Others

భళా అగ్గిపుల్లా... అద్భుత కళ..!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అగ్గిపుల్ల భగ్గుమంటుంది’’...
చంటిపిల్లాడికి ఈ సంగతి తెలుసు..
అయినా ఆ విషయాన్ని ‘లైట్’గా తీసుకున్నాడు- డేమిడ్ మ్యాచ్.
ఆయన క్రియేటివిటీ ముందు మనలోని సృజనాత్మకత దివిటీ ముందు
అగ్గిపుల్లే!..
డేవిడ్ మ్యాచ్- మ్యాచ్‌స్టిక్ హెడ్స్‌తో చేసిన బొమ్మలు చూస్తే
మన హెడ్స్ అవే తలకాయలు గిర్రున తిరగాల్సిందే.
డేవిడ్ సృజించిన ఈ బొమ్మల వెనుక ఉన్న రహస్యం అగ్గిపుల్ల తలకాయలే..
జపాన్‌లో దొరికే రంగు రంగుల అగ్గిపుల్లలను సేకరించి మెటల్, ఫైబర్ నమూనాలకు అతికించి
తయారుచేసిన స్కాట్‌లాండ్ సృజనకారుడా.. ఘనుడు.
వీటిని షోకేస్‌లో అలంకారంగా పెట్టుకోవచ్చు..
పండగలూ పబ్బాలకి వేడుకగా చిచ్చుబుడ్డిలా వెలిగించవచ్చు
అగ్గిపుల్లని ఒక్కసారి అంటిస్తే మరి పనికిరాదు.
అయినా ఎంతో కష్టపడి తయారుచేసిన ఈ కళాఖండాలు ఖరీదులోని మండిపోయేవే. ఒక్కో బొమ్మ రేటు చాలా హాటు!!
ఎందుకంటే బొమ్మ ఖరీదు దాదాపు మన రూకల్లో 20-25 లక్షలు ఉంటాయిట.

- తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి