మెయిన్ ఫీచర్

పాతికేళ్లు నిండితే.. పగ్గాలు వేయాల్సిందే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండు పదులు దాటిన పరువం..జోరుగా..హుషారుగా సాగే సమయం. సాహసంతో సాగిపోవాలని కలలుకనే యువప్రాయం. ఈ తరుణంలో కేరింతలు, తుళ్లింతలతో పాటు వయసు 25ఏళ్లకు చేరువకాగానే ఆచీతూచీ అడుగు వేయాలని నిపుణులు చెబుతున్నారు. సంతోషాన్ని సొంతం చేసుకునేందుకు సాగరాన్ని సైతం ఈదెయ్యాలని తహతహలాడటంలో వెనుకంజ వేయనక్కర్లేదు కాని నిదానంగా జీవన ప్రయాణం సాగిస్తూ.. శారీరక దారుఢ్యంతో అనుకున్న లక్ష్యాలను సొంతం చేసుకునేందుకు జీవన ప్రయాణం సాగించాలి. జీవితం హాయిగా...సాఫీగా సాగిపోవాలంటే కనీసం ఏడంటే ఏడు విషయాలను మదిలో పదిలపరుచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అవేమిటో చూద్దాం.

ఈ వయసులో ప్రయాణాలేమిటి? హాయిగా నెట్టింట్లో కూర్చొని సరదాగా కాలం గడిపేయవచ్చు అనుకోవద్దు. కుటుంబ సభ్యులతోగానీ, స్నేహితులతోగానీ కలిసి సరదాగా ప్రయాణాలు చేస్తేనే మంచిది. ఎక్కడకైనా వెళ్లండి అక్కడ నెలకొన్న విభిన్న సంస్కృతులు, ప్రజల జీవనశైలి గురించి తెలుసుకోవచ్చు. ఇతర సంస్కృతులను చూడటం, వారి ఆచారాలను గమనించటం వల్ల చక్కటి సామాజిక స్పృహ అలవడుతోంది.
పొదుపు మంత్రం
డిగ్రీ అయిపోగానే యువత కొలువు కోసం తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. ఉద్యోగం లేకపోతే భవిష్యత్తులో ఏకాకిగా మిగలాల్సి వస్తుందని భావిస్తోంది. సంపాదనతో ఎంతో కొంత స్వేచ్ఛ లభిస్తోంది. దీంతో సంపాదిస్తున్నామనే ధీమాతో వచ్చిన జీతాన్ని పార్టీలు, పబ్బ్‌లు, షికార్ల పేరుతో ఖర్చుచేసేందుకు ఉవ్విళ్లూరుతుంటారు. కాని ఈ సమయంలో రేపటి భవిష్యత్తుకు కొంత వెనుకోసుకోవటం మంచిది. సేవింగ్స్ రూపంలో భద్రం చేసుకోవటానికి అలవాటుగా చేసుకోవాలి.
స్టాక్‌మార్కెట్లలోనూ, ప్రాపర్టీ కొనుగోలు కోసం, ఉన్నత విద్యకు ఉపయోగపడేందుకు, కారు కొనుగోలుచేయటం తదితర వాటిని సమకూర్చుకోవటానికి ఈ పొదుపే అక్కరకు వస్తుంది. ఈ వయసులో సంపాదించుకున్నదంతా షికార్లకు, సరదాలకు ఖర్చుచేస్తే కష్టాలు కొనితెచ్చుకున్నవారవుతారు. కొంత వేనుకేసుకుంటే భవిష్యత్తుకు భరోసాను మీకుమీరే కల్పించుకున్నవారవుతారు.
కొంత సమయాన్ని
ఏకాంతంగా...
చుట్టూ నలుగుర్ని పోగేసుకుంటేనే హీరో అయిపోతాం అనే అనుకుంటే పొరపాటే. కాస్తంత ఏకాంత జీవితం గడిపితే జీవితం విలువను తెలుసుకోగలుగుతారు. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవాలంటే కొం త సమయాన్ని ఒంటరిగా గడపటానికి ప్రయత్నించండి. ఇది భావిజీవితానికి మరింతగా ఉపకరిస్తోంది. ముఖ్యంగా తల్లిదండ్రులను వదలి ఉన్నత చదువుల కోసం విదేశాలకో, ఇతర ప్రాంతాలకో వెళ్లాల్సి వచ్చినపుడు మీకు ఎలాంటి మానసిక ఇబ్బందులు లేకుండా హాయిగా గడపటానికి ఉపకరిస్తోంది. మీరు ఎక్కడికైతే వెళతారో అక్కడ ఓ చిన్ని ప్రపంచాన్ని నిర్మించుకుంటే మరీ మంచిది.
మైలురాళ్లను అధిగమించేందుకు..
ఈ వయసులో ఒక్కొక్క మైలురాయిని అధిగమించేందుకు యువత ప్రయత్నించాలి. అడివిలో ఆడుకోవాలని ఉవ్విళ్లూరవచ్చు. ఆకాశాన్ని అందుకోవాలని తహతహలాడవచ్చు. వీటన్నింటికంటే ముందు జీవితాన్ని సీరియస్‌గా తీసుకుంటే ఏమి సాధించాలనుకుంటారో అవగహనకు వస్తారు. అపుడు ఒక్కొక్క మైలురాయిని అధిగమించేందుకు ప్రయత్నాలు ఆరంభిస్తారు. వాటి కోసం కన్న కలలను సాకారం చేసుకోగలరు.
సామాజిక సేవకు కొంత సమయం..
ఈ వయసులో ఏదైనా మంచి పని చేయాలనే ఆలోచనలను మనసులోకి రానిస్తే..మరింత మంచిది. తోటి స్నేహితులను కలుపుకుని సరదాగా..అభిప్రాయాలను, ఆలోచనలను పంచుకోవటంతో పాటు స్వచ్ఛంద సేవకు సమాయత్తమవ్వాల్సిన అవసరం కూడా ఉంది. మీరే ఎదైనా ఎన్జీఓ సంస్థను ఏర్పాటుచేసుకోవచ్చు. లేదా స్వచ్ఛంద సంస్థల్లో వలంటీర్‌గా పనిచేయవచ్చు. అనాథలు, వృద్ధుల కోసం కాస్తంత సమయాన్ని కేటాయిస్తే మీలో దయాగుణం అలవడుతోంది.

కసరత్తులకు
కాస్తంత సమయం
యవ్వనం తొణకిసలాడే ఈ ప్రాయం లో ఉసూరుమంటూ ఉంటే కన్నవారికే కాదు స్నేహితులకు సైతం దూరం అవుతారు. అందుకే కాస్తంత ఫిట్‌నెస్ కోసం మీ సమయాన్ని కేటాయిస్తే శారీరక ఆరోగ్యం సమకూరుతుంది. శారీరక ఆకృతికి కూడా ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఇపుడు మీరు చేసే వ్యాయా మం 50-60 సంవత్సరాలపుడు అది ఎంతోగానో ఉపకరిస్తోంది.
పెంపుడు జంతువుల పట్ల మమకారం
పెంపుడు జంతువులను పెంచాలనే కోరికను మనసులో నింపుకోండి. మీరు పెంపుడు జంతువుల పట్ల చూపే మమకారం అది మీ జీవితాన్ని సైతం ప్రేమించేలా ప్రేరణ కలిగిస్తుందని ఇటీవల జరిపిన అధ్యయనాల్లో వెల్లడైంది.
జీవితమే చాలెంజ్
జీవితాన్ని ఛాలెంజ్‌గా తీసుకున్నవారే పైకిరాగలరు. కొత్తదనం కోసం వెంపర్లాడేవారు సాహసంతో ముందడుగు వేయగలరు. అలాంటి ఉపాధి అవకాశాలు నేడు బోలెడున్నాయి. వాటిని అందిపుచ్చుకోవటమే తరువాయి. స్కూబా డైవింగ్ లాంటివాటిల్లో శిక్షణ తీసుకుంటే వినోద, పర్యాటక రంగంలో అవకాశాలు సంపాదించవచ్చు. ఇలాంటి ఉపాధి అవకాశాలు యువతకు ఎంతో మంచిది. ఇవన్నీ జీవితంలో ఆచరణలో పెడితే ధీరులై ఎదుగుతారు.. సమస్యలు,సవాళ్లను అధిగమిస్తారు. మరి ప్రయత్నించండి.

చుట్టూ నలుగుర్ని పోగేసుకుంటేనే హీరో అయిపోతాం అనే అనుకుంటే పొరపాటే. కాస్తంత ఏకాంత జీవితం గడిపితే జీవితం విలువను తెలుసుకోగలుగుతారు.మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవాలంటే కొంత సమయాన్ని ఒంటరిగా గడపటానికి ప్రయత్నించండి. ఇది భావిజీవితానికి మరింతగా ఉపకరిస్తోంది. ముఖ్యంగా తల్లిదండ్రులను వదలి ఉన్నత చదువుల కోసం విదేశాలకు, ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినపుడు మీకు ఎలాంటి మానసిక ఇబ్బందులు లేకుండా హాయిగా గడపటానికి ఉపకరిస్తోంది.

భూమికకు రచనలు
పంపాలనుకునే వారు
రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో bhoomika@andhrabhoomi.netకు మెయల్ చేయవచ్చు.
లేదాఈకింది చిరునామాకు
పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, భూమిక
ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్
సికిందరాబాద్- 03

-టిఎఎల్