Others

చెట్టు ‘తొర్ర’లో పానశాల! ( వార్త-వ్యాఖ్య)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరువేల సంవత్సరాలనాటి ‘బావోబాబ్’ అనే అతి పెద్ద చెట్టు ఒకటి దక్షిణాఫ్రికాలోని ‘లింపోపా’ ఉద్యానవనంలో వుంది. ఈ చెట్టు ‘తొర్ర’ ఎంత పెద్దదీ అంటే నలభై మంది చేతులు బారచాపి, నిలబడి - దాని చుట్టూ వలయాకారంగా తిరుగుతూ గాన వినోదాలు చేస్తారు.
తొర్ర లోపల రెండు మీటర్ల వెడల్పున చెట్టు ‘బెరడు’ వుంటుంది. ఆ లోపల చిన్న పానశాల వుండి పదిహేనుమందికి స్వర్గతుల్యమైన ‘బార్’ను అందిస్తోంది. బీరు చల్లగా వుండటానికి, గాలీ, వెల్తురూ రావడానికీ కూడా సదుపాయాలున్న చెట్టు ఈ ‘బావ్‌బాబ్’ గాజా పిరమిడ్‌కన్నా పాతదని అంటారు స్థానికులు.
నాడు ఆదిమానవుడు తలదాచుకుంటే- నేడు ఆధునిక మానవుడు ప్రపంచం నాలుగు చెరగులనుంచీ వచ్చి, యిక్కడ పండగ చేసుకుంటున్నాడు. ఇది ఒక టూరిస్టు ఆకర్షణ. ఏటా డెబ్భై ఏడువేలమంది సందర్శకులు ‘క్యూ’లు కట్టి- తొర్రలో మధుపానానందాన్ని గ్రోలుతూ వుంటారు. దీని వయసు 7 వేల సంవత్సరాలట.
‘బావ్‌బాబ్’ చెట్లు డెబ్భై రెండు అడుగుల ఎత్తుగా పెరుగుతాయి. ఇంతకాలం వేలాది సంవత్సరాలు బ్రతికే చెట్లు యింక ఎక్కడా లేవు. అసలు ‘వెయ్యేళ్లు’ నిండితేగానీ, రుూ ‘బావ్‌బాబ్’ లోపల పెద్ద ‘తొర్ర’ ఏర్పడదు. కాశీమజిలీ కథలలో తప్ప మనం యిటువంటి తొర్ర వృక్షాలను ఎరుగం. ఏదో సామెత చెబుతారే- ‘చీమలు పెట్టిన పుట్టలు పాములకిరువగును’ అన్నట్లు ‘బావ్‌బాబో’య్ చెట్లు పెంచిన తొర్రలు మనుషుల ‘బార్’లకు బాగుండును అనొచ్చు! బావ్ బాబోయ్!

-వీరాజీ