Others

ఫంక్షన్లకు ప్రత్యేకం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెళ్లయనా.. వేడుకైనా.. కాలేజీ ఫంక్షన్ అయనా.. ఎప్పుడూ వేసుకునే చుడీదార్లే వేసుకోవాలా...కొత్తవాటిని వేసుకుంటే నలుగురిలో ఆకర్షణీయంగా కనిపిస్తామనే ఆకాంక్ష ప్రతి యువతిలోనూ ఉంటుంది. ఫ్యాషన్ ప్రపంచంలో ఎప్పటి నుంచో ఆదరణ ఉన్న లెహంగా చీరలు, చోలీలు ఇటీవల కాలంలో కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తున్నాయి. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు హీరోయిన్లందరూ వీటికి ఫిదా అవుతున్నారు. ట్రెండ్ మార్చుకుని సరికొత్తదనంగా వస్తున్న ఇవి ఎంతో హుందాగా కనిపిస్తుంటాయి. ఉత్తర భారతంలో వీటికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. లెహంగా చొలీలు పెళ్లిళ్లకి, సంప్రదాయ వేడుకలకే కాకుండా ఆధునిక పార్టీలకు సైతం వేసుకువెళ్లినా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. రెగ్యులర్ డిజైన్లలో కాకుండా ఆర్ట్‌ప్రింట్స్, ఎథ్నిక్ ప్రింట్స్ వంటి వెరైటీలలో లభిస్తున్నాయి. గతంలో వలే ఒకే డిజైన్, ఒకే రంగు డ్రెస్స్ లేదా చీర అంతా పరిచినట్లు ఉండటం లేదు. ఫ్యాషన్ డిజైనర్లు ఆధునిక సొగసులు అద్దుతున్నారు. టాప్ బాడీ అంతటా ఒకే డిజైన్, రంగు ఇస్తే చేతులను పూర్తి కాంటాస్ట్‌లో డిజైన్ చేస్తున్నారు. ఫ్యాషన్ మార్కెట్ ట్రెండ్ పూర్తిగా మారిపోవటంతో వయసుతో సంబంధం లేకుండా చిన్నా పెద్దా... ఏ వయసు వారు వేసుకున్నా వాళ్ల కోసమే ఈ లెహంగాలు డిజైన్ చేశారా అన్నట్లు ఉంటున్నాయి.

***
భూమికకు
రచనలు
పంపాలనుకునే వారు
రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో bhoomika@andhrabhoomi.netకు మెయల్ చేయవచ్చు.
లేదాఈకింది చిరునామాకు
పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, భూమిక
ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్
సికిందరాబాద్- 03