మెయిన్ ఫీచర్

బందీఖానాలో బంగారు తల్లి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బంగారు తల్లికి ఎంత కష్టం వచ్చింది. చెంగు చెంగున లేడిపిల్లలా ఎగరాల్సిన వయసులో వేటకుక్కల్లాంటి మృగాల వేటకు బలవుతోంది. అడుగు పెడితే చాలు మాటు వేసి కాటు వేస్తున్నారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఆడపిల్లలు కామాగ్నికి బలవుతున్నారు. ఆడపిల్ల అక్రమ రవాణా విచ్చలవిడిగా జరుగుతోంది. ఎన్నడూ లేనివిధంగా ఆడపిల్లల అక్రమ రవాణా 65శాతం పెరిగినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్సు బ్యూరో తెలియజేస్తోంది. దేశంలో ప్రతి ఏడాది 1,35,000 మంది పిల్లలు మిస్స్ అవుతున్నట్లు కేసులు నమోదు అవుతున్నాయి. ఇందులో యాభైశాతం మంది మైనర్ బాలికలే ఉండటం గమనార్హం. మిగిలిన 30శాతం కేసులలో మహిళలు చోటుచేసుకుంటున్నారు. మిస్సింగ్ కేసులుగా నమోదవుతున్న బాలికలను వేశ్యాగృహాలకు అమ్మివేస్తున్నారు. గత ఆరేళ్లలో అక్రమరవాణా కేసులు 55 నుంచి 92శాతానికి పెరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మన పక్కనే ఉన్న తమిళనాడులో బాలికలు, మహిళలు ఎక్కువ సంఖ్యలో అక్రమ రవాణా అవుతున్నట్లు కేసులు నమోదు చేస్తున్నారు. దాదాపు ఈ రాష్ట్రంలో ఎనిమిది వేల కేసులు నమోదు అయ్యాయి. అతి తక్కువగా పశ్చిమ బెం గాల్‌లో 669 కేసులు నమోదు అయ్యాయి. పశ్చిమ బెంగాల్ నుంచి అమ్మాయిలను ఎక్కువ
గా బంగ్లాదేశ్, నేపాల్‌కు
రవాణాచేస్తుంటారు. ఆంధ్రప్రదేశ్‌లో 5,861,కర్నాటకలో 5,443, మహారాష్టల్రో3,628 బాలికలను ముంబయి, ఢిల్లీలోని రెడ్‌లైట్ ఏరియాలకు అమ్మివేస్తున్నా రు. మ నదేశం నుంచి రవాణా అయ్యే బాలికలు, మహిళలు ఉక్రేయిన్, ఖజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్, నేపాల్, థాయిలాండ్, మలేసియా తదితర దేశాలకు పంపబడుతూ బానిసత్వంలో మగ్గిపోతున్నారు. కరవుతో అల్లాడుతున్న బుందేల్‌ఖండ్, మహారాష్ట్ర, బీహార్, కర్నాటక తదితర రాష్ట్రాలలో చిన్నారి బాలకలను పోషించలేక వందలాది రూపాయలకే అమ్మేసుకుంటున్నారు. నా సొంత పట్టణానికి చెందిన మీర్జాపూర్‌లో సెక్స్‌మార్కెట్ విచ్చలవిడిగా సాగుతుందని ఖాన్ అనే వ్యక్తి చెబుతున్నాడు. ఒక్కసారి ఆడపిల్ల
కాలు బయటకు పెట్టిం దంటే ఆమె సెక్స్ రాకెట్‌లో చిక్కుకున్నట్లే. అమ్మాయిల అక్రమ రవాణాదారులు సోషల్‌మీడియానే ఉపయోగించుకుంటూ కోట్లాది డాలర్ల చేతులు ఆర్జిస్తున్నారు. స్వామి అగ్నివేష్ ఆధ్వర్యంలో యూత్ నెట్‌వర్క్ ఏర్పాటు అమ్మాయిల అక్రమ రవాణా అరికట్టేందుకు స్వామి అగ్నివేష్ వెయ్యిమంది యువకులతో యూత్ నెట్‌వర్క్‌ను ఏర్పా టు చేశారు. ఈ నెట్‌వర్క్‌లోని సభ్యులంతా పాఠశాలలను సందర్శించి వారిలో చైతన్యాన్ని తీసుకువచ్చేందుకు కృషిచేస్తున్నారు. చట్టాలు బలహీనంగా ఉం డటం వల్ల ఈ దారు ణం ఇంత పెద్ద ఎత్తున జరుగుతుందని బచపన్ బచావోచైర్‌పర్సన్ రామ్ చౌరాసియా అంటున్నారు. వేలాది కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉండటమే దీనికి నిదర్శనమని ఆయన ఆవేదన వ్యక్తంచేయటం గమనార్హం. ఆలస్యంగా మేల్కొన్న రక్షణ మంత్రిత్వ శాఖ అమ్మాయిల అక్రమ రవాణాను అరి కట్టేందుకు 335 యూనిట్స్‌ను నెలకొల్పగా.. ఇందు లో 225 కేంద్రాలు చురుకుగా పనిచేస్తున్నాయి. ఏదిఏమైనప్పటికీ 18ఏళ్లు కూడా నిండని అమ్మాయిలు దాదాపు మూడు మిలియన్ల మంది సెక్స్ వర్కర్లుగా నమోదు కావటం దేశంలోని దౌర్భాగ్య స్థితికి అద్దం పడుతోంది.
............................................
* ప్రతి ఏడాది 1,35,000 మంది పిల్లలు మిస్ అవుతున్నట్లు
కేసులు నమోదు.
* గత ఆరేళ్లలో అక్రమరవాణా కేసులు 55 నుంచి 92శాతానికి పెరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
* మనదేశం నుంచి రవాణా అయ్యే బాలికలు, మహిళలు ఉక్రేయిన్, ఖజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్, నేపాల్, థాయిలాండ్, మలేసియా తదితర
దేశాలకు పంపబడుతూ బానిసత్వంలో మగ్గిపోతున్నారు.
.........................................
మనసుకూ గాయమే!

రెక్కాడితేగానీ డొక్కాడని రోజుల్లో బతు కు తెరువుకోసం ఇళ్ల నుంచి బయటకు వస్తు న్న ఆడపిల్లలపైన ఊరకుక్కల్లా విరుచుపడుతున్న మృగాళ్ల అమానుషత్వం ఏటికేడు పెరిగిపోవటం మనసులను కలిచివేస్తోంది. రెండు రోజుల క్రితం బెంగుళూరులో అమ్మాయిలను వేశ్యావాటికలకు రవాణా చేస్తున్న పెద్ద ముఠాను పోలీసులు వలవేసి పట్టుకున్నారు. పశ్చిమ బెంగాల్ నుంచి తెచ్చిన ముగ్గురు అమ్మాయిలను బంగ్లాదేశ్‌కు తరలించేందుకు ఐదుగురు సభ్యులున్న ముఠా వీరిని తీసుకవెళుతుండగా పోలీసులు చేధించి వారిని కాపాడగలిగారు. ఇలాంటి అమానుషమైన ఘటనలు ఎన్నో వెలుగులోకి రాకుండానే పోతున్నాయి. ఎంతోమంది బాలికలు కామందుల అత్యాచారాలకు బలవుతున్నారు. రాజీకి ఏమాత్రం అవకాశం లేని ఇలాటి అమానుష ఘటనలు సమాజంపైనే జరిగే తీవ్ర నేరం. ఇలాంటి కేసుల్లో దోషులుగా తేలినవారికి శిక్షపడటం అనేది ఎడారు ల్లో ఎండమావుల్లా కనిపిస్తోంది. ఆడపిల్లల అక్రమ రవాణా శరీరానికే కాదు మనసుకు తీవ్ర గాయమవుతోంది. ఆడపిల్లలను ఆటవస్తువుగా చూస్తూ వారిని బానిసలుగా, వేశ్యలుగా భావిం చి అక్రమరవాణా చేస్తున్న ఇలాంటి మృగాళ్ల బారి నుంచి తమను తాము కాపాడుకోవటానికి ఆడపిల్లలు ఎన్నో అగచాట్లు పడాల్సి వస్తోంది. బాధితులకు నష్టపరిహారం అందించడంలో జాతీయ విధానాన్ని రూపొందాలనీ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. నష్టపరిహారం సరే, పశువాంఛతో తెగబడుతున్న కీచక సంతతి పీచమణిచే పటిష్ట కార్యాచరణ పట్టాలెక్కిననాడే ఆడపిల్ల కు రక్షణ కల్పించగలుగుతాం.

- లత