సబ్ ఫీచర్

వర్షం బూచి కాదు.. జాగ్రత్తపడితే చాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెరుపు మెరిస్తే, వాన కురిస్తే మా కోసమే అనుకునే పిల్లల ఆనందం వానలో తడిసిముద్దయిన వేళలో ఇంద్రధనస్సులా మనసు వికసిస్తుంది. ఆ తరవాత అనారోగ్యం పాలవుతారు. చిన్నారులకు నీళ్లతో ఆడడం అన్నా, వర్షంలో తడవడం అన్నా మహా సరదా. వారిని కట్టడి చేయడం అనుకున్నంత ఈజీ కాదనే చెప్పాలి. కానీ తగు జాగ్రత్తలు తప్పనిసరి.
వర్షాకాలం అనేక వ్యాధులను ఆహ్వానించే సీజన్. ఈ కాలంలో ఏ వయసువారికైనా జీర్ణ వ్యవస్థ కొంత కుంటుపడుతుంది. దీనికితోడు నీటి కాలుష్యం, అపరిశుభ్ర పరిసరాలు, రోగ నిరోధక శక్తి సన్నగిల్లడం వల్ల పెద్దలకంటే ఎక్కువగా పిల్లలు వ్యాధులకు గురవుతారు. వాతావరణంలో పెరిగిన తేమవల్ల చర్మ, శ్వాసకోశ సమస్యలు కూడా సర్వసాధారణం అని పిల్లల వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
వర్షాకాలపు వ్యాధులనుంచి పిల్లలను రక్షించాలంటే దోమలు, ఈగలు దరిచేరకుండా చూసుకోవాలి. కాచి చల్లార్చిన మంచినీటితోపాటు, తాజా ఆహార పదార్థాలు మాత్రమే పిల్లలకు ఇవ్వాలి. దీనితోపాటు పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత వంటి ఆరోగ్య సూత్రాలను తప్పక పాటించాలి. లేదంటే మలేరియా, డెంగీ, బోదకాలు, చికున్‌గున్యా, పైలేరియా.. వగైరా వ్యాధులు తప్పవు. ఏ వ్యాధి అయినా పిల్లలకు అతి త్వరగా సోకే ప్రమాదం ఎక్కువ. జ్వరం, దగ్గు, విరేచనాలు, వాంతులతో పిల్లలు బాధపడుతుంటే వెంటనే వైద్యుడికి చూపించాలి. పిల్లల విషయంలో సొంత వైద్యంతో తాచ్చారం చేయకుండా విధిగా వైద్యుడిని సంప్రదించాలి.
పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ సాధ్యమైనంత వరకు బయట ఆహారం తినకూడదు. ఇంట్లోనే వేడి వేడి ఆహారం తీసుకోవడం మంచిది. పిల్లలు ఆహారం తినేముందు చేతులను శుభ్రంగా కడుక్కునేలా చూడాలి. వేళ్ళ గోళ్లలో మురికి చేరకుండా చూసుకోవడంతోపాటు నోట్లో పెట్టుకోకుండా ఉండాలి. తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పరిశుభ్రంగా కడిగిన తరువాతనే వాడుకోవాలి.
వర్షంలో ఎక్కువ సమయం తడవడం ఏ మాత్రం మంచిది కాదు. తప్పనిసరి పరిస్థితుల్లో తడిస్తే వెంటనే పిల్లలను తలతోపాటు శరీరం అంతా పొడిగా తుడి చి గోరువెచ్చని నీటితో స్నానం చేయించాలి. శుభ్రమైన వస్త్రాలను వేయాలి. ఈ కాలంలో వర్షం ఎప్పుడు కురుస్తుందో తెలియదు కనుక ఎల్లవేళలా గొడుగు, రైన్‌కోట్ లాంటివి తమతోటే ఉంచుకునేలా చూసుకోవాలి. ఇంట్లో ఎక్కువగా తేమ లేకుండా చూసుకోవాలి. సరియైన పాదరక్షలు లేకుండా పిల్లల్ని బయట తిరగనివ్వద్దు. ఏ మాత్రం నలతగా అనిపించినా విశ్రాంతి తీసుకోవడంతోపాటు జబ్బు క్రమేపీ తగ్గకుండా పెరుగుతుంటే వెంటనే వైద్యుల్ని సంప్రదించడం మరవద్దు.

- ఎం.కె.