సబ్ ఫీచర్

దూరాలు కలిపే దారాలేవి? ( రేపు పోస్టల్ దినోత్సవం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడిసె ముందు కూర్చున్న పండు ముసలి అవ్వకు.. దూరాభారాన వున్న కొడుకు యోగక్షేమాలు మోసుకొచ్చినా, బంధువులు, స్నేహితుల మధ్య దూరాల దారాన్ని తెంచేసి వారి అనుబంధాన్ని మరింత పటిష్టం చేసినా.. శుభాశుభాల వర్తమానంగా మారినా.. నవ్వుల పువ్వులు, ఆనందాలు, అభినందనలు, నిట్టూర్పులు, ఏడుపులు.. ఇలాంటి అనేక అనుభూతుల్ని అక్షరాలుగా తనలో పొదుపుకుని మోసుకొచ్చినా... అది ఒక్క ఉత్తరానికే చెల్లు.
సమాచార రంగంలో వచ్చిన ఆధునిక మార్పుల పుణ్యమాని ఆ ఆప్తబంధువు క్రమంగా అందరికీ దూరమవుతోంది. ఒకప్పుడు తొంభై ఆమడల దూరాన్ని కూడా అనాయాసంగా అధిగమించగలిగిన ఆ తోకలేని పిట్ట.. నేడు సెల్‌ఫోన్ల విజృంభణ పుణ్యమాని జవసత్వాలు ఉడిగిపోయినట్టుగా మారిపోయింది.
174 ఏళ్ల ప్రస్థానం
భారత తపాలా వ్యవస్థ ప్రారంభమై 174 ఏళ్లు పూర్తయింది. తొలుత అత్యంత ప్రాధాన్యత కలిగిన రెవెన్యూ, పోలీసు వ్యవస్థలతో ఈ శాఖ కలిసి ఉండేది. నాడు ఇది ప్రభుత్వ సమాచార మార్పిడికోసమే పనిచేసేది. ఆ రోజుల్లో జగీర్దార్లు తదితరులు దీనిని సొంత ఖర్చుతో నిర్వహించేవారు. గుర్రాలపై సమాచారాన్ని పంపేవారు. క్రమంగా ప్రజాసేవ పరిధిలోకి దీనిని విస్తరించారు. టెలిఫోన్ వ్యవస్థ అంతగా విస్తరించని నాటిరోజుల్లో ఉత్తరాలే సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి ఆధారం. అమెరికా, ఇంగ్లండ్ తదితర దేశాల్లో మనియార్డర్ వస్తే ప్రజలకు ఆ సమాచారం మాత్రమే ఇస్తారు. కాని మన దేశంలో నేరుగా మనీయార్డర్‌ను ఇంటికి తీసుకెళ్లి అందించే పద్ధతిని అమలుచేయడం విశేషం.
సంస్కరణల ప్రభావం
సంస్కరణల్లో భాగంగా సిబ్బందిని కుదించడం, రైల్వే మెయిల్ సర్వీసు వ్యవస్థను భ్రష్టుపట్టించడం వంటి కారణాలతో ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఉత్తరాలు అందడంలో జాప్యం జరుగుతోంది. ఒకప్పుడు ఎనిమిది లక్షలమంది సిబ్బందితో సేవలందించిన తపాలా శాఖలో నేడు సిబ్బంది సంఖ్య సగానికిపైగా తగ్గిపోయింది.
ప్రస్తుత కంప్యూటర్ యుగానికి అనుగుణంగా తపాలా వ్యవస్థ కూడా ఆధునికీకరణను సంతరించుకుంటోంది. స్పీడ్‌పోస్ట్, ఈ మనీయార్డర్, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, వెస్ట్రన్ మనీట్రాన్స్‌ఫర్ వంటిసేవలతో మనుగడ సాగిస్తోంది. బ్యాంకు సేవలకు ధీటుగా ఏటిఎంలను కూడా ఏర్పాటు చేసింది.

భూమికకు రచనలు
పంపాలనుకునే వారు
రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో bhoomika@andhrabhoomi.netకు మెయల్ చేయవచ్చు.
లేదాఈకింది చిరునామాకు
పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్
సికిందరాబాద్- 03

- నీలిమ