ఐడియా

అబ్బాయిలే అదుర్స్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉన్నంతలో కాస్తంత సొగసుగా..స్టైల్‌గా..మెరిసే చర్మంతో మెరవాలని ఎవరికీ మాత్రం ఇష్టం ఉండదు. కాకపోతే అందం విషయం వచ్చే సరికి అమ్మాయిలే తహతహలాడతారు అని అనుకుంటారు. కాని అమ్మాయిల కంటే అబ్బాయిలే అబ్బాయిలే నేడు మెరుపులద్దటానికి తపించిపోతున్నారు. నయా ట్రెండ్స్ సృష్టించేస్తున్నారు. సౌందర్య సలహాల కోసం వెతకని వెబ్‌సైట్ లేదంటే అతిశయోక్తి కాదు. ఫ్యాషన్ బ్లాగులకూ కొదవలేదు. సౌందర్య కిటుకులు, చిట్కాలు అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువగా చదువుతున్నారు. కాస్మోటిక్ అలవాట్లను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ అందానికి మెరుగులు దిద్దుకుంటున్నారు. ఇండోర్‌కు చెందిన 24ఏళ్ల ఆల్సాటాన్ ఫెర్నండెజ్ ఫెయిర్‌నెస్ క్రీములను వాడటం అలవాటుగా చేసుకున్నాడు. వేరే మార్గం లేదు. ఎందుకంటే ఫెయిర్‌గా ఉండాలంటే వాడకతప్పటం లేదంటున్నాడు. తమిళనాడుకు చెందిన పిహెచ్‌డీ స్కాలర్ ఆనంద్ శంకర్ రాజ, కొయంబత్తూర్‌కు చెందిన మహేష్ కుమార్ మాట్లాడుతూ దాదాపు 30శాతం మంది అబ్బాయిలు సీక్రెట్‌గా ఫెయిర్‌నెస్ క్రీములు వాడతారని వెల్లడిస్తున్నారు. చామన ఛాయగా ఉండే ఢిల్లీకి చెందిన పందొమ్మిదేళ్ల అబ్దుల్ అహ్మద్‌ను ఎక్కువ సేపు ఎండలో ఉండొద్దని తల్లిదండ్రులే హెచ్చరిస్తుంటారు. ఎందుకంటే చర్మంపై మచ్చలు వస్తుంటాయి. తల్లిదండ్రులు అందంగా ఉంటే వారి పిల్లలు కూడా బాగుండటం చూస్తుంటాం. ఇపుడు అందంగా ఉన్న పెళ్లికొడుకు, పెళ్లికూతురికే మార్కెట్‌లో డిమాండ్ బాగా ఉంది. అందుకే ఈ వయసు నుంచే ఫెయిర్‌నెస్ క్రీములను వాడుతున్నాం అని చెబుతున్నాడు. అమ్మాయిలు కూడా అందంగా లేదా కనీసం చామన ఛాయగా ఉండే అబ్బాయిలనే ఇష్టపడుతున్నారు. సోషల్ మీడియా సృష్టిస్తున్న ట్రెండ్ వల్ల అబ్బాయిలు స్టయిల్‌గా ఉండే దుస్తులను ఎంపికచేసుకుంటున్నారు. అంతేకాదు హెయిర్ స్టయిల్‌ను ఎప్పటికప్పుడు మార్చేస్తున్నట్లు 18ఏళ్ల మధుర వెల్లడిస్తోంది.

స్టయిల్‌గా ఉంటే తమ చుట్టూ అమ్మాయిలు చేరతారని వారి ఆరాటం. ఇందుకోసం అబ్బాయిలు శారీరకంగా దృఢంగా ఉండటానికి కసరత్తులతో పాటు ఇలాంటి ఫెయిర్‌నెస్ క్రీములను వాడుతూ అమ్మాయిలను ఆకర్షించటానికి తెగ తాపత్రయపడటం సహజమని డాక్టర్ రాహుల్ గాడ్జే అంటున్నారు. కాస్మోటిక్స్ అధికంగా వాడటం వల్ల కొన్ని సందర్భాల్లో రియాక్షన్స్ వస్తున్నందున కొంతమంది ఆయుర్వేదిక్ క్రీములను వాడుతున్నట్లు చెబుతున్నారు. అందం కోసం అబ్బాయిల ఫీట్లు అన్నీఇన్నీ కావు. అద్దం ముందు నిలబడి వివిధ భంగిమల్లో నిలబడి ఎలాంటి స్టయిల్ మెయింటెన్ చేయాలనే ఆరాటం ఆధునిక అబ్బాయిలకే ఉండటం వారి మనస్తత్వానికి అద్దం పడుతోంది.