మెయిన్ ఫీచర్

వీడిన వౌనవ్యథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ప్రజల శ్రేయస్సు కోసం ఆ రోజు నా బిడ్డ నా వద్దకు వచ్చింది. ఆశీర్వదించమని అడిగంది. తల్లిగా నా నుంచి ఓ వరం అడిగింది. అపుడు నా మనసుకు చల్లని గాలులు వీచే శీతాకాల సాయంత్రం వలే అనిపించింది’’ పదహారేళ్ల క్రితం ఇరోమ్ చాను షర్మిల నిరాహార దీక్ష చేపట్టిన రోజు జరిగిన సంఘటన గురించి 84 ఏళ్ల ఆమె తల్లి సఖిదేవి వెల్లడించిన స్ఫూర్తిదాయకమైన అభిప్రాయం. బిడ్డ కోసం ఆ తల్లి పదహారేళ్ల నుంచి ఎదురుచూస్తోంది. ఆ తల్లి నిరీక్షణ నేటికి ఫలించింది. ‘‘కన్నతల్లి కన్నబిడ్డ కడుపు చూస్తుంది’’ అని పెద్దలు ఊరకనే అనలేదు. అలాంటి వ్యవస్థలో ఉన్నాం. బిడ్డ ఆకలితో ఉంటే ఏ తల్లి కూడా కంటినిండా నిద్రపోలేదు. సఖిదేవి కూడా గత పదహారేళ్ల నుంచి నిద్రలేని రాత్రులే గడుపుతోంది. అక్షరం ముక్కరాని ఆ తల్లికి బిడ్డ ఆకలి తెలుసు. కాని గుప్పెడు మెతుకులు వండి పెట్టలేని స్థితి. పదహారేళ్ల నుంచి బొట్టు నీరు కూడా సేవించకుండా పోలీసు బలగాల మధ్య, ఆసుపత్రి బెడ్ మీద ఉన్న కూతురిని తలచుకుని రోదించని రోజు ఆమెకు లేదు. ఆ తల్లి వౌనవ్యథ ఎవ్వరు కనిపెట్టగలరు. నిర్వేదంతో..ఆశలు ఆవిరైపోతున్న వేళ... కన్న కూతురు షర్మిల చేసిన దీక్ష విరమణ ప్రకటన ఆ తల్లి గుండెల్లో పన్నీటి జల్లే కురిసింది.‘‘ఆ ఎఎఫ్‌ఎస్‌పిఎ యాక్ట్‌ను రద్దుచేయండి. ఐదురోజుల్లో నా బిడ్డ నాకళ్ల ముందు జీవిస్తుంది’’ అని ఎన్నోసార్లు కాళ్లావేళ్లాపడి వేడుకున్నా పాలకులు మనసు కరగలేదు. అయినప్పటికీ ఆమె గుండెను రాయి చేసుకుని జీవిస్తోంది.
ఆ రోజు షర్మిల తిన్నదే చివరి భోజనం. నా కాళ్లకు దణ్ణం పెట్టింది. బస్సు ఎక్కి ఇంపాల్ శివారు ప్రాంతమైన మాలమ్ బజార్‌కు వెళ్లింది. అక్కడ సత్యాగ్రహానికి కూర్చుంది. ఆప్పటి నుంచి ఆమె ఇంటి ముఖం చూడలేదు. ఒకవేళ సాంకేతిక కారణాలతో విడుదలైనా మళ్లీ 48 గంటల్లోనే ఆసుపత్రి గోడలు లేదా జైలు గోడల మధ్యకు తీసుకుపోయేవారు. 2006లో ఒక్కసారి ఆ తల్లీబిడ్డలు ఒకరినొకరు చూసుకోగలిగారు. ఎండిపోయిన పెదాలతో.. చింపిరి జుట్టుతో.. పిచ్చిదాని వలే కనిపించే కన్నబిడ్డను చూసిన ఏ తల్లి మనసైనా అగాధమైపోతుంది. ఎన్నోఏళ్లుగా మూగవేదన అనుభవిస్తున్న తల్లి సఖిదేవి మనసులో నేడు ఆనంద వీచికలు వీస్తున్నాయి.
పసితనంలో పిరికిది..
ఉక్కుమహిళగా పేరుపొందిన షర్మిల పసితనంలో చాలా పిరికిదట. మరి అలాంటి ఆమెకు ఇలాంటి తెగింపు ఎలా వచ్చిందో..! అక్కడ నెలకొన్న పరిస్థితులే ఆమెకు మనోధైర్యాన్ని నేర్పాయి. రెండు కిలోమీటర్ల దూరం నడిచి స్కూలుకు వెళ్లేది. పక్కనే ప్రభుత్వ పాఠశాల ఉన్నా ఆమెను తండ్రి ఆ స్కూల్లో చేర్పించలేదు. తెలుపు, ఎరుపు యూనిఫారమ్ ధరించేది. స్కూల్లో జరిగే ఆగస్టు 15, జనవరి 26, నవంబర్ 14 వేడుకలకు తప్పనిసరిగా హాజరయ్యేది. షర్మిల కన్నా 14 ఏళ్లు పెద్ద వయసు ఉన్న సోదరుడు సింగ్‌జిత్ చెల్లెలి పోరాటానికి మద్దతు పలికాడు. ఇంటర్మీడియట్ వరకు మాత్రమే చదువుకున్న షర్మిల చదువు పట్ల అంత శ్రద్ధ కనబరచేది కాదు. కనీసం డిగ్రీ కూడా చదవలేదు. షార్ట్‌హ్యాండ్ నేర్చుకుంది.
తల్లి సఖిదేవి ఎదురు చూపులు
రొమిత ఆమెకు చిన్ననాట స్నేహితురాలు. ఆమె ఇంటికి రెండిళ్లు ఆవల ఉండే స్నేహితురాలి ఇంటికి తరచూ వెళుతుండేది. సైకిళ్లు తొక్కుతూ పచ్చటి ఆ ప్రకృతిలో వారు ఆడుకునేవారు. ఆహార పానీయాలు లేక పెదాలు ఎండిపోయి, శరీరం శుష్కించుకుపోయినట్లు కనిపించే షర్మిల తన స్నేహితురాలి పెళ్లికి మాత్రమే నగలు ధరించి ముస్తాబయింది. ఆ తరువాత నుంచి ఆమె వాటికి దూరమైంది. స్నేహితురాలికి బిడ్డపుట్టే సమయానికి షర్మిల నిరాహారదీక్ష ప్రారంభించి ఆమెకు కనిపించనంత దూరంలో ఉండేది. అపుడపుడు రేడియోలో ఆమె గురించి వినేది. స్నేహితురాలు, ఆమె భర్త కలసి షర్మిలతో మాట్లాడటానికి వెళ్లినా.. దగ్గరకు వెళ్లనివ్వకపోవటంతో ఆసుపత్రి కిటికీ గుండా చూసి వచ్చేసింది. నేడు తన స్నేహితురాలు జనజీవన స్రవంతిలోకి వస్తుండటంతో ఆమె మానసిక స్థితికి ఏ విధంగా ఉంటుందో...
రూమ్ నెంబర్ ఒకటి
ఇంపాల్‌లోని జవహర్‌లాల్ నెహ్రు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సన్స్ ఆసుపత్రిలోని రూమ్ నెంబర్ ఒకటిలో షర్మిల తన నిరాహారదీక్ష కొనసాగిస్తోంది. అక్కడ ఓ టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ నిండా ఆమెకు మద్దతుదారుల నుంచి వచ్చిన ఉత్తరాలు ఉంటాయి. రోజుకు కనీసం ఆరు ఉత్తరాలైనా వస్తుంటాయి. దేశ విదేశాల నుంచి సైతం ఉత్తరాలు

వస్తుంటాయి. గోడల నిండా ఇరీష్, ట్వీట్ పక్షుల బొమ్మల స్టిక్కర్స్ అతికించి ఉంటాయి. వీడియోలు తీయటానికి
వీల్లేదు. ముఖ్యమైన సందర్శకులు సైతం 20 నిమిషాలకు మించి
ఉండకూడదు. విభిన్న ప్రాంతాల ప్రజలు బహుమతిగా ఇచ్చిన పోస్టర్లు గోడల నిండా అతికించి పెట్టుకుంది.
గునియా పందులే నేస్తాలు
షర్మిల వద్ద రెండు గునియా పంది పిల్లలు పెరుగుతుంటాయి. వాటిని ‘్ధయి’ అని పిలుస్తోంది. ఒక్కొక్కసారి అర్థరాత్రి సైతం లేచి వాటిని చూసి నిద్రిస్తోంది. చిన్నప్పటి నుంచి పెంపుడు జంతువులు, పక్షులను ఇష్డపడే ఆమె వాటినే తన ఒంటరి జీవితంలో నేస్తాలుగా చేసుకుంది. కొంతమంది ఆమెను పిచ్చిది అంటారు. మరికొంతమంది ఆమెకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు అని అంటారు. ఎవరు ఎన్ని పుకార్లు పుట్టించినా పదహారేళ్ల నుంచి ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్న ఇరోమ్ చాను షర్మిల ఖాళీ సమయంలో కవితలు రాస్తుంది. పుస్తకాలు చదువుతుంది.
ఆహ్వానం పలుకుతున్న ప్రజానీకం
గత పదహారేళ్ల నుంచి నిరాహారదీక్ష చేస్తున్న ఆమెకు ప్రజల మద్దతు మెండుగానే ఉంది. జనజీవన స్రవంతిలోకి వచ్చి జీవితాన్ని గడపాలని ఆమె మద్దతుదారులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఆ రాష్ట్రంలో అడుగంటుతున్న మానవహక్కులు, మహిళల హక్కుల కోసం పోరాడే ఎన్నో సంస్థలు ఆమెను తమ సభలకు ఆహ్వానించి మాట్లాడించాలని చేసిన ప్రయత్నాలు ఏవీ కూడా నేటి వరకు ఫలించలేదు. ఆసుపత్రి నుంచి ఆమెను పాలకులు అడుగుముందుకు వేయనీయకుండా ఆంక్షలు విధించారు.
ఈ ఆంక్షల సుడిగుండం నుంచి ఆమె బయటకురావటానికి వెనుక సొంత ప్రయోజనం లేకున్నా ఎన్నో పుకార్లు ఆమెను వెన్నాడుతూనే ఉన్నాయి. మానవహక్కుల కార్యకర్తగా యువప్రాయం నుంచే పనిచేసిన ఆమెప్రజాప్రతినిధిగా ఎన్నికై.. ఆ యాక్ట్‌పై పోరాడాలని నిర్ణయించుకున్నట్లుంది. ఆమె ప్రకటన వెలువడిన వెంటనే యూత్ నుంచి విపరీతమైన మెస్సేజ్‌లు వెళుతున్నాయ. ‘‘మణిపూర్ గురించి ఆమె ఒక్కరు మాత్రమే ఉపవాసాలు ఉండటం ఏమిటి? ఆమె పోరా టం వెనుక మేమున్నాం. ఆమె దీక్ష విరమిస్తున్నట్లు ప్రకటించటం మాకెంతో సంతోషంగా ఉంది’’ అని వెల్లువెత్తిన మెస్సేజ్‌లే ఆమె పట్ల యువతకు ఉన్న అభిమానాన్ని వెల్లడిస్తోంది. ఏది ఏమైనప్పటికీ సంకల్ప బలం తో దీక్ష చేస్తున్న ఆమె జనజీవనస్రవంతిలోకి వచ్చి ప్రజామద్దతుతో తన ఆశయాన్ని సాధించగలదని ఆశిద్దాం.

పదహారేళ్ల ఆ తల్లి నిరీక్షణ ఫలించిన వేళ ప్రజామద్దతుతో షర్మిల
మరో పోరాటానికి శ్రీకారం ఆహ్వానం పలుకుతున్న ప్రజానీకం

రోజుకు కనీసం ఆరు ఉత్తరాలైనా వస్తుంటాయి. దేశ విదేశాల నుంచి సైతం ఉత్తరాలు వస్తుంటాయి. గోడల నిండా ఇరీష్, ట్వీట్ పక్షుల బొమ్మల స్టిక్కర్స్ అతికించి ఉంటాయి. వీడియోలు తీయటానికి వీల్లేదు. ముఖ్యమైన సందర్శకులు సైతం 20 నిమిషాలకు మించి ఉండకూడదు. విభిన్న ప్రాంతాల ప్రజలు బహుమతిగా ఇచ్చిన పోస్టర్లు గోడల నిండా అతికించి పెట్టుకుంది.

ఆ రోజు షర్మిల తిన్నదే చివరి భోజనం. నా కాళ్లకు దణ్ణం పెట్టింది. బస్సు ఎక్కి ఇంపాల్ శివారు ప్రాంతమైన మాలమ్ బజార్‌కు వెళ్లింది. అక్కడ సత్యాగ్రహానికి కూర్చుంది. ఆప్పటి నుంచి ఆమె ఇంటి ముఖం చూడలేదు. ఒకవేళ సాంకేతిక కారణాలతో విడుదలైనా మళ్లీ 48 గంటల్లోనే ఆసుపత్రి గోడలు లేదా జైలు గోడల మధ్యకు తీసుకుపోయేవారు. 2006లో ఒక్కసారి ఆ తల్లీబిడ్డలు ఒకరినొకరు చూసుకోగలిగారు. ఎండిపోయిన పెదాలతో.. చింపిరి జుట్టుతో.. పిచ్చిదాని వలే కనిపించే కన్నబిడ్డను చూసిన ఏ తల్లి మనసైనా అగాధమైపోతుంది. ఎన్నోఏళ్లుగా మూగవేదన అనుభవిస్తున్న తల్లి సఖిదేవి మనసులో నేడు ఆనంద వీచికలు వీస్తున్నాయి.

సోదరుని
ఆంతరంగికం

ఆది నుంచి ఆమె పోరాటానికి వెన్నంటే ఉన్న ఆమె సోదరుడు షర్మిల ప్రకటన తెలిసి అచ్చెరవొందాడు. అనారోగ్య కారణాల రీత్యా గతకొన్ని రోజుల నుంచి ఆమెతో మాట్లాడటం లేదని, ఎన్నోసార్లు దీక్ష విరమించమని కోరినవారిలో తాను ఒకడిని. ఆమె ఆకస్మిక నిర్ణయం తనకు ఆశ్చర్యం కలిగించిందని వెల్లడించాడు.