భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహ్మద్ జి.షఫీ, నల్లమాడ (అనంతపురం)
ప్ర:మా ఊరి కొండపైన ఒక ఈశ్వరాలయము ఒక మసీదు కట్టించి ‘ఈశ్వర్ అల్లా తేరోనాం, సబ్‌కో సమ్మత్ దే భగవాన్’ అనే నినాదం రాయాలని సంకల్పించాను. నా ఆశయం నెరవేరుతుందా?
సమా:మీ ఆశయం చాలా ఉన్నతమైంది. మీ ఉదాత్తమైన నిర్ణయానికి దైవ సహాయం లభిస్తుంది. వచ్చిన చిక్కల్లా మనుషులతోటే- ముఖ్యంగా స్వార్థ ఛాందసవాదులతో- పట్టుదలతో ప్రయత్నించండి. ఫలించగలదు.
మామిడిపల్లి వెంకట్రావు, దేవరపల్లి (ప.గో.)
ప్ర:నేను ఆర్.ఎం.పి. డాక్టర్‌ను. పెద్దపేగుకు పుండు అయి విరేచనాలు- అనారోగ్యంతో బాధపడుతున్నాను. కోర్టు సమస్యలూ ఉన్నాయి. పరిష్కారం చెప్పండి.
సమా:మీరు స్వయంగా వైద్యులే కనుక ఆయుర్వేదంలో ‘పటికకల్పము’ అనే చికిత్సా విధానం కడుపులోని పుండ్లకు చెప్పబడింది. ఒకసారి ఆ విధానాన్ని రెఫర్ చేయండి. ఇలాంటిదే నాకు తెలిసినవారికి జరిగితే ఆపరేషన్‌తో పుండును బ్లాస్ట్ చేసి బాగుపరచారు. కోర్టు సమస్యల పరిష్కారానికి- మన్యుపాశుపత రుద్రాభిషేకార్చన చేయించండి.
దామర్ల స్వాతీ లక్ష్మీ ప్రసన్న, మంగళగిరి (గుంటూరు)
ప్ర:చదువు - వివాహం- ఎటువంటి భర్త?
సమా:విద్యావిషయంలో విఘ్నాలు- వివాహం విషయం బాగుంది. మంచి భర్త లభించే అవకాశం వుంది. ఉత్తర వాయువ్య దిశలు ‘ర - ల - ప - ద- య’ అనే అక్షరాలు యోగ కారకాలు.
డా కె.రామకృష్ణ ఎం.బి.బి.ఎస్, విజయనగరం (ఆం.ప్ర.)
(ఎక్స్ కెప్టెన్ ఆర్మీ మెడికల్ కాప్స్)
ప్ర:గృహ వాస్తు లక్షణం- అమ్మకం జరగటం లేదు. పరిష్కారం చెప్పండి. వ్యక్తిగతంగా కలవవచ్చునా?
సమా:మీ యింటి వివరాలు మీరు చూసిన ప్రకారం వాస్తు దోషాలు ఉన్నాయి. సందు దారి కారణంగా అనుకూలతలు లేవు. వ్యక్తిగతంగా కలవాలనుకుంటే ముందుగా ఫోన్ చేయండి.
కె.మల్లిక, ఆదోని (కర్నూలు)
ప్ర:వివాహ సమస్య- దాంపత్య వియోగం-
సమా:మీ జాతక చక్రం పరిశీలించాలి. ప్రత్యేక నివారణలు పాటించాలి.
కె.్ధనలక్ష్మి, నరసరావుపేట (గుంటూరు)
ప్ర:గతవారం నా ప్రశ్నకు సరియైన సమాధానం దొరికింది. ధన్యవాదాలు. అయితే నివారణ మార్గాలు చెప్పండి.
సమా:అధర్వశీర్ష గణపతి హోమం- నాలుగు గురువారాలు- నవగ్రహ పాశుపత రుద్రాభిషేకార్చన ఆదివారమూ జరిపించండి. ‘సౌభాగ్య లలితా రక్షా యంత్రం’ మెడలో ధరించడం కూడా చాలా మంచిది.
కె.నీహారిక, బెంగుళూరు (కర్నాటక)
ప్ర:ఉద్యోగంలో బదిలీ- హైదరాబాద్ కొరకు
సమా:తాతయ్యా! అని సంబోధించినందుకు సంతోషమమ్మా! నీ ట్రాన్స్‌ఫర్ విషయంలో ఏదో ఒక తిరకాసు ఉన్నట్టు సూచిస్తోంది. బహుశా పోటీదారులున్నారేమో. ఏమైనా ఆలస్యంగా వచ్చే సంవత్సరంలో ఆశించవచ్చు.
కె.కృష్ణప్రసాద్, నరసరావుపేట (గుంటూరు)
ప్ర:వివాహ విషయం
సమా:2017లో అనుకూలం- ఆగ్నేయ దిశ- క- బ - హెచ్- వ - ర అక్షరాలు యోగకారకాలు.
ఎమ్.శివప్రసాద్, బేతంచెర్ల (కర్నూలు)
ప్ర:స్వగృహయోగం
సమా:తప్పకుండా ఉంది. 2017లో ఆ ప్రయత్నాలు ఫలిస్తాయి. అదృష్టం బాగుంది. పడమర దిశ యోగకారకం.
కూర్మాచలం వెంకటేశ్వర్లు - కరీంనగరం (తెలంగాణ)
ప్ర:రాజకీయ పదవీ యోగం ఉన్నదా?
సమా:నూటికి నూరుపాళ్లూ రాజకీయ పదవీ యోగం వుంది. అంతేకాదు, అంచెలంచెలుగా అభివృద్ధికి వస్తారు కూడాను. 2017లో అదృష్టం వరిస్తుంది.
వి.వెంకటగీతాభవాని, విజయవాడ (కృష్ణా)
ప్ర:పచ్చళ్ళ వ్యాపారం చేస్తున్నాం. వ్యాపారాభివృద్ధికి ఏం చేయాలి?
సమా:‘విక్రయవృద్ధి యంత్రం’ పెట్టుకోవాలి. ప్రతి బుధవారం నాలుగు వారాలు పణ్యహోమం చేయించాలి.
బి.వి.ఎస్.శాస్ర్తీ, హైదరాబాద్ (తెలంగాణ)
ప్ర:నా వయస్సు డెబ్భై సంవత్సరాలు. లా పాసయ్యాను. ప్రాక్టీసు పెట్టాలనుకుంటున్నాను.
సమా:ముందు ఆరోగ్యాన్ని గురించి ఆలోచించండి. ఆరోగ్యం సహకరిస్తే ప్రాక్టీసు పెట్టుకోండి.
వి.రాధామాధవ్, అనంతపురం (ఆం.ప్ర.)
ప్ర:్ధర్మవరంలో కళ్ళజోడు షాపు పెట్టాలనుకుంటున్నాను. యోగిస్తుందా?
సమా:మీ పేరున ధర్మవరం అర్వణం కాదు అంటే యోగించదు. క - హ - మ - నీ - ర అక్షరాలు యోగకారకాలు.
ఎస్.లక్ష్మీ కళ్యాణి, కాకినాడ (తూ.గో.)
ప్ర:ఆర్థిక సమస్యలు- అనారోగ్యాలు
సమా:అసాధారణంగా వుంటే మీ యింటి గృహ వాస్తు పరిశీలనకు పండితుని సంప్రదించండి. సాధారణమైనవే అయితే ఇంట్లో దేవుని వద్ద తూర్పు ముఖంగా ఇరవై నాలుగు గంటలూ ఆవు నెయ్యి దీపం వెలిగేలా చూడండి. శుభం కలుగుతుంది.
పేరు తెలపటం (పత్రికలో) ఇష్టంలేదు - నాగాయలంక - కృష్ణా
ప్ర:ఆరోగ్య సమస్య - ఆర్థికాభివృద్ధి
సమా:ఆరోగ్యానికి ప్రతిరోజూ సూర్యోదయ వేళ సూర్య నమస్కారాలు చేయండి. ఆర్థికాభివృద్ధికి శ్రీ వేంకటేశ్వరస్వామికి ఇంట్లో హుండీ ఏర్పాటు చేసుకొని, ప్రతి శనివారం యధాశక్తి అందులో డబ్బు నియమబద్ధంగా వేసి ఏడాదికొకసారి మాత్రమే తిరుమల వెళ్లి సమర్పించండి.
పి.అశ్వత్థప్ప, అనంతపురం (ఆంధ్ర)
ప్ర:మా కోడలు తన సంపాదనంతా పుట్టింటివారికోసం ఖర్చు చేస్తోంది. ఏంచేయమంటారు?
సమా:మీ కుమారుడికి 43 సంవత్సరాలు అంటున్నారు. ఆ విషయం అతను పరిష్కరించుకుంటాడు. అది వారిద్దరి సమస్య. మీరు కలుగజేసుకోకపోవడమే మంచిది.
విన్నకోట సూర్యనారాయణ, సికింద్రాబాద్ (తెలంగాణ)
ప్ర:మీరు చెప్పినట్లుగానే నాకు మరోసారి ప్రమాదం జరిగింది. రెండుసార్లు మీరు చెప్పినట్టుగానే జరిగింది. ఇంకా ఇలాంటివి వున్నాయా?
సమా:మీది పూర్వాభద్ర నాలుగవ పాదం కావటం కొంతవరకు శుభమే. ప్రస్తుతం గురువు కూడా అనుకూలమే. వచ్చే సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి.
బి.రామకృష్ణ, శ్రీకాకుళం, ఆంధ్ర.
ప్ర:ప్రభుత్వోద్యోగం
సమా:మీకు ఉన్న స్థలం నుండి దూర ప్రదేశంలో వాయవ్య తూర్పు దిశల్లో యోగం ఉంది.
ఎం.హేమంత్‌కుమార్, విజయవాడ, కృష్ణా
ప్ర:కోరిన రీతి వివాహం?
సమా:మీ కోరిక వివాదానికి దారితీస్తుంది. జాగ్రత్త అవసరం.

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్),
హైదరాబాద్- 500 059.
umapathisharma@ymail.com

‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ