మెయిన్ ఫీచర్

అడవి బిడ్డల అమ్మ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

...................
దక్షిణ కోల్‌కతాలోని నిరాంబరమైన ఫ్లాట్ అది. ఆ ఇంటిలోకి అడుగుపెడితే అక్కడి డ్రాయింగ్ రూమ్‌లోని పుస్తకాలన్నీ అమాయక అడవి బిడ్డల కష్టాలు, కన్నీళ్ల వేదన కథలు కథలుగా వినిపిస్తాయి. ఇం కొంచెం ముందుకు వెళ్లి బెడ్‌రూమ్‌లోకి తొంగిచూస్తే.. అక్కడ నలిగిపోయిన చీర తో అడవి బిడ్డల మధ్య మాతృత్వం ఉట్టిపడేలా చెరగని చిరునవ్వుతో ఓ స్ర్తిమూర్తి కనిపిస్తోంది. ఆమే లెజండరీ, రచయిత్రి మహాశే్వతాదేవి. అమాయక గిరిజనులు పుస్తకాల్లోనే కాదు ఆమె ఇంట్లోనూ కనిపిస్తారు. వారికి మరమరాలతో చేసిన తినుబండారాలు పెడుతుంటుంది. ఇపుడు ఆ చిరునవ్వు చెదిరిపోయినా ఆమె జ్ఞాపకాలు మాత్రం వారి గుండెల్లో పదిలం.
..................

‘‘సాధారణ ప్రజలే చరిత్ర సృష్టిస్తారు’’ అని చెప్పే శే్వతాదేవి గిరిజనుల కోసమే పుట్టారు. వారి కోసం తన జీవితాన్ని అర్పించారు. మూడు దశాబ్దాల వామపక్షఫ్రంట్ పాలనను కూలదోస్తేనే ఈ రాష్ట్రంలో చీకటి రోజులు పోయి వెలుగు రేఖలు ఉదయిస్తాయని ఎలుగెత్తిన ఆమె గళం..కలం పశ్చిమబెంగాల్ రాష్ట్ర పారిశ్రామిక విధానాన్ని తూర్పారబట్టారు. అదే సందర్భంలో అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్‌ను కూడా ఆమె నిశితంగా విమర్శించారు. మమతాబెనర్జీ కూడా అదే బాటలో పయనిస్తుందని, ఇలాంటి పోకడలను ప్రజలు ఎంతోకాలం సహించరని ధైర్యంగా విమర్శించిన ధీర. గిరిజన గ్రామాలకు వెళ్లి వారి కష్ట సుఖాలను తెలుసుకొని వాటికి అక్షర రూపాన్ని ఇచ్చిన ఆమె అక్కడ బస చేసినపుడు వారు ఏది పెట్టినా ఎంతో ఇష్టంగా తినేవారు. చివరకు ఎలుక మాంసాన్ని మధ్యాహ్న భోజనంలో పెట్టినా ఎలాంటి ఏవగింపు లేకుండా భుజించేది. నిస్వార్థంతో వారి హక్కుల కోసం పోరాడిన ఆమె వారి జీవితానికే అంకితమైంది. మహావృక్షంలాంటి ఆమె నీడలో ఎంతో మంది సాహితీవేత్తలు తీర్చిదిద్దబడ్డారు. ఎంతో మంది సాహితీవేత్తలు తమ పుస్తకాలకు మందుమాట రాయమంటే అది తన బాధ్యతగా రాసిచ్చేవారు. ఇలా ఎన్నో అవార్డులు రివార్డులను సొంతం చేసుకున్న మహా శే్వతాదేవికి వ్యక్తిగతంగా ఎన్ని బాధలు ఉన్నా వచ్చిన వారిని అభిమానంతో, ఒక ప్రత్యేక చిరునవ్వుతో ఉండేవారు. ఒక విధంగా పీడితుల జీవిత కథాంశాలను ఎంపిక చేసుకుని తన రచనలు చేసుకున్న ఆమె వారి బాధలనే తన జీవితాన్ని ఇటుకులుగా చేసుకున్నారని మజుంధార్ లాంటి ప్రముఖ రచయిత అంటారు.

మహాశే్వతాదేవితో ఓ రచయిత్రి అనుబంధం

నా కుటుంబంలోని తాత దగ్గర నుంచి తండ్రి వరకు అందరూ రచయితలే. దీంతో కాస్తో కూస్తో ఆ పరిమళం నాకు అంటింది. ఓ రోజు మా నాన్నగారు ‘‘నీకు ఈ రోజు ఓ గొప్ప వ్యక్తిని చూపిస్తాను’’ అని అన్నారు. అపుడు నా వయసు తొమ్మిదేళ్లు. మా నాన్నగారు ఓ ఇంటికి తీసుకువెళ్లారు. ఓ మధ్య వయస్కురాలి వద్దకు తీసుకువెళ్లి కాళ్లకు నమస్కరించమన్నారు. ఆ రోజును ఇప్పటికీ మరచిపోలేను. నలిగి పోయిన చీర కట్టుకున్న ఆమె కాళ్లకు నమస్కరించిన తరవాత తెలిసింది. ఆమె మహా శే్వతాదేవి అని. ఆమె నన్ను లేపి చెక్కిళ్లమీద ముద్దాడింది. నా పేరు అడిగింది. నీవు ఈ ప్రపంచానికి ఇంద్రాణి అని మాత్రమే తెలుసు. కాని నాకు మాత్రం నీవు‘క్రిస్టేన్ రాజకుమారి’ అని దీవించింది. - ప్రముఖ బెంగాల్ రచయిత్రి ఇంద్రాణి రాయ్

‘మహాశే్వత’ జీవితంలోని
కొన్ని విశేషాలు

1926లో బంగ్లాదేశ్‌లోని ఢాకాలో జన్మించిన ఆమె కుటుంబం ఇండియాకు
వలసవచ్చింది.
ఆమె తల్లిదండ్రులు కూడా గొప్ప రచయితలే. ఆమె తండ్రి పశ్చిమబెంగాల్‌లో
సాహిత్య ఉద్యమకారులలో ఒకరు. అంతేకాదు కల్లోల్ అనే ఉద్యమాన్ని నడిపించారు.
కోల్‌కతా యూనివర్శిటీ నుంచి ఎం.ఏ ఇంగ్లీషులో పట్టా తీసుకున్న మహాశే్వతాదేవి
ప్రముఖ నాటక రచయిత భట్టాచార్యను వివాహమాడారు. 1959లో
ఆయన నుంచి విడాకులు తీసుకున్నారు.
ఆమె తండ్రి ఇండియన్ పీపుల్స్ ధియేటర్ అసోసియేషన్ వ్యవస్థాపకులు.
కుమారుడు నబరన్ భట్టాచార్య కూడా గొప్ప రచయిత.
బీహార్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, గుజరాత్ తదితర రాష్ట్రాల్లోని గిరిజనుల దయనీయ
జీవితాలే ఆమె కథా వస్తువులు.
సబార్ గిరిజనులు హక్కుల కోసం పోరాడుతున్నపుడు ఆమెను ‘ది మదర్ ఆఫ్ ది సబార్స్’
అని పిలిచేవారు.
పారిశ్రామికవేత్తలు గిరిజనుల భూములను కబళించాలని
ప్రయత్నించినపుడు ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు.
గిరిజనుల కోసం ప్రత్యేక మ్యాగ్‌జైన్‌ను నిర్వహించారు.
1984లో అధ్యాపక వృత్తిని వదిలివేసి
పూర్తిగా గిరిజనుల జీవితాల కోసమే ఆమె అంకితమై
తన రచన ప్రవృత్తిని కొనసాగించారు.
ఆమె కలం నుంచి వచ్చిన కథలు ఎన్నో
హిందీ సినిమాలుగా
రూపుదిద్దుకున్నాయి. అందులో
హజార్, చౌరాసీకి మా, సంఘర్ష్,
గంగార్, రుడాలి,
మాలిమే కొన్ని మాత్రమే. రుడాలి సినిమాకి
అవార్డు సైతం వచ్చింది.
గిరిజనుల సంక్షేమం కోసం ఆమె
చాలా సంస్థలను స్థాపించి వారి
అభ్యున్నతికి కృషిచేశారు.
ఆమె కలం నుంచి వంద నవలలు, 22 కథలు
వెలువడ్డాయి.
పద్మ విభూషణ్, మెగాసెసె, సాహిత్య అకాడమీ,
జ్ఞానపీఠ అవార్డులు వరించాయ.

మహాశే్వతాదేవి నుంచి ఆశీర్వాదం తీసుకుంటున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ

-టి.ఆశాలత