Others

‘ముగురమ్మలు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కళావాహిని, సౌందర్య సౌదామని,
దయాక్రాంతి స్రవంతి ప్రదాయిని,
నిరంతర సౌభాగ్య వాఙ్మయ ధారిణి,
మనోజ్ఞ ప్రమోద అంతర్వాహిని

అక్షర గుంభిత పద స్తోత్రాభరణి,
జ్ఞాన సోపాన పద మంజీరనాదిని,
విజ్ఞాన ఘన సంపద గని
విద్యాందేహి ‘మూలా’ మాలానురక్తా
వీణాపాణీ నీకు నమస్సులమ్మా గీర్వాణీ.

వైరాగ్య, రక్ష, క్షమానుగ్రహ మంగళ రక్షిత,
భయనివారిణి, తన్మయ మాతామణి,
సద్భావనా జీవన ప్రబోధిని,
కరుణాంతరంగ, జగజ్జనని,
అష్టమి దుర్గా, శివకామినీ,
నీ పాదములే శరణు శర్వాణీ.

ధన ధాన్య సమన్విత, సంపద రూపిణి
జయ, జయ ధ్వన్యాకర్షిత,
లక్ష్మినామ అనుదిన రంజిత,
నానాలంకార నవమి శోభిత స్వర్ణ్భారణి,
విజయం మాకు, శమీ శత్రు వినాశినీ నమామి.

ఆయురారోగ్య ఐశ్వర్య సిద్ధినిచ్చే తల్లులు,
సకల సౌభాగ్య నిధులు
నవరాత్రులు పూజిస్తే నవనిధులిచ్చే ముగురమ్మలు
రారండి మా యిండ్ల కొలువై నిలచిపోవ
మీ దయా దాక్షిణ్యాల మా భిక్షాపాత్రలు నిండిపోవ

- ఎ.ఎస్.ప్రభాకర్