Others

లోకల్ రైళ్లలో స్టంట్ మాస్టర్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రైలు బండీ తమాషాలు రకరకాలు. కొందరు కుర్రాళ్లు, అమ్మాయిలూ కూడా ప్యాసింజెర్ల బల్లలమధ్యకి గబగబా వచ్చి సర్కస్‌లు, యోగా ఫీట్స్ చేసేస్తారు. కానీ రుూ మాదిరి పొట్ట తిప్పలు పోయాయ్.
ముంబయ్ లోకల్ రైళ్లలో కేవలం సరదాకి తమ సాహస ప్రతాపం చూపెట్టడానికి ఎందరో బజారు గ్యాంగు యువకులు ఇటీవల విపరీతమయిన స్టంట్‌లు చేస్తున్నారు రుూ డింభకులు!
రైలుబండీ టాప్‌మీద స్టంటు సినిమాల్లోలాగా నిజంగానే పరుగులు తీస్తూంటారు- రైలు పరిగెడుతున్నప్పుడు. రైలు తలుపుల దగ్గరా, కిటికీల దగ్గరా వ్రేలాడుతూ ప్లాట్‌ఫామ్‌ని ఓ కాలితో తంతూ వుంటారు. దీన్ని కోతి పరుగులు అంటారు. వేగంగా పరిగెట్టే రైలుకి వ్రేలాడుతూ ఎలక్ట్రిక్ పోల్స్‌ని తాకుతూ, తప్పించుకుంటూ స్టంట్లు చేస్తారు. స్తంభాల ఆటట యిది! రైలు వేగంగా పోతూండగానే మొక్కల ఆకులు తెంపుకుంటూ పోతారు. ఎవడు ఎక్కువ ఆకులు త్రెంపితే వాడే సికిందర్. ఇలాగ మాన్‌ఖుర్ద్ గోవిందీ, చెంబూరు స్టేషన్లమధ్య యిలాంటి ఫీట్సు ఎన్నో చేస్తూంటారు రుూ కుర్ర గ్యాంగ్.
హుక్కా సెంటర్లలో, బార్‌లలో అక్కడా, యిక్కడా నాలుగు పైసలు ఆర్జించుకోవడం, కేవలం తమ సాహస ప్రతాప ప్రదర్శనలకు పందేలు కాసుకోవడం, రైళ్లమీద పడటం- లోకల్ రైలు సాధారణంగా మూడు గంటలు ప్రయాణం చేస్తూంటుంది. దాంతో వీళ్ల ఆగడాలకు బోలెడు సమయం, అవకాశం. రైల్వే పోలీసులకు వీళ్లు ఒక తలనొప్పిగా తయారయినారు.
ఒక్క రోజులో మొన్న సోమవారం ఇరవై అయిదుమంది దొరికారు. గత మూడు మాసాలలో, 346మంది స్టంటు కుర్రాళ్లు పట్టుబడ్డారు. సినిమా స్టంటుని తలదనే్న రుూ స్టంట్స్ నిజంగా ప్రాణాలతో చెలగాటమే! మొన్న సోమవారం కార్జత్‌కు పోయే లోకల్ ట్రయిన్‌లో - ఘట్కాపార్ స్టేషన్‌లో త్రాగి మరీ రైలెక్కి ఎలక్ట్రిక్ పోల్స్‌ని తాకే ఆటఆడుతూ రాజాఖాన్, లక్ష్మణ్, అమిత్ అనే కుర్రాళ్లు రైలు పోల్ స్టంటుకి ఉదయం ఆరు గంటలకే పూనుకున్నారు. కుర్లా స్టేషన్ వస్తూండగా అందులో యిద్దర్ని కరెంట్ స్తంభాలు విసిరికొట్టాయి. చావు బ్రతుకులమధ్య ఊగిసలాడుతూ ఆసుపత్రిలో వున్నారు.
రైల్వే పోలీసులు పంథా మార్చారు. నిన్ననే వీళ్లందరినీ పట్టుకుని పెద్ద పెద్ద పూల దండలు తెచ్చి వాళ్ల మెడలో వేసి సత్కరించారు. ‘‘మీ స్టంట్ గొప్పగా వుంది. కానీ రైళ్లమీద చెయ్యొద్దు ప్లీజ్! మీ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేస్తాం’’ అంటూ హిత వాక్యాలు చెప్పారు. పాపం! కానీ, దెబ్బకి దెయ్యం ఝడుస్తుంది కానీ పూలదండలకా? ప్చ్.. అబ్బే!