ఈ వారం కథ

క్యాలిక్యులేషన్ (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రఘురాం తన కొడుకు సాకేత్ పెళ్లికోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు..
సాకేత్ చదువుకోసం బోలెడు పెట్టుబడి పెట్టడంతో అదంతా కట్నం రూపంలో రాబట్టాలన్న నిర్ణయానికి వచ్చాడు. మ్యారేజ్ బ్యూరో నడిపే నాగకుమారిని కలిశాడు.

తన కొడుక్కి కావలసిన రిక్వైర్‌మెంట్స్‌ని చెప్పాడు. నాగకుమారి రఘురాంకి పూర్వ స్నేహితురాలు.
‘‘పాతిక లక్షలు తక్కువ కాకుండా లాంఛనాలు, కట్నం కావాలి కుమారీ...’’ అభ్యర్థించాడు.
‘‘తప్పకుండా రఘూ.. వర్రీకాకు..’’ అంది. చెప్పినట్టుగానే నెల వ్యవధిలో మూడు సంబంధాలు తెచ్చింది.
‘‘ఈ అమ్మాయి పేరు సుప్రజ.. ఒక్కటే కూతురు.. ఆస్తి యాభై లక్షలదాకా వుంటుంది. క్యాష్ రూపంలో పాతిక ఇస్తారు..’’ అని ఫొటో చూపింది. అమ్మాయి బాగానే వుందనిపించింది.. కానీ చదువు ఇంటర్‌తోనే ఆగిపోయి వుంది. మరో అమ్మాయి ఫొటో చూపింది. పేరు శ్రీకన్య. మొదటి పెళ్లి జరిగిన రోజు పెళ్లికొడుకు తనకొక ప్రియురాలు వుందని వెళ్లిపోవడంతో హతాశురాలైంది. మగపెళ్లి వాళ్ళు క్షమాపణలు చెప్పి లంఛానాలు, కట్నం వెనక్కి ఇచ్చారు.
అమ్మాయికి జరిగిన నష్టానికి చింతిస్తూ మరో పదిలక్షలు ఎక్కువే ఇచ్చారు. ఇప్పుడు సరైన సంబంధం దొరికితే ఆ డబ్బు కూడా కలిపి కట్న కానుకగా ఇస్తారు. అధమం ముప్ఫై ఐదు లక్షలదాకా ముడుతుంది.
సంబంధం బాగానే వుందనిపించింది. అమ్మాయి గ్రాడ్యుయేషన్ వరకూ చదివింది కూడా.
మరో సంబంధం చూపింది. అమ్మాయి పేరు నీలాంబరి. చామనచాయగా వుంటుంది. చదువు పదో తరగతి. యాభై లక్షల వరకూ లాంఛనాలతో కలిపి ముడుతుంది.
‘‘మూడు సంబంధాలు ఆసక్తిగానే వున్నాయ్ కుమారీ.. మూడు ఫొటోలు అమ్మాయిల వివరాలు మావాడికి మెయిల్ చేస్తాను..’’ చెప్పాడు రఘురాం. చెప్పినట్టుగానే సాకేత్‌కి మెయిల్ చేశాడు.
నాలుగు రోజుల తర్వాత కొడుక్కి ఫోన్ చేశాడు. ‘‘ఏరా.. ఏ అమ్మాయిని ఫైనల్ చేసుకున్నావ్..’’ అడిగాడు.
సాకేత్ నీళ్ళు నమిలి.. ‘‘ఇంకా ఎవర్నీఫైనల్ చేయలేదు నాన్నా..’’ చెప్పాడు. వారం దాటింది. సాకేత్‌నుండి సమాధానం లేదు. ఈలోపు నాగకుమారి రఘురాంకి ఫోన్ చేసింది.
‘‘రఘూ.. నీకు చెప్పాను కదా.. ఆ అమ్మాయిల డీటైల్స్ మరెవరికీ ఇవ్వలేదు.. మూడు సంబంధాలకు నాకు మంచి కమీషన్ కూడా ముడుతుంది. త్వరగా డెసిషన్ తీసుకోండి..’’ చెప్పింది.
‘‘అయ్యో కుమారీ.. మీరెవరికీ చెప్పకండీ. మావాడికి లీవ్ దొరకలేదట.. రావడానికి’’ చెప్పాడు అబద్ధాన్ని.
‘‘ఓకే మరో నాలుగు రోజులు చూస్తాను..’’ చెప్పి ఫోన్ పెట్టింది.
భార్య సుమతి వైపు తిరిగి.. ‘‘నీ కొడుకు నిర్వాకం చూశావటే.. సెలవు పడేసి రావడానికి వాడికి ఏం రోగం..’’ అన్నాడు కోపంగా.
‘‘వాడు మీలాగా గవర్నమెంట్ జాబ్ కాదు చేసేది..’’ అంది.
‘‘జాబ్ ఏదైతేనేం.. సెలవు పెట్టి రావడానికి..’’ అన్నాడు.
రఘురాం నీటిపారుదల శాఖలో క్లర్క్‌గా పనిచేసి తాజాగా రిటైర్ అయ్యాడు. రిటైర్ అయ్యాక వచ్చిన డబ్బులతో కూతురు స్వర్ణ వివాహంచేశాడు. పైగా బోలెడు అప్పులు మిగిలాయి. కొడుక్కి బాగా కట్నం తీసుకొని నష్టనివారణ చర్యలు చేపట్టాలన్న నిర్ణయానికి వచ్చాడు.. సాకేత్ బెంగుళూరులో సియంసి కంపెనీలో ప్రాజెక్టు ఇన్‌ఛార్జిగా చేస్తున్నాడు.
తండ్రి ఫోన్‌కాల్‌కి పెదవి విరుస్తూ ఫోన్ లిఫ్ట్ చేశాడు సాకేత్.
‘‘నిజంగానే నాకు లీవ్ దొరకడం లేదు నాన్నా.. ఇది యు.ఎస్ ప్రాజెక్టు. దీన్ని సబ్‌మిట్ చేయడానికి నాకు మరో వారం పడుతుంది..’’ కన్వీన్స్‌గానే చెప్పాడు.
‘‘ఎలాగోలా మేనేజ్ చేసుకొని రెండ్రోజులు వచ్చిపోరా..’’ చెప్పాడు రఘురాం.
‘‘సరే నాన్నా..’’ అని చెప్పి ఫోన్ ‘కట్’ చేశాడు సాకేత్.
సాకేత్ బాధని గమనించింది అంకిత.. తను అతడి కొలీగ్.
‘‘మా నాన్న ప్రాణాలు తీస్తున్నాడు అంకితా..’’ అన్నాడు.
‘‘పెళ్లికెదిగిన కొడుక్కి పెళ్లిచేయాలనుకోవడం.. ఏ తండ్రికైనా బాధ్యతగానే వుంటుంది కదా సాకేత్..’’ చెప్పింది అంకిత.
కంపెనీలో అంకిత తనకి బెస్ట్‌ఫ్రెండ్. తన ప్రాజెక్టు వర్క్‌లో చక్కగా సహకరిస్తుంది. అందం, అణకువ ఆ అమ్మాయి సహజ స్వభావం. ఆమె తండ్రి చిన్నపాటి వ్యవసాయ కూలి. కష్టపడి చదువుకొని ఉద్యోగం సంపాదించుకుంది.
తండ్రి కోరిక చెప్పాడు ఆ అమ్మాయికి రెండుమూడుసార్లు..
‘‘నీపైన చాలా ఇనె్వస్ట్ చేశాడు కదా, వాటిని వసూలు చేసుకోవాలనుకోవడంలో తప్పేం వుంది’’ అంది అంకిత.
‘‘నువ్వు కూడా నాన్నని సపోర్ట్ చేస్తున్నావా, ఇక ఐనట్టే..’’ అన్నాడు నవ్వుతూ.
నిజానికి తండ్రి పంపిన మూడు ఫొటోలు సాకేత్‌కి అంతగా నచ్చలేదు.
ఆ విషయం తండ్రికి చెబితే.. ‘‘ముందు వచ్చి చూడు..’’ అంటాడని అతి భయం.
‘‘నీ పెళ్లికి కూడా ఇంత కట్నం.. కానుకలు ఇస్తావా..’’ అడిగాడు సాకేత్ నవ్వుతూ.
‘‘నో.. ఛాన్స్.. ఇచ్చే శక్తి లేదు. పైగా అవసరం లేదు.. దగ్గర బంధువుల్లో ఇద్దరు బావలున్నారు.. ఎవరో ఒకరు ఫిక్స్ అవుతారు..’’ చెప్పింది అంకిత.
‘‘సో.. యూవార్ లక్కీ..’’ అన్నాడు సాకేత్.
‘‘కావచ్చు..’’ అంది నవ్వుతూ మళ్లీ తనే.
‘‘మీ నాన్నను సతాయించింది చాలు. వెళ్లి ఆ పెళ్లిచూపులేవో కానిచ్చి రండి.. ఈలోపు మీ ప్రాజెక్టు వర్క్ నేను ‘డీల్’ చేస్తాను..’’ భరోసా ఇచ్చింది అంకిత.
‘‘అంతేనంటావా..’’ అడిగాడు నవ్వుతూ.
‘‘అంతే బాస్.. వెళ్లిరా.. పేరెంట్స్‌ని బాధపెట్టకూడదు..’’ అంది కంపెనీ క్యాంటీన్‌లో కాఫీ తాగుతూ.
అంకితను చూస్తూ ‘‘నువ్వు చాలా పాలిష్‌డ్‌గా ఆలోచిస్తావ్ అంకితా..’’ అన్నాడు.
‘‘ఈ భూమి మీదకు మనల్ని తెచ్చిందే వాళ్లు.. వాళ్లకి కాకపోతే మనం ఎవరికి జవాబుదారిగా వుండాలి..’’ అంది.
అంకితను అభినందనగా చూస్తూ.. ‘‘ఎస్.. నేను ఏకీభవిస్తున్నాను.. డియర్ ఫ్రెండ్..’’ అన్నాడు.
‘‘ఆల్ ది బెస్ట్’’ చెప్పింది.
వారందాకా వీలుకాదన్న కొడుకు ప్రక్కరోజే రావడంతో రఘురాం ఆనందపడిపోయాడు.
ఒకేరోజు సుప్రజ.. శ్రీకన్యను చూశాడు. ఫొటోలోకన్నా ఒరిజనల్‌గానే బాగున్నారు.
బావోలేదని చెప్పడానికి అతడికి పెద్ద కారణాలు కన్పించలేదు.. ఇద్దరూ సంసార పక్షంగానే ఉన్నారు.
‘‘నీలాంబరిని కూడా చూడు..’’ అన్నాడు తండ్రి.
‘‘సరే..’’నని ప్రక్కరోజు వెళ్ళారు.
ఇల్లూ.. వాకిలి బావుంది. ఫ్యామిలీ కూడా ముచ్చటగానే వుంది.. అమ్మాయి కాస్త రంగు తక్కువైనా.. కళగానే వుంది. సాకేత్ కూడా వాళ్లకు బాగా నచ్చారు.
మూడు సంబంధాలను దగ్గరుండి చూపింది నాగకుమారి. నిజానికి తను అందరి దగ్గరకూ వెళ్లదు. ఫోన్ ద్వారానే కోఆర్డినేట్ చేస్తుంది. రఘురాంతో వున్న స్నేహంవల్ల పర్సనల్ ఇంట్రస్ట్ చూపింది.
ఎప్పటికప్పుడు అంకితకు అప్‌డేట్ చేసాడు సాకేత్.
‘‘మరి ఎవరో ఒకర్ని ఫైనల్ చేసుకుంటే.. మీ నాన్నకి తలనొప్పి తగ్గుతుంది కదా’’ అంది.
‘‘ఎస్.. అదే ఆలోచిస్తున్నా..’’ అని ఫోన్ కట్‌చేశాడు.
నీలాంబరిని కూడా చూశాడు.. ఒకే కారులో తిరిగి ఇంటికి వచ్చారు.
‘‘కుమారిగారూ.. కాఫీ తాగి వెళుదురు రండి..’’ చెప్పింది సాకేత్ తల్లి సుమతి.
‘‘అలాగే..’’ అంటూ.. ‘‘నా బాధ్యతను నేను నెరవేర్చాను.. ఇక నిర్ణయం నీదే..’’ అంది నాగకుమారి నవ్వుతూ.
‘‘చిన్న కన్ఫ్యూజన్‌లో ఉన్నాను ఆంటీ.. అది కంప్లీట్ అయ్యాక.. డిసైడ్ చేసుకుంటాను’’ చెప్పాడు.
***
తిరిగి ఆఫీసు చేరుకున్నాడు సాకేత్.
అతడి వర్క్‌ని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసింది అంకిత. ప్రశంసాపూర్వకంగా చూశాడు.
‘‘ఏమయ్యాయి మీ పెళ్లిచూపులు..’’ అడిగింది అంకిత నవ్వుతూ.
‘‘ముగ్గురూ బానే వున్నారు.. ఇచ్చే ‘కట్నాన్ని’ బట్టి ఒకర్ని ఎంపిక చేసుకోవాలి..’’ అన్నాడు.
తనూ నవ్వుతూ.. ‘‘పెళ్లి కూడా వ్యాపారంగా మారిపోయింది..’’ అంది.
‘‘అఫ్‌కోర్స్..’’ అన్నాడు అంకితను తేరిపారచూస్తూ. తాను చూసిన ముగ్గురు అమ్మాయిలకంటే అంకితే అందంగా వుంది.. పైగా కట్టు.. బొట్టు.. మాట తీరులో సాంప్రదాయబద్ధంగా వుంటుంది.
‘‘ఈ అంకిత పేరెంట్స్ పాతిక లక్షలు ఇవ్వగలిగితే నాన్నను ఒప్పించవచ్చు’’ అనుకున్నాడు.
అదే పైకి చెప్పాడు.. గుర్రుమని చూసింది.
‘‘ఏం... మాకేం ఫీలింగ్స్ వుండవా.. మీకై మీరు డిసైడ్ చేసుకుంటారా..’’ అంది కాస్త కోపంగా.
‘‘సారీ నా ఉద్దేశ్యం అది కాదు.. నిన్ను చాలా క్లోజ్‌గా అబ్జర్వ్ చేశాను కదా.. నీలాంటి వ్యక్తి భాగస్వామి అయితే నా జీవితం బాగుంటుందని చిన్న ఆశ..’’ అన్నాడు.
‘‘ఆ ఏడుపేదో మీ నాన్న దగ్గర ఏడవండి..’’ అని తన క్యాబిన్‌లోకి వెళ్లింది.
తను వెళ్లినవైపే చూస్తుండిపోయాడు. అయితే తనకి.. తనంటే ఇష్టమేనన్నమాట. మనసు ఒకటి చెబుతుంది. వాస్తవం వేరుగా వుంది.. కట్నం విషయంలో నాన్న రిజిడ్. తాను పొరపాటున లవ్ మ్యారేజ్ చేసుకుంటే జీవితంలో తన ముఖం చూడడు. నాన్న సైకాలజీ తనకి తెలుసు. ఆలోచనలమధ్య రెండ్రోజులు అస్థిమితంగా గడిపాడు.
అంకిత కూడా ముభావంగా వుంది.. అంకితకు కూడా సాకేత్ అంటే చాలా ఇష్టం.. కానీ ఎప్పుడూ బైటపడలేదు.. తండ్రి కూడా సంబంధాలు చూస్తున్నాడు.
తనకి వరసయ్యే బావలున్నారని చెప్పింది కానీ.. నిజానికి ఎవరూ లేరు. మంచి సంబంధాలు వస్తూనే వున్నాయ్.. కట్న కానుకలు అంతగా ఇవ్వలేమన్నాడట..
‘‘ఉద్యోగం వుంది చాలు.. కట్నం ఎందుకు’’ అని ఇద్దరు ముగ్గురు పెళ్లికొడుకుల తాలూకూ వ్యక్తులు ఆమె నాన్నతో అన్నారట.. సాకేత్‌కి చెప్పలేదు కానీ తనకి రెండు మూడు పెళ్లిచూపులు జరిగాయ్.. ఏదో ఒక కారణం చెప్పి ‘రిజెక్ట్’ చేసింది అంకిత.
‘‘అసలు నీకెలాంటి వాడు కావాలే..’’ అడిగింది కోపంగా అంకిత తల్లి అమృత.
‘సాకేత్‌లాంటివాడని.. ఆమాటకొస్తే సాకేతే’ అని తను ఎలా చెప్పగలదు?
సాకేత్ తండ్రి రిక్వైర్‌మెంట్స్ తనకు తెలుసు.. పెళ్లయితే చేయగలరు కానీ... అంత లాంఛనాలు కట్నం తాము ఇవ్వలేరు. దద్దోజనం సాకేత్‌కి తండ్రిని కాదని తనని పెళ్లిచేసుకొనే ధైర్యం లేదు. ఎటువంటి చెడు అలవాట్లు లేకపోవడం.. పనిమీద అతడికి వుండే శ్రద్ధ.. జీవితంపట్ల అతడికుండే అవగాహన.. తనని ఆకర్షించింది. తన పట్లా అతడి అభిమానం అన్నీ ఆమెకి తెల్సు.. కానీ ఎలా తాము కలవడం? పెళ్లి ఎలా సాధ్యం? ఆ అమ్మాయి పిచ్చిదైపోతోంది.. ఒకవేళ సాకేత్ ఏదో ఒక అమ్మాయికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేస్తే.. తాను జీవిత కాలం బాధపడుతూనే వుండాల్సి వస్తుంది.. అఫ్‌కోర్స్ అతడు కూడా బాధపడవచ్చు.. కానీ ప్రేమించిన వ్యక్తిని మగాళ్లు మర్చిపోయినంత సులువుగా ఆడాళ్లు మర్చిపోలేరు.. మెడలో మంగళసూత్రం ఎవడో గొట్టంగాడు కట్టినా మనసంతా ప్రేమించిన వాడే నిండిపొయ్యి వుంటాడు.. ఆలోచనలమధ్యే.. నిద్రపట్టక దొర్లుతూ వుంటే తెల్లవారు జామున ఫ్లాష్‌లాంటి ఆలోచన వచ్చింది... ఈ ‘కానె్సప్ట్’ అతడికి చెబితే...? అనుకున్నదే తడవుగా. ఒక మెయిల్ తయారుచేసి.. సాకేత్‌కి పంపింది.. అది చదివాక అతడి కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి.
***
సడెన్‌గా వచ్చిన కొడుకును విస్తుపోయి చూశాడు రఘురాం.. అదే అడిగాడు.
‘‘మీతో మాట్లాడాలి నాన్నా’’ అన్నాడు.
‘‘ముందు ఫ్రెపష్ కా..’’ అన్నాడు. ప్రెషప్ అయ్యాక లాప్‌ట్యాప్ తెరిచి.. అంకిత ఫొటో చూపాడు.
‘‘తను నా కొలీగ్ నాన్నా.. మంచి అమ్మాయి.. తనకి ఇప్పుడు శాలరీ లక్ష రూపాయలు.. అథమం సర్వీస్ పాతికేళ్లు వుంటుంది.. సంవత్సరానికి పనె్నండు లక్షలు. హీనపట్నం పాతికేళ్లలో మూడు కోట్లు తను సంపాదిస్తుంది.. మీరు చూపిన సంబంధాల్లోని ఏ అమ్మాయి కూడా ఉద్యోగస్తురాలు కాలేదు.. ఒకవేళ అయినా అంత సంపాదించలేరు.. ఒకవేళ మధ్యలో తనకేమైనా అవుతుందని అనుకున్నా యాభై లక్షలకు తనే లైఫ్ ఇన్సూరెన్స్ చేస్తుంది..’’ దిమ్మెరపోయాడు రఘురాం. అప్పుడే అక్కడికి వచ్చి అంతా విన్న సుమతి.. కోపంగా ‘‘ఏం మాటలురా ఇవి.. ఆ పిల్లని ప్రేమించాను.. ఇంటికి కోడలిగా తెస్తామంటే కాదంటామా..’’ అంది. రఘురాం ముఖం కూడా మాడిపోయింది.
***
అంకిత.. సాకేత్‌ల వివాహం వైభవంగా జరిగింది.
‘‘నన్ను ఎలాగైనా చేసుకోవాలని నీ ఉద్యోగ జీవితాన్ని.. జీతాన్ని లెక్కలు కట్టి.. పంపి నా భావ దరిద్య్రాన్ని చక్కగా హేళన చేశావ్.. పైగా మా నాన్నలాంటి వాళ్ల కట్నపు దాహాన్ని తీర్చడానికి ఇన్సూరెన్స్ కూడా నీ లైఫ్‌కి చేస్తానని చెప్పి.. మా అందరి చెంపలు ‘చెళ్’మనిపించావు.. నిజానికి ఉద్యోగం చేసే భార్య దొరకడం కంటే మగవాడికి మరొక అదృష్టం ఏముంది..’’ అన్నాడు సాకేత్.
‘‘అంటే మీకు కూడా నా ‘కాలిక్యులేషన్స్’ తలకెక్కాయన్నమాట..’’ అంది నవ్వుతూ అంకిత..
‘‘కాదు.. నీ ప్రేమ లోతు అర్థమైంది..’’ అన్నాడు సాకేత్ భార్యని హత్తుకుంటూ. *

-తటవర్తి నాగేశ్వరి - రచయిత సెల్ నెం:9989773549