మెయిన్ ఫీచర్

అవగాహనే విజయానికి ఆలంబన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తశుద్ధి, అకుంఠిత దీక్షతో పనిచేస్తే మహిళలు ఏ రంగంలోనైనా పురుషులకు ధీటుగా రాణించగలరు అని నిరూపించారు కర్ణాటకకు చెందిన జెస్సికా లారెన్స్. వస్త్ర ప్రపంచంలో (వ్యాపారంలో) పురుషాధిక్యత ఎక్కువ. అటువంటి వస్త్ర వ్యాపారంలో జెస్సికా నేతృత్వంలో వున్న గార్మెంట్స్ కంపెనీలకు ధీటుగా లారెన్స్ క్లాతింగ్ అనే సంస్థను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. నేటికి ఆమె తమ గార్మెంట్ ఫ్యాక్టరీలో ఎవరైనా కార్మికుడు విధులకు హాజరు కాకపోతే, సదరు కార్మికు డు చేసే పనిని ఆమె చేస్తారు. వ్యాపారంలో రాణించాలంటే, చేస్తున్న వ్యాపారం పట్ల సంపూర్ణ అవగాహన ఉండటమేనని, అదే తన విజయ రహస్యమంటారు జెస్సికా లారెన్స్. తన దృష్టిలో యజమానే మొదటి కార్మికుడు అని సగర్వంగా చెప్పే జెస్సికా విజయ ప్రస్థానం ఇలా సాగింది.
జెస్సికా లారెన్స్ 15 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు, ఆమె తల్లి తొమ్మిది కుట్టుమిషన్లు తీసుకువచ్చారు. 1984లో ఆమె తొమ్మిదిమంది కార్మికులతో చిన్న గార్మెంట్ ఫ్యాక్టరీని ఏర్పాటుచేశారు. ‘ఇంతింతై వటుడింతై..’ అన్న చందాన జెస్సికా ఏర్పాటుచేసిన ‘లారెన్స్ క్లాతింగ్’ సంస్థ ప్రస్తుతం ఐదు యూనిట్లు స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం లారెన్స్ క్లాతింగ్ సంస్థలో వెయ్యిమందికిపైగా పనిచేస్తున్నారు. 1985లో స్టేట్ ఆఫ్ మైసూర్ నుంచి 20వేల రూపాయలు తీసుకొని తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేశారు. 18 సంవత్సరాల వయస్సులో ఆమె వివాహం జరిగింది. తల్లి, భర్తల ప్రోత్సాహంతో వివా హం జరిగిన తరువాత కూడా వ్యాపార అభివృద్ధికి కృషిచేశారు. వివా హం వ్యాపారాభివృద్ధికి ఎటువంటి ఆటంకం కాదని, కావాల్సిం ది కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, చిత్తశుద్ధి మాత్రమేనంటారు జెస్సికా.
లారెన్స్ క్లాతింగ్ సంస్థ విదేశాలకు దుస్తులు ఎగుమతి చేసే కంపెనీలకు తమ ఉత్పత్తులను అందజేస్తుంది. అమెరికాకు చెందిన ఒక కంపెనీ ఎనిమిది కోట్ల రూపాయలు ఎగవేసింది.
అయినప్పటికీ ఆమె కృంగిపోకుండా అకుంఠిత దీక్షతో పనిచేసి నాలుగు సంవత్సరాలలో ఎనిమిది కోట్ల రూపాయల నష్టాన్ని పూడ్చగలిగారు. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పనిచేస్తూ.. వ్యాపారాభి వృద్ధితో ముందుకు వెళుతున్నారు.

- పి.హైమావతి