సబ్ ఫీచర్

చిత్తశుద్ధిలేని చెత్తశుద్ధి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇళ్లల్లోగానీ, ఆఫీసుల్లోగానీ ఏ చెత్తబుట్టలో చూసినా కనిపించేవి ప్లాస్టిక్ కవర్లు, గుట్కా కవర్లు, వక్కపొడి కవర్లు.. అంతా ప్లాస్టిక్ వేస్టుమయంగా ఉంటుంది. భూమిలో శిథిలమై కలిసిపోయే అలవాటు కూడా లేని ప్లాస్టిక్ వలన పర్యావరణానికి ఎంత హాని జరుగుతోందో ఎలుగెత్తి చాటడానికి బోలెడన్ని స్వచ్ఛంద సంస్థలు, మీడియా సంస్థలు పనిచేస్తున్నాయి. అయినా కూడా ప్రజల్లో మాత్రం సరైన అవగాహన రావడంలేదు.

మన దేశంలో గుట్కాల వినియోగం చాలా అధికంగా వున్న సంగతి తెలిసిందే. చిన్న చిన్న టీకొట్టులు, బడ్డీ కొట్టుల్లో చూసినప్పటికీ కూడా బోలెడన్ని గుట్కా ప్యాకెట్లు వేలాడుతూ కనిపిస్తాయి. అయితే వీటి ద్వారా ఒళ్లు గుల్లయిపోవడం ఒక వంతు అయితే వీటి ప్యాకెట్లవలన పర్యావరణం కూడా సర్వనాశనం అయిపోవడం మరో ఎత్తు. ఉదయం లేచింది మొదలు రాత్రి విశ్రమించేవరకూ చేసే ప్రతిపనిలో కొంత చెత్తను తయారుచేస్తున్నాం. అమెరికాలో రోజుకు ఒక్కో వ్యక్తి నాలుగు పౌండ్ల చెత్తను తయారుచేస్తున్నాడట! అంటే అమెరికా ఒక్కటే రోజుకు ఆరు లక్షల టన్నుల చెత్తను తయారుచేస్తోంది. బహుశా అధిక చెత్త అభివృద్ధికి కొలబద్దగా చెప్పుకోవచ్చేమో! పళ్ళు తోముకునేందుకు, పళ్లు కుట్టుకునేందుకు, తుడుచుకునేందుకు చెత్త తయారుచేయడంతో మొదలెట్టి, కాగితం కప్పులో కాఫీ, పేపరులో చుట్టిన ప్లాస్టిక్ డబ్బాలో నీళ్ళు లేదా అల్యూమినియం క్యాన్‌లో కోక్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఉపయోగించేది పాతికా, చెత్తగా మార్చేది ముప్పాతికా అనిపిస్తుంది.
పునర్వినియోగం చేయగలిగిన వస్తువులను బాధ్యతారాహిత్యంగా చెత్తలో వేయడంవల్ల అవి చివరికి దిబ్బలకు చేరిపోతున్నాయి. అలా దిబ్బలకు చేరిన చెత్త ఇక ఎప్పటికీ అలానే ఉండిపోతుంది. ఈ వ్యర్థాలు మన బాధ్యతారాహిత్యాన్ని మన వారసులకు గుర్తుచేస్తూనే వుంటాయి.
ఇళ్ళల్లో, వ్యాపార సంస్థల్లో ఉత్పత్తి అయిన చెత్తను చెత్త కుండీల్లోనే వేయాల్సిన పౌరులు బాధ్యతా రాహిత్యంతో వ్యవహరిస్తున్నారు. దీంతో పలు చోట్ల చెత్తను రోడ్లమీదే పారబోస్తున్నారు. రోడ్లు ఊడ్చే పారిశుద్ధ్య కార్మికులు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఊడ్చి వెళుతున్నా సాయంత్రానికల్లా మళ్లీ చెత్తను ఎక్కడపడితే అక్కడ పారబోస్తున్నారు. చెత్తకుండీలు లేక ఖాళీ స్థలం కనిపిస్తే చాలు చెత్తను వేస్తున్నారు.
చెత్తను తయారుచేయడం తగ్గించడానికి ఎవరికి వీలయినంతలో వారు పాటుపడాలి. ఇళ్ళల్లో పార్టీలకు కాగితపు కుప్పలు, కంచాలూ వాడటం మానివేయాలి. చిన్న చిన్న వాటర్ బాటిళ్ళూ, కోక్ డబ్బాల స్థానంలో పెద్ద పెద్ద బాటిళ్లూ లేదంటే పూర్తిగా మానివేయడమో చేయాలి. చేతులు తుడుచుకోవడానికి మన పద్ధతిలోలా నీళ్ళు ఉపయోగించి పొడి టవల్‌తో తుడుచుకోవాలి. మన భావి తరాలకు అందమైన భూగోళాన్ని ఇవ్వకపోయినా ఫర్వాలేదు. చెత్త నింపిన, దుర్గంధ భూయిష్టం, ప్రమాదకారి అయిన భూగోళాన్ని వదిలిపెట్టకపోతే చాలు.

భూమికకు రచనలు
పంపాలనుకునే వారు రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా పిడిఎఫ్ ఫార్మాట్‌లో మెయల్ చేయవచ్చు.
లేదా ఈకింది చిరునామాకు పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, భూమిక, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్ , సికిందరాబాద్- 03

- తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి