సబ్ ఫీచర్

ఏటేటా ఎదగాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లలు ఏటేటా ఎదిగితేనే కన్నవారికి సంతోషం. ఆరోగ్యకరమైన జాతి సంపద సమాజానికి ఎంతో అవసరం. కాని దురదృష్టవశాత్తు మనదేశంలో పిల్లల్లో ఎదుగుదల లోపిస్తుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచంలోని కొన్ని దేశాలలో పిల్లల ఎదుగుదల సమస్య రానురాను తీవ్రరూపు దాల్చుతోంది. ఈ దేశాలనే ఱ్గన్ళిడ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) అని పిలుస్తారు. ఐదేళ్ల లోపు పిల్లలు 61.8 మిలియన్ల మంది ఉంటే వీరిలో 39శాతం మందిలో వారి వయసుకు తగ్గట్టు ఎదుగుదల లోపిస్తుందని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు జిమ్ యాంగ్ కిమ్ హెచ్చరిస్తున్నారు. ఇందులో భారతదేశం వాటా 24శాతం. పక్కనే ఉన్న బంగ్లాదేశ్, భూటాన్‌లలో సైతం పిల్లల ఎదుగుదల మనకంటే మెరుగ్గానే ఉండటం గమనార్హం. పిల్లల్లో ఎదుగుదల లోపిస్తే రానురాను వ్యక్తిగతంగానే కాకుండా ఆర్థికంగా కూడా తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడిస్తోంది. మధుమేహాం లాంటి వ్యాధులు వారిలో తలెత్తుతాయని వెల్లడిస్తోంది. ఈ ఐదు దేశాలలో రాబోయో 2025 సంవత్సరానికల్లా దాదాపు 127 మిలియన్ల చిన్నారులు ఎదుగుదల లేకుండా ఉంటారని అంచనావేస్తున్నారు. కాన్పు వెంటనే కాన్పు రావటం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తి ఎదుగుదల లోపిస్తుందని ఓ సర్వేలో వెల్లడైంది.

భూమికకు రచనలు
పంపాలనుకునే వారు రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా పిడిఎఫ్ ఫార్మాట్‌లో bhoomika@andhrabhoomi.netకు మెయల్ చేయవచ్చు.
లేదా ఈకింది చిరునామాకు పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, భూమిక, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్ , సికిందరాబాద్- 03