మెయిన్ ఫీచర్

పచ్చటి పుడమికోసం మొక్కలతో చెలిమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమాజం నాకు ఏం చేసిందని ప్రశ్నించేవాళ్లు చాలామంది ఉంటారు. కానీ సమాజానికి నేనేం చేశానని ఆలోచించేవాళ్లు అతి కొద్దిమందే ఉంటారు. ఆ కోవకే చెందుతారు కాకినాడు నగరానికి చెందిన చీమకుర్తి సురేఖ. పుట్టిన గడ్డకు ఏదో ఒకటి చేయాలనే తలంపుతో ఆమె ‘్ధరిత్రి రక్షిత సమితి’ పేరిట ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. పెరిగిపోతున్న కాలుష్యాన్ని కొంతయినా అరికట్టాలనేది ఆమె సంకల్పం.
అలా మొదలైంది..
కాకినాడకు చెందిన సురేఖ ఎంబిఏ చదివారు. భర్త మురళీకృష్ణ వ్యాపారి. పలు కంపెనీల్లో ఉద్యోగాలు చేసినా ఆమెకు ఏదో అసంతృప్తి.. సమాజానికి నా వంతుగా ఏదో ఒకటి చేయాలి అనే సంకల్పంతో ఆమె తన నిర్ణయన్ని భర్త మురళీకృష్ణకు, అత్త మామలకు వివరించారు. వారు ఆమె నిర్ణయాన్ని స్వాగతించారు. అంతే సంతోషంతో ఉద్యోగానికి రాజీనామా చేసేశారు. 2010 ఆగస్టు 29న ‘్ధరిత్రి రక్షిత సమితి’ని ఏర్పాటుచేసి, సేవాగుణం కలిగిన మరో 21 మంది సభ్యులను సంస్థలో చేర్చుకున్నాను. తను అధ్యక్షురాలిగా ముందుండి సంస్థ సేవలకు శ్రీకారం చుట్టారు. నగరం నలువైపులా, పరిసర గ్రామాలు, వాతావరణం ఎక్కువగా కలుషితమయ్యే ప్రాంతాల్లో సమితి తరఫున వేలాదిగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమాలకు ఎవరినుంచీ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. సొంత ఖర్చులతోనే చేపట్టారు.
ఇనుప గార్డులతో రక్షణ
ధరిత్రి రక్షిత సమితి ఆధ్వర్యంలో నాటే మొక్కలకు ఇనుప గార్డులతో రక్షణ కల్పిస్తారు. ఈ ఖర్చును కూడా ఆమె సొంతంగా భరిస్తున్నాను. గార్డులు చోరీకి గురికాకుంకడా చుట్టూ కాంక్రీటుతో ఏర్పాటుచేసారు. వారు నాటిన మొక్కలకు నీరు పోసే బాధ్యత నగరపాలక సంస్థ తీసుకుంటోంది.
ప్లాస్టిక్ భూతం నుంచి కాపాడేందుకు
మొక్కల పెంపకం, సంరక్షణతో పాటు ప్లాస్టిక్ భూతం నుంచి ప్రజలను రక్షించేందుకు సమితి తరఫున మరో ప్రయత్నం చేశారు. 50 మైక్రాన్ల మందం కంటే తక్కువ గల ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో కలిసిపోవు. వాతావరణ సమతుల్యత దెబ్బతినకుండా కాపాడుకునేందుకుగానూ సమితి తరఫున మురికివాడల్లో రూ.950 విలువగల ప్లాస్టిక్ డబ్బాలను పంపిణీ చేశారు. కాలనీల్లోని ప్రజలు ప్లాస్టిక్ వ్యర్థాలను ఈ డబ్బాలో వేసేలా చర్యలు తీసుకున్నారు. వినాయకచవితి పర్వదినాన ప్రతిఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించమని కోరుతూ మట్టి విగ్రహాలను, అలాగే క్లాత్ సంచులను పంపిణీ చేశారు.
మొక్కలు నరికేవారితో పోరాటం
మొక్కలు నాటడమే కాదు.. వాటిని పరిరక్షించుకునేందుకు కూడా సమితి తరఫున సిద్ధంగా ఉంటారు. చేబ్రోలు ప్రాంతంలో కొందరు చెట్లను నరికేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న ఆమె వెంటనే అక్కడకు వెళ్లి స్థానికులతో కలిసి ఉద్యమించారు. వెంటనే జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేయడంతో అక్రమార్కులు అక్కడినుంచి జారుకున్నారు. పర్యవణానికి హాని కలిగించేలా వ్యవహరించిన వారిపై పోరాటం సాగించిన ఆమెకు ప్రభుత్వం 2013, జనవరి 26 రిపబ్లిక్‌డే రోజున ఉత్తమ సేవా పురస్కారాన్ని అందించింది.
అవార్డులు, పతకాల కోసం కాకుండా సమాజం కోసం మా వంతు చిరు ప్రయత్నం చేస్తున్నాం. ప్రతిఒక్కరూ మొక్కలు నాటండి.. పర్యావరణాన్ని కాపాడంటారు. ధరిత్రీ రక్షిత రక్షితః.

- నీలిమ సబ్బిశెట్టి