ఐడియా

చర్మం సహజంగా మెరవాలంటే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చర్మం సహజంగా కాంతివంతంగా మెరవాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సరి. అలాంటి మెరుపు మీ సొంతం అవుతుంది. అవేమిటో చూద్దాం.
రెండు చెంచాల పాలపొడిలో కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. ఈ పూతతో చర్మం శుభ్రపడుతోంది. అందంగానూ మారుతుంది.
కొన్నిసార్లు చర్మం మంటపుట్టినట్లు అనిపిస్తుంటుంది. అలాంటప్పుడు ఒట్స్‌ప్యాక్ వేసుకోవాలి. పావుకప్పు కన్నా కొద్దిగా తక్కువగా ఓట్స్ తీసుకుని ఓ ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి. దీన్ని మళ్లీ గుజ్జులా చేసి, చెంచా నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. పూర్తిగా ఆరాక కడిగేసుకుంటే చర్మం మృధువుగా, కోమలంగా మారుతుంది.
చల్లని టీ డికాక్షన్, రెండు చెంచాల బియ్యప్పిండి, అరచెంచా తేనె తీసుకోవాలి. అన్నింటిని బాగా కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలి. ఫలితంగా చర్మంపై ఉండే మృతకణాలు తొలగిపోవడమేకాదు, తేనె వల్ల చర్మానికి అవసరమైన తేమ కూడా అందుతుంది. ముఖం తాజాగానూ కనిపిస్తోంది.