప్టెన్ దిన్‌షా దస్తూర్ చేసిన ప్రతిపాదనలను నాటి ప్రభుత్వాలు పక్కన పెట్టాయి. కానీ ఆయన ప్రతిపాదనలను చంద్రబాబు నిజం చేశారు. కృష్ణా - గోదావరి నదులను కలిపి జలహారం ఏర్పాటు చేసి, దక్షిణ భారత దేశంలోనే తొలి విజయాన్ని చంద్రబాబు నమోదు చేసుకున్నారు. సముద్రంలో కలిసిపోయే కృష్ణా జలాలను పట్టిసీమ వద్ద ఒడిసిపట్టి ఆ నీటిని సద్వినియోగం చేయాలన్న ఆయన సంకల్పాన్ని చూసి పొరుగు రాష్ట్రాలు నివ్వెరపోయాయి.
కలల రాజధాని.. అమరావతి
కష్టాలతో ఏటికి ఎదురీదుతూనే చంద్రబాబు అద్భుత రాజధానిని నిర్మించేందుకు నడుం బిగించారు. అధికారం చేపట్టిన తొలి ఏడాదిలో రాజధానిని ఎక్కడ నిర్మించాలనే ఆలోచన చేశారు. చివరకు విజయవాడ, గుంటూరు మధ్య ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించారు. గత ఏడాది అక్టోబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీని తీసుకొచ్చి శంకుస్థాపన చేయించారు. నిధులు లేవు.. రావు.. చంద్రబాబు రాజధాని ఎలా నిర్మిస్తాడని అంతా ఎదురుచూస్తున్న తరుణంలో, తన మేధాశక్తిని ఉపయోగించి, ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా, కష్ణానది ఒడ్డున 33 వేల ఎకరాల భూమి సేకరించారు. రైతులు భూములిచ్చిన స్ఫూర్తితో రాజధాని నిర్మాణానికి జపాన్, సింగపూర్, చైనా దేశాలకు చెందిన అనేక మంది ఆర్క్‌టెక్ట్‌లను ఆయన రాష్ట్రానికి రప్పించారు. టోక్యో, ఇస్లామాబాద్, రోమ్, ఫ్రాన్స్, లండన్, బెర్లిన్ వంటి ప్రపంచ ప్రఖ్యాత రాజధానులను తలపించేలా అమరావతి నిర్మించాలన్న దృఢ సంకల్పంతో చంద్రబాబు ముందుకు సాగుతున్నారు.
chitram...
రాజధాని శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని మోదీ, పార్లమెంట్ నుంచి
తీసుకొచ్చిన పవిత్ర మట్టిని చంద్రబాబుకు అందిస్తున్న దృశ్యం

- కె.వి.జి. శ్రీనివాస్