రుచి

సగ్గుబియ్యం వంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సగ్గుబియ్యాన్ని కర్రపెండలం నుంచి తయారుచేస్తారు.
దీంతో ఉప్మా, ఆలుపోహ, కిచిడి, దద్దోజనం, హల్వా పరమాన్నం, కొందరు లడ్డుని కూడా చేస్తారు. చలువ చేసే జావలో పోషక విలువలు మెండుగా ఉన్నాయ. ఆరోగ్యరీత్యా మంచిది.

హల్వా
సగ్గుబియ్యం - 4 కప్పులు
బెల్లం కోరు - 2 కప్పులు
నెయ్యి - 1 కప్పు
కోవా - 2 కప్పులు
ఏలకులు - 12
కొబ్బరి కోరు - 1 కప్పు
కండెన్స్‌డ్ మిల్క్ - 1 కప్పు
బాదంపొడి - 2 చెంచాలు
కిస్‌మిస్‌లు - 24
జీడిపప్పులు - 24
ముందుగా సగ్గుబియ్యం నేతిలో వేయించి తగినన్ని నీళ్ళు పోసి మెత్తగా ఉడికించాలి. ఇవి దగ్గర పడ్డాక చిదిపిన కోవా, కండెన్స్‌డ్ మిల్క్ కొబ్బరి కోరు చేర్చి కలపాలి. దీనిలో ఏలకుల పొడి కిస్‌మిస్‌లు, జీడిపప్పులు వేయించినవి కలిపి దింపాలి. దీన్ని పళ్ళానికి నెయ్యి రాసి పోసి సర్దాలి. చల్లారాక నచ్చిన ఆకృతిలో చేసుకోవచ్చు.

దోశె
సగ్గుబియ్యం - 2 కప్పులు
ఉప్పుడు బియ్యం - 1 కప్పు
పచ్చిమిర్చి - 6
అల్లం కోరు - 2 చెంచాలు
నూనె - 1/2 కప్పు
ఉల్లి ముక్కలు - 1 కప్పు
ఉప్పు - 2 చెంచాలు
జీలకఱ్ఱ - 2 చెంచాలు
పెరుగు - 1 కప్పు
ఎండుకొబ్బరి - 5 చెంచాలు
ముందుగా పెరుగులో ఉప్పుడు బియ్యం, సగ్గుబియ్యం 12 గంటల పాటు నానాబెట్టాలి. ఎండుకొబ్బరి, ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి.
దోశ పిండిగా మిక్సీ పట్టుకున్న తరువాత దోశెలుగా వేసుకునేటపుడు జీలకఱ్ఱ, ఉల్లి మిర్చి, అల్లం కోరు చల్లుకుని బాగా కాలాక తిరగవేసి తీసుకుని తింటే బాగుంటుంది.

ఉప్మా
క్యారెట్ కోరు - 1/2 కప్పు
కొబ్బరి కోరు - 1/2 కప్పు
బఠాణీలు - 1/2 కప్పు
ఉప్పు - 1 చెంచా
నెయ్యి - 2 చెంచాలు
ఆవాలు - 2 చెంచాలు
జీలకఱ్ఱ - 1 చెంచా
పచ్చిమిర్చి,
అల్లం కోరు - 2 చెంచాలు
కొబ్బరిపాలు - 1 కప్పు
సగ్గుబియ్యం - 2 కప్పులు
కరివేప - కొంచెం
సగ్గుబియ్యం వేడి నీటిలో నానబెట్టి ఉంచాలి. రాత్రి నానబెట్టుకుని ఉదయమే వీటిని చేసుకోవచ్చు. బాణలిలో పోపులు వేయించి, కూర ముక్కలు, ఉప్పు వేసి మగ్గనివ్వాలి. మెత్తగా అయ్యాక కొబ్బరిపాలు పోసి కలిపి మరో 5 నిమిషాలు మగ్గించి సగ్గుబియ్యం వేసి కలిపాలి. తదనంతరం కరివేపాకు జల్లి దింపాలి.

లడ్డు
సగ్గుబియ్యం - 4 కప్పులు
నెయ్యి - 1 1/2 కప్పు
పంచదార - 1 కప్పు
ఏలకులు - 12
కుంకుమ పువ్వు - 1 చెంచా
బాదంపొడి - 5 చెంచాలు
జీడిపప్పు పొడి - 5 చెంచాలు
ఎండుకొబ్బరి - 1/2 కప్పు
ముందుగా సగ్గుబియ్యం ఎండబెట్టుకోవాలి. దీన్ని నేతిలో దోరగా వేయించుకోవాలి. దీన్ని మిక్సి పట్టి అందులో పంచదార, కొబ్బరి పొడి, జీడిపప్పు, బాదం పప్పు, అన్నీ కలపాలి. ఇందులో మిగిలిన నెయ్యి వేసి ఏలకుల పొడి వేసి లడ్డూలుగా చేసుకుని తింటే రుచిగా ఉంటాయ.

కిచిడి
సగ్గుబియ్యం- 2 కప్పులు
పెసరపప్పు - 1 కప్పు
పచ్చిమిర్చి - 4
కరివేపాకు - కొంచెం
ఉప్పు - 1 చెంచా
అల్లంకోరు- 2 చెంచాలు
నెయ్యి - 4 చెంచాలు
జీలకఱ్ఱ - 2 చెంచాలు
ఆవాలు - 1 చెంచా
ఎండుమిర్చి - 2
కొబ్బరి కోరు - 5 చెంచాలు
ముందుగా సగ్గుబియ్యం వేడినీళ్లలో పోసి నానబెట్టాలి. బాణలిలో పోపులు వేయించి నానబెట్టిన పెసరపప్పు సగ్గుబియ్యం వేయాలి. ఇందులో ఉప్పు, కొబ్బరి వేసి బాగా కలుపుతూ ఉండాలి. ఇది మెత్తబడ్డాక దింపి వడ్డించాలి.

టిక్కి
సగ్గుబియ్యం - 2 కప్పులు
బంగాళ దుంపలు - 4
పచ్చిమిర్చి - 5
కొత్తిమీర - కొంచెం
నూనె - 250 గ్రా.
ఉప్పు - 2 చెంచాలు
అల్లం కోరు - 2 చెంచాలు
కొబ్బరికోరు - 2 చెంచాలు
నిమ్మరసం - 5 చెంచాలు
పెరుగు - 2 కప్పులు
సగ్గుబియ్యంలో ఉప్పు, పెరుగు కలిపి నానబెట్టాలి. ఇందులో ఉడికించిన బంగాళా దుంపలు ముద్దగా చేసి కలపాలి. అలాగే కొబ్బరికోరు, అల్లం, మిర్చి ముక్కలను కలిపి వడల పిండిగా చేసుకోవాలి. నూనె కాగాక వడలుగా తట్టి వేయించాలి. వేగిన వడలను పళ్ళెంలో పేర్చి నిమ్మరసం చల్లుకుని తింటే రుచిగా పుల్ల పుల్లగా ఉంటాయి.

- వాణీప్రభాకరి