Others

స్ర్తి శక్తిని చిదిమేస్తున్నారు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలో స్ర్తి శక్తిస్వరూపిణిగా త్రిమూర్తులలో

చైతన్యాన్ని తెచ్చింది ఆ దేవీ శక్తేనని దేవీభాగవతం

వెల్లడిస్తోంది.
అయితే ఎన్నో కారణావల్ల స్ర్తికి భద్రత కల్పించే

నిమిత్తం స్ర్తి శక్తిని ఇంటికే పరిమితం చేశారు. అయితే

అది తరువాత తరువాత పురుషాధిక్యతకి

వేళ్ళూనుకుని స్ర్తిని అణగదొక్కే ప్రయత్నాలు

జరిగాయి. క్రమేపీ ఆమెను వంటింటికీ, పడకటింటికే

పరిమితం చేయబడింది.
పిల్లల పెంపకం, చదువులు, పెళ్లిళ్ళూ, అన్నీ

పురుషుల అధీనంలోకి వెళ్ళాయి. స్ర్తికి నోరు తెరిచి

మాట్లాడే అవకాశాన్ని కూడా ఇవ్వలేదు

పురుషులు. అయితే క్రమేపీ దుర్గ్భాయ్ దేశ్‌ముఖ్

వంటి కొందరు మహిళల పోరాట ప్రభావంతో స్ర్తిలకి

విడిగా స్కూళ్ళు, కాలేజీలు వచ్చి మెల్లిగా

అమ్మాయిలకి చదువుకునే అవకాశం కలిగింది.
ఇప్పుడు స్ర్తిలు అన్నిటా పురుషులకి ధీటుగా ఇంకా

చెప్పాలంటే వారిని తలదనే్న విధంగా స్ర్తిలు

విజయాలు సాధిస్తున్నారు. అంతరిక్షానికి

వెళ్ళేందుకు కూడా స్ర్తి వెనుకాడడంలేదు.
అయితే ఇటీవల పురుషహంకారంవల్లనైతేనేం, స్ర్తి

పట్ల చులకన భావంవనైతేనేం, స్ర్తిని నగ్నంగా చూపే

సినిమాలు, వాల్‌పోస్టర్ల ప్రభావంవల్లనైతేనేం స్ర్తిలపై

అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి.

ఇందుకు మరో కారణం కూడా లేకపోలేదు.
తల్లిదండ్రులు అమ్మాయిలని అణకువగా వుండాలని,

అబ్బాయిలు తిరక్క చెడతారు అంటూ

పోరంబోకులుగా, మహారాజులుగా పెంచడమే

అందుకు కారణం. తాము ఏం చేసినా

చెల్లుతుందన్న ధీమా యువకుల్లో పేరుకుపోతోంది.
ఇద్దరినీ సమభావంతో న్యాయం, ధర్మం, నీతి,

నిజాయితీలతో పెంచితే ఇటువంటి అహంభావాలతో

అత్యాచారాలు జరగవు.
కొందరైతే అమ్మాయి కడుపున పడిందనగానే

కడుపులోనే ఆమెను అంతం

చెయ్యాలనుకుంటున్నారు. భూమిపై పుట్టకుండా

చేస్తున్నారు. ఆ పసికందు ఏం పాపం చేసింది, ఆమె

కూడా వీరి కామక్రీడల ఫలితమేగా! అలా కడుపులో

అందరూ చిదిమేయాలనుకుంటూ వుంటే నేడు

పురుషుడు భూమిపైకి రాలేడు. ఆ సంగతి ప్రతీ

ఒక్కరూ గమనించాలి. స్ర్తి అంటే అబ ల, అణిగిమణిగి

వుండే అమాయకురాలు కాదు. అవకాశం వుంటే

అన్నిటా అందర్నీ ఓడించి విజ యం సాధించగలదని

నిరూపించారు.
దయచేసి అమ్మాయిల్ని కడుపులోనే చిదిమేసి

వారికీ దేశానికీ కూడా అన్యాయం చేయకండి. ఆ

కడుపులో వున్న ది ఏ శక్తి అయినా కావచ్చు. ఏ

రంగంలోనైనా పేరుతెచ్చుకుని తల్లిదండ్రులకీ

దేశానికీ కూడా పేరు తేవచ్చు. ఆమె జీవితాన్ని

అంతం చేసే అధికారం మీకు లేదు. ఆ పని చేసి

భ్రూణహత్యా పాపాన్ని చేతులారా కొనితెచ్చుకోకండి.

భూమిపై పుట్టి బ్రతికే అవకాశాన్నివ్వండి. స్ర్తి

పనికిరాని పిండం కాదు, ఉద్దండ పిండం స్ర్తి శక్తి. ఆ

చైతన్యం లేనిదే పురుషుడు ఎందుకూ పనికిరాడు.

బుద్ధిహీనుడు, చైతన్య రహితుడు అవుతాడు.

ఎంతటి మహారాజైనా ఓ తల్లి కొడుకే!

...............................................................

చులకనగా చూస్తూన్న స్ర్తిలే నేడు ఎన్నోవిజయాలని

సాధిస్తున్నారు. ఒలింపిక్స్‌లో అసలు మన దేశం ఏ

పతకం లేకుండానే వెనుదిరగాల్సి వస్తుందేమో

అన్న తరుణంలో సాక్షి, సింధు మన పరువు

కాపాడారు. వారికి ఏమిచ్చినా ఋణం తీరదు.

తల్లిదండ్రులిచ్చిన ప్రోత్సాహంతో తమ శ్రద్ధ,

పట్టుదలతో శాయశక్తులా ప్రయత్నించి విజయం

సాధించారు సాక్షి, సింధు. ఇదివరలో సాధించిన

కరణం మల్లీశ్వరిని కూడా ఈ తరుణంలో జ్ఞప్తికి

తెచ్చుకోవాలి.

భూమికకు రచనలు
పంపాలనుకునే వారు
రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో
bhoomika@andhrabhoomi.netకు
మెయల్ చేయవచ్చు.
లేదాఈకింది చిరునామాకు
పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్
సికిందరాబాద్- 03

- ఆర్.ఎస్.హైమవతి