Others

ఐక్యతారాగంలో మువ్వనె్నల గీతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజల్లో ఐక్యతను పెంపొందించడమే లక్ష్యంగా 70వ స్వాతంత్య్ర దిన వేడుకల వేళ దేశవ్యాప్తంగా ‘తిరంగా యాత్ర’ చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ బిజెపి శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నెల 9 నుంచి 23 వరకూ నిర్వహిస్తున్న తిరంగా యాత్ర సందర్భంగా నాలుగు భాషల్లో నేపథ్యగీతాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్య్రం సిద్ధించి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘ సత్తర్ సాల్ ఆజాదీ-జరా యాద్ కరో కుర్బానీ’ (70 ఏళ్ల స్వాతంత్య్రం-త్యాగాలను స్మరించుకుందాం) ఇతివృత్తంతో రూపొందించిన స్ఫూర్తిదాయక గీతాన్ని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ కళాకారుడు గజల్ శ్రీనివాస్ స్వరపరిచారు. మరోవైపు సమరయోధుల త్యాగాలను వాడవాడలా ప్రచారం చేసేందుకు తిరంగా యాత్రలో ప్రాధాన్యం ఇస్తారు. కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా దేశ స్వాతంత్య్రం కోసం కృషిచేసిన వారిని స్మరించుకునేందుకు ఈ యాత్ర ఒక అవకాశం అని ప్రధాని పేర్కొన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల జన్మస్థలాల్లో కేంద్రమంత్రులు పర్యటించాలని, పార్టీ ఎంపీలు ద్విచక్ర వాహనాలతో ర్యాలీలు జరపాలని ప్రధాని పిలుపునిచ్చారు.