మెయిన్ ఫీచర్

వివేచనతో ముందడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక మనిషి సమస్యల్లో మునిగినపుడు స్పందించేవారు, ఆదరించేవారు. ఇప్పుడవి లేవు. ఉదయం లేచిన దగ్గర్నుంచి ఉరుకులు పరుగులు తీస్తేగాని గడవని దుస్థితి. ఎవరి జీవన విధానం వారికే బరువైపోయింది. స్వార్థం, అవసరాలు చుట్టూ మానవ సంబంధాలు. సమస్యల్లో మునిగి మనిషిని పట్టించుకునే సమయం ఎవరికీ లేదు. ఎదురుచూడ్డం కూడా తప్పే. సమస్యలు లేనివారంటూ ఎవ్వరూ వుండరు. మొదలు నరకబడ్డ వృక్షం మళ్లీ చిగురించినట్టే ఒకే చోట నష్టపోయాం అంటే మరో కొత్త లాభం కోసం ప్రయత్నించాలి. అంతే తప్ప పోగొట్టుకున్నదాని గురించి బాధపడుతూ వర్తమానాన్ని ఫణంగా పెట్టకూడదు.

ఏ వార్తాపత్రిక తిరగేసినా ప్రతిరోజు కనీసం నాలుగైదు ఆత్మహత్యలు వార్తలు కనిపిస్తుంటాయి. ఒక్కో ఆత్మహత్యకి ఒక్కో కారణం. ఆత్మహత్య అంటే మనసు చంపుకుని తమని తాము హత్య చేసుకోవడమే. వేగంగా మారిపోతున్న సామాజిక, ఆర్థిక పరిస్థితులు, అధిక జనాభా దానికి అనుగుణంగా సౌకర్యాలు రాను రాను క్షీణించిపోవడం. అదనపు కట్నాలు, లైంగిక దుశ్చర్యలు ఆత్మహత్యలకు కారణవౌతున్నాయి. పరీక్షల్లో ఫెయిలయినప్పుడో లేక తాము కోరుకున్నది జరగనప్పుడో బలహీన మనస్కులు ఈ విధమైన చర్యలకి ఒడిగడుతుంటారు. చిన్న చిన్న సమస్యలకి సైతం నిండు ప్రాణాల్ని తీసుకోవడం పరిపాటి అయింది. ఇలా ఆత్మహత్యలకు పాల్పడేవారిలో శారీరక హింసలకంటే మానసిక బాధలు పడేవారిలోనే ఎక్కువ శాతం అని పరిశోధనలు చెబుతున్నాయి. దూరదృష్టి లేకపోవడం, ఒకే సమస్యని పదే పదే ఆలోచించచడం, బాధలన్నీ తమకు వున్నట్లుగా పీలవ్వటం వంటివి సున్నిత మనస్కుల్ని తేలికగా ప్రభావితం చేస్తున్నాయి.
తాము కళ్ళముందున్నంతవరకు ఎదుటివారికి తమ విలువ తెలియటం లేదనీ, తాము కనిపించకుండా పోయినపుడే వారికి తమ గురించి తెలుస్తుందని అనే కక్షసాధింపు చర్యతో ప్రాణాల్ని బలితీసుకునేవారిని మనం అనేక మందిని చూస్తుం టాం. సమాజానికి తాము భారమవుతున్నాం, చనిపోయి ఏదో సాధించవచ్చు అన్నది కొందరి భావన. కానీ ఒక మనిషి చనిపోయాడు అంటే నెలల తరబడి దుఃఖంలో మునిగిపోయే దశ నుంచి వెంటనే తేరుకుని తిరిగి జీవనగమనంలో మునకలవుతున్న రోజులివి. పూర్వం ఉమ్మడి కుటుంబాలుండేవి. అనుబంధాలు, ఆప్యాయతలు వుండేవి.
ఒక మనిషి సమస్యల్లో మునిగినపుడు స్పందించేవారు, ఆదరించేవారు. ఇప్పుడవి లేవు. ఉదయం లేచిన దగ్గర్నుంచి ఉరుకులు పరుగులు తీస్తేగాని గడవని దుస్థితి. ఎవరి జీవన విధానం వారికే బరువైపోయింది. స్వార్థం, అవసరాలు చుట్టూ మానవ సంబంధాలు. సమస్యల్లో మునిగి మనిషిని పట్టించుకునే సమయం ఎవరికీ లేదు. ఎదురుచూడ్డం కూడా తప్పే. సమస్యలు లేనివారంటూ ఎవ్వరూ వుండరు. మొదలు నరకబడ్డ వృక్షం మళ్లీ చిగురించినట్టే ఒకే చోట నష్టపోయాము అంటే మరో కొత్త లాభం కోసం ప్రయత్నించాలి. అంతే తప్ప పోగొట్టుకున్నదాని గురించి బాధపడుతూ వర్తమానాన్ని ఫణంగా పెట్టకూడదు.
చీకటి తర్వాత వెలుతురు వున్నట్టే కష్టం తరువాత సుఖం వుంటుంది. సమస్యలన్నిటికీ పరిష్కారాలు మన చేతుల్లో లేకపోయినా బ్రతుకు, మరణం అనేవి మన చేతుల్లోనివే. వివేచనతో కూడుకున్న ఆలోచనలు భవిష్యత్తులో చక్కటి ఫలితాలనిస్తాయి. ఉద్యో గం కోసం కష్టపడి చదవటం, భవిష్యత్తు అవసరాల కోసం డబ్బు సంపాదన వంటివన్నీ ఎలాగో, సమస్యలు వచ్చినపుడు కనీసం ఒక్క ఆత్మీయుడ్ని సంపాదించుకోవటం కూడా అటువంటిదే. తెలివి తక్కువ ఆలోచనలకి మనసు ద్వారాలు మూసేయండి. మన చుట్టూ విస్తృత ప్రపంచం వుంది. ఒక దాంట్లో విఫలమైనపుడు మరో కొత్త విధానం ఎన్నుకుని హాయిగా గడిపేయొచ్చు. ఉండవలసిందల్లా మనపై మనకు విశ్వాసం మాత్రమే.

- బి.మాన్‌సింగ్ నాయక్