మెయిన్ ఫీచర్

ఆడపిల్లను ఆదరిస్తే ఆనందమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘చైల్డ్ ఈజ్ ది పాదర్ ఆఫ్ మాన్’ అన్నట్లు, ‘అమ్మాయిలు భావి సమాజ పునరుద్ధరణకు మనం నాటి సంరక్షించాల్సిన మొలకలు’. అమ్మాయిలు ముం దుగా మనుషులు, ఆ తర్వాతే ఆడవారు. మానవజాతి పునరుత్పత్తికి వారసులు. కొనే్నళ్లుగా, వివిధ కారణాలవల్ల, ఆడపిల్లల శాతం గణనీయంగా తగ్గుతున్న ప్రమాదాన్ని గుర్తించి, ఐక్యరాజ్యసమితి, గత నాలుగేళ్లుగా అక్టోబర్ 11వ తేదీని ‘అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుతోంది. మన దేశం కూడా ‘్భటీ బచావో.. భేటీ పడావో’ అని నినదిస్తోంది. ఆడపిల్లలను తల్లి గర్భంలో పిండ దశలోనే ఆడపిల్లలను చంపే విష సం స్కృతి వ్యాపించింది. ఇది వేలంవెర్రయి, ఆడ భ్రూణ శిశు హత్యలు పెరిగి, అమ్మాయిల జనాభా క్రమంగా తగ్గిపోతున్నది.
ఇక, భ్రూణదశ నుండి చావు తప్పించుకున్నా, గ్రామీణుల్లో ఆడపిల్లను గర్భంలో మోసే చూలింతరాలికి, మగబిడ్డను మోసే స్ర్తికి బలవర్థక ఆహారం ఇవ్వడంలో వివక్ష చూపడంవల్ల, ఆ గర్భిణీ, ప్రసవించకలేక తల్లి బిడ్డా చనిపోవడమో లేక ఇద్దరిలో ఒక్కరే బతకడమో జరిగి ఆవిధంగా కూడా స్ర్తిల శాతం జనాభాలో తగ్గుతూ వస్తున్నది.
స్ర్తి పురుష వివక్ష అన్నిటితోపాటూ, ఆడ మొగ పిల్లల పెంపకంలోనూ సుస్పష్టంగా కనబడుతుంది. ఆడ శిశువులకు, ఒక ఏడాదిలోపే తల్లిపాలివ్వ డం ఆపేస్తుంది. అదే, మగబిడ్డకైతే మూడేళ్లు స్తన్యమిస్తుంది. తల్లిపాల తర్వా తే.. ఇక ఏ ఆహారమైనా! పిల్లలను పెంచడంలోనూ, అమ్మాయి, అబ్బా యి తేడా చూపిస్తారు. ఆడపిల్లల్లో పోషకాహారలోపం.. రక్తహీనతవల్ల పలు రకా ల అనారోగ్యాల పాలవుతున్నారు. అమ్మాయిలు ఇంటిపనులు, పిల్లల పెంపకంలో.. చదివించడంలో కూడా ఆడపిల్లలు వివక్షను ఇంటిదగ్గరే, కౌమార దశలో ఎదుర్కోవాల్సి వస్తుంది.
బాలికల జనాభా తగ్గడానికి మరో కారణం- బాల్యవివాహాలు. ప్రపంచ వ్యాప్తంగా 700 మలియన్ల మంది స్ర్తిలకు 15-18 సం.లోపువారికే వివాహాల వుతున్నాయి. 15 ఏళ్ల లోపు 250 మిలియన్లమందికి పెళ్లవగా.. బాలవధువు లు ‘బలవంతపు శృంగారంలో’ పాల్గొంటూ హింసను అనుభవిస్తున్నవారే. వారికి వచ్చిన అవాంఛిత గర్భాలు పసితనంలోనే వాళ్ళ ప్రాణాలు హరిస్తున్నాయి. ప్రతి 10 నిముషాలకు ఒక కౌమార దశ బాలిక లైంగిక వేధింపులు, హింసకు గురై చనిపోతున్నది. 15-19 ఏళ్లలోపు బాలికలు 44 శాతం మంది భర్తల చేత హింసకు బలి అవుతున్నారు. అంతేకాదు ఎయిడ్స్ వ్యాధికి బలవుతున్నారు. అత్యాచారాలకు, హింసకు గురయ్యేవారి సంఖ్య లెక్కకు అందనంత. చదువులకు అమ్మాయిలను పంపడమే కష్టమైతే, విద్యాలయాలు, వసతిగృహాల్లో కదిలే వాహనాల్లో రైల్వే స్టేషన్లు, బస్టాపుల్లో ఎక్కడబడితే అక్కడ విద్యార్థినులకూ, బాలికలకూ లైంగిక వేధింపులే! ప్రేమోన్మాదులు ఎలా విద్యార్థినులపై ఖడ్గం, ఆసిడ్ దాడులు చేశారో, ఆ దారుణాలకు శ్రీలక్ష్మి, ప్రసన్నలక్ష్మి, ప్రణీత, స్వప్నికల సంఘటనలు మరచిపోలేనివి. దేశ రాజధాని ఢిల్లీలో నిర్భయ, నాటి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్‌లో ‘అభయ’ దుస్సంఘటన లు, సి నీనటి ప్రత్యూష, ముస్లిం మైనారిటీ బాలికలు ఆయేషా, తస్లిమాబాను (కావలి) గాంగ్ రేప్, హత్యలు... రాజకీయ నాయకులు నిందితులకు రక్షణలు, మైనర్ బాలికలపై జరుగుతున్న లైంగిక దాడులకు మచ్చుతునకలు. విద్యాలయాల్లో, వసతి గృహాల్లో ఓ రకంగా బాలికల మాన, ప్రాణాలకు రక్షణ లేకుంటే ఇరుగు పొరుగు, ఇంట్లో, తండ్రి, సోదర పురుషులనుండి మానప్రాణాలకు ముప్పు కాచుకునే ఉంటున్నది. బాలికలు ఎలా బ్రతకాలి.. చదవాలి? ఈ పురుషాధిక్యతనుండి ఎలా ఉన్నత చదువులు.. ఉన్నతోద్యోగాలు పొందాలి, ఆర్థిక రాజకీయ, సామాజిక, సాంస్కృతిక పరిపూర్ణత సాధించాలి? మిలియన్ డాలర్ల ప్రశ్నయే అవుతున్నది.
ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ, మాన్‌కి మూన్ ఇచ్చిన పిలుపు ప్రకా రం ఇప్పుడు 15 సంవత్సరాల బాలిక 2030 నాటికి సర్వతోముఖాభివృద్ధి సాధించాలి. విద్య, వైద్యం, ఆరోగ్యం, సామాజిక, నైతిక, ఆర్థిక రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో వికాసం పొంది లింగ వివక్షతను అధిగమించి, పురుషులతో సమానంగా సాధికారత సాధించాలి. దీనికి సభ్య దేశాలన్నీ తమ తమ దేశాల్లో ప్రత్యేక నిరంతర కార్యక్రమాలు చేపట్టాలి.
మహిళలు పురుషులు 50-50 అభివృద్ధిలో లింగవివక్ష లేని గ్రహంగా ఈ భూమిని రూపొందించినపుడే వివక్షతను రూపుమాపిన వారమవుతాం. ఏ మంచి మార్పయినా, ముందు వ్యక్తి నుండి కుటుంబం, సంఘం, దేశం, ప్రపంచందాకా సంపూర్ణ బాధ్యతతోనే సాధ్యవౌతుందని గ్రహించి బాలికల సంరక్షణా, ఎదుగుల.. వికాసం సాధికారత, సమానత్వాల దృక్కోణంలోనే విజయవంతం కాగలదని తెలుసుకుని ప్రతిఒక్కరూ తమను తాము మలుచుకోవాలి. ఆ దిశలో మసలుకోవాలి.

...............................
ఐక్యరాజ్య సమితి సామాన్య సభలో శాంతి బహుమతిని స్వీకరిస్తూ, మలాల యుసఫాజి.. ‘‘మా ప్రపంచ బాలికలచదువు- పరిపూర్ణ వికాసానికి మీరిచ్చే భోరసా ఏమిటో’’ అని సభ్యదేశాల ప్రతినిధులను ప్రశ్నించింది. ఐక్యరాజ్యసమితిలో అతి చిన్న వయసలో ప్రసంగించిన తొలి బాలికగా సభ్యదేశాల ప్రతినిధులనుండి బహిరంగ హామీని అడిగింది. దీంతో ఐక్యరాజ్యసమితి కదలి నేటి 15 ఏళ్ళ బాలికలు 2030 కల్లా అన్ని రంగాల్లో బాలురకు సైదోడుగా, సరిసమానంగా, అభివృద్ధి సాధించేందుకు, దేశాలు, సామాజిక సంస్థలు వ్యక్తులు, కుటుంబాలు కదలిరావాలని పిలుపునివ్వటం గమనార్హం.

- చాకలకొండ శారద