సబ్ ఫీచర్

న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో మన డయానే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఆమె అద్భుతంగా అమెరికా ప్రజలకు సేవ చేస్తుందని భావిస్తున్నాను’’ అం టూ స్వయంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రశంసలు పొందారు భారత సంతతికి చెందిన 47 సంవత్సరాల డయానే గుజరాతి. ఇటీవల ఆమె న్యూయార్క్ సౌత్ డిస్ట్రిక్ట్ ఫెడరల్ కోర్టు జడ్జిగా నియమితులయ్యారు. డయానే తండ్రి దామోదర్ ఎం.గుజరాతి అమెరికన్ మిలటరీ అకాడమిలో ఎకనామిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆమె తల్లి రూత్‌పిన్‌కస్ గుజరాతి. ఆయన 1960లో ముంబాయి యూనివర్సిటీలో ఎం.కామ్ చదివి, 1965లో చికాగో విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందారు. అనంతరం, అమెరికా మిలటరీ అకాడమీలో అధ్యాపకులుగా చేరారు. డయానే 1990లో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుంచి బి.ఎ. పట్టా పొంది, 1995లో యేల్ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్ర పట్టా పొం దారు. అనంతరం ఆమె హనరబుల్ జాన్ ఎం.వాల్కర్ వద్ద న్యాయవాద గుమాస్తాగా పనిచేసి, న్యాయశాస్త్రంలో మెలకువలు నేర్చుకొన్నారు. 1999లో అసిస్టెంట్ యు.ఎస్. అటార్నీ కార్యాలయంలోని క్రిమినల్ డివిజన్‌లో చేరారు. 2006-08 వరకు సదరన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్‌లో చీఫ్ ఆఫ్ వైట్ ప్లెయిన్స్, డివిజన్ ఆఫ్ ది యుఎస్ అటార్నీ కార్యాలయంలో పనిచేశారు. అమెరికా అటార్నీ కార్యాలయంలోని క్రిమినల్ డివిజన్‌లో ఆమె 2008-12 వరకు డిప్యూటీ చీఫ్‌గా పనిచేశారు. నూతనంగా ఫెడరల్ కోర్టు జడ్జిగా నియమితులై, భారతీయ సంతతి పేరు ప్రతిష్ఠలను డయానే ఇనుమడింపజేశారు. భవిష్యత్‌లో ఆమె మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆశిద్దాం.

భూమికకు రచనలు
పంపాలనుకునే వారు
రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో bhoomika@andhrabhoomi.netకు మెయల్ చేయవచ్చు.
లేదాఈకింది చిరునామాకు
పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్
సికిందరాబాద్- 03

- పి.హైమావతి