మెయిన్ ఫీచర్

ధర్మరక్షణే భారత్ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* తీవ్రవాదం అంతమైతేనే ప్రపంచ శాంతి
* దుష్టశక్తులపై విజయానికి ప్రతీక దసరా
* భగవాన్ విశ్వయోగి విశ్వంజీ

సమర్థ నాయకత్వం

భారతదేశానికి ప్రస్తుతం సమర్థవంతమైన నాయకత్వం ఉంది. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్ ఉన్నతస్థాయికి ఎదిగి ప్రపంచంలో గురుస్థానానికి ఎదుగుతుందనడంలో సందేహం లేదు. భారత్‌కు చెందిన రక్షణ దళాలు ప్రపంచంలో అత్యుత్తమ సైనిక శక్తిగా పేరుతెచ్చుకున్నవి. భారత్ శక్తివంతం అయ్యేందుకు హిమాలయాల్లో ఉన్న రుషులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న యోగులు, దివ్యశక్తికలవారు, భగవత్ స్వరూపులు తమ శక్తిని వినియోగిస్తున్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకైనా భారత్ సిద్ధంగా ఉంటుంది.

పేదరిక నిర్మూలన

ప్రపంచ దేశాలన్నీ పేదరిక నిర్మూలనకు సమగ్ర ప్రణాళికలను రూపొందించుకుని అమలు చేయాలి. ప్రతి మనిషికి ఆహారం, దుస్తులు, నివాసం, విద్య, వైద్యం తదితర వౌలిక సదుపాయాలు లభించేందుకు పాటుపడాలి. అభివృద్ధి, సంక్షేమం ఎంత అవసరమో పేదరిక నిర్మూలనకు కనీస వౌలిక సదుపాయాలు
కల్పించడం అంతే అవసరం. ఎబోలాలాంటి రోగాలు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి. యువత తప్పుదారి పట్టకుండా ఉపాధిఅవకాశాలు మెరుగ్గా లభించేలా చర్యలు చేపట్టాలి.

ప్రపంచంలో భారత్ శక్తివంతమైన దేశంగా ఎదుగుతుందనడంలో ఎలాం టి సందేహం లేదు. తీవ్రవాదాన్ని సమర్థవంతంగా మట్టుబెట్టగల సామర్థ్యం భారత్‌కు ఉంది. అనేక పర్యాయాలు ఇది రుజువైంది. ప్రస్తుతం ప్రపంచానికి తీవ్రవాదం పెద్ద సవాల్ విసురుతోంది. తీవ్రవాదానికి కులం, మతం, ప్రాంతం, వర్గం, జాతి అన్న తరతమభేదాలు ఏమీ లేవు. హిందువులు ఎక్కువగా ఉండే భారత్‌తో పాటు క్రిస్టియన్లు ఎక్కువగా ఉండే అమెరికాలాంటి దేశాలు, ముస్లింలు అధికంగా ఉన్న ఇస్లామిక్ దేశాల్లో తీవ్రవాదం పెరిగిపోయింది. భారత్‌తో పాటు అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, బెలూచిస్తాన్ తదితర దేశాలు కూడా తీవ్రవాదుల వల్ల ఇక్కట్లను ఎదుర్కొంటున్నాయి. తీవ్రవాదం ఏ దేశంలో ఉన్నా, దానివల్ల ఏ దేశం ఇక్కట్లకు గురవుతున్నా, దానికి పరిష్కార మార్గం ఒక్కటే.. అదే తీవ్రవాదాన్ని తుదముట్టించడం. తీవ్రవాదాన్ని తుదముట్టించడంలో ఏ దేశం కూడా ఎలాంటి సంశయాన్ని పెట్టుకోవద్దు. తీవ్రవాదం అంతమైతేనే ప్రపంచం శాంతియుతంగా ఉండగలుగుతుంది.
శరీరంలో అపెండిక్స్ అనే చిన్న భాగం ఏ కారణంగానైనా కుళ్లిపోతే దాన్ని ఆపరేషన్ చేసి తొలగిస్తారు. అపెండిక్స్ కుళ్లిపోయిన వెంటనే తొలగించకపోతే అది పగిలి శరీరం అంతా విషంగా మారి ప్రాణానికి హాని ఏర్పడుతుంది. అందుకే ఒక మనిషిలో అపెండిక్స్ కుళ్లిపోతే దాన్ని ఎలాంటి సంకోచం లేకుండా డాక్టర్లు ఆపరేషన్ చేసి తొలగించి మనిషి ప్రాణాలను కాపడతారు. ఆ చిన్న భాగం ఎలా తొలగించడం అని డాక్టర్లు సంకోచిస్తే, సదరు మనిషి ప్రాణమే పోతుంది. అలాగే తీవ్రవవాదం ఏ దేశంలో ఉన్నా దాన్ని మట్టుపెట్టకపోతే సదరు దేశానికే హాని కలుగుతుంది. సామాన్య ప్రజలు బాధలు అనుభవించాల్సి వస్తుంది.
త్రేతాయుగం, ద్వాపరయుగాల్లో రాక్షసులు ఉండేవారు. రాక్షసులను సంహరించడం కోసం భగవంతుడు వివిధ రూపాల్లో అవతారం ఎత్తేవాడు. త్రేతాయుగంలో రావణాసురుడిని సంహరించేందుకు రాముడి అవతారం ఎత్తాడు. రావణ సంహారం తర్వాత లంకారాజ్యాన్ని రాముడు వశపరచుకోలేదు. రావణాసురుడి తమ్ముడైన విభీషణుడిని పట్ట్భాషక్తుడిని చేశారు. అలాగే దుష్ట ఆలోచనలు కలిగిన వాలిని సంహరించి, వానరరాజ్యానికి సుగ్రీవుడిని రాజును చేశాడు. రాముడు తలచుకుంటే వానరరాజ్యాన్ని, లంకను తన అధీనంలోకి తీసుకుని, తననే చక్రవర్తిగా ప్రకటించుకునే అవకాశం ఉండేది. కాని దుష్టులను సంహరించడమే రాముడికి ప్రధాన ఉద్దేశంగా ఉందే తప్ప రాజ్యాలను వశపరచుకోవాలన్నది ఉద్దేశం కాదు. అలాగే శ్రీకృష్ణుడు కూడా నీతి, న్యాయానికి కట్టుబడి ఉన్న పాండవులవైపు నిలిచి, దుర్మార్గంగా ప్రవర్తించిన కౌరవుల బాధనుండి ప్రజలను కాపాడాడు. పాండవులకు రాజ్యం ఇప్పించేందుకే శ్రీకృష్ణుడు పాటుపడ్డాడు తప్ప, తానే రాజుగా ఉంటానని చెప్పలేదు.
అదే విధంగా ఇప్పుడు భారతదేశం కూడా ఏ ఇతర దేశాల జోలికి తనకు తానుగా వెళ్లడం లేదు. 1972లో పాకిస్తాన్‌తో యుద్ధం చేసి తూర్పుపాకిస్తాన్‌ను స్వతంత్ర రాజ్యంగా ‘బంగ్లాదేశ్’ పేరుతో ఏర్పాటు చేసిన ఘనత భారత్‌కు దక్కింది. బంగ్లాదేశ్‌ను తన అధీనంలోకి తీసుకోవాలంటే భారత్‌కు వీలుండేది. కాని అలా చేయలేదు. అంటే వేరొక దేశాన్ని ఆక్రమించుకోవాలన్న తపన భారత్‌కు లేదు. ఇప్పుడు పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉంటున్న తీవ్రవాదులు భారత్ సైనికస్థావరాలపై దాడులు చేస్తుంటే, తీవ్రవాదులకు గట్టిగుణపాఠం చెప్పింది. అంతే కాని పాకిస్తాన్‌లోని భూభాగాన్ని ఆక్రమించుకోవాలన్న దురుద్దేశం భారత్‌కు లేదు. దుష్టులను సంహరించడం, తుదముట్టించడమే భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల జరిగిన ‘సర్జికల్ ఆపరేషన్’ ఇదే కోవలోకి వస్తుంది.
అమ్మాయి లేక అబ్బాయిని కనే ముందు గర్భిణీ పురిటినొప్పితో బాధపడుతూ ఉంటుంది. ఈ నొప్పి తాత్కాలికమే. తర్వాత తల్లీబిడ్డలు ప్రేమతో ఉంటారు. అలాగే పృథ్వీమాత కూడా ‘శాంతి’ అనే పిల్లవాడికి జన్మనివ్వబోతోంది. తీవ్రవాదం తదితర బాధలను పృథ్వీమాత ఎదుర్కొంటోంది. త్వరలోనే ప్రపంచంలో శాంతి వెల్లివిరుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే భారత్‌తో పాటు అమెరికా, బ్రిటన్, చైనా, జపాన్, ఫ్రాన్స్ తదితర దేశాలన్నీ కలిసికట్టుగా విజయదశమి సందర్భంగా ముందుకుసాగాలి. తీవ్రవాదం ఏ రూపంలో, ఏ ప్రాంతంలో కూడా లేకుండా కఠినచర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలోని మేధోసంపత్తి మానవాళి అభివృద్ధికోసమే వినియోగపడాలి.