సబ్ ఫీచర్

సంఘ బహిష్కరణే శరణ్యమా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘వాడికి ఆ ఊళ్లో నిప్పు పుట్టదు’- అన్నమాట ఈతరం వారిలో కొంతమందికి తెలియకపోవచ్చు. మధ్య వయస్కులూ, వృద్ధులూ విని ఉన్నప్పటికీ చాలామందికి ఆ మాట అర్థం తెలిసి ఉండకపోవచ్చు. గత వందేళ్ల కాలంలో ‘అగ్గిపెట్టె’ మన జీవితంలో ముఖ్యమైన భాగంగా మారిపోయింది. అది లేని రోజులుండేవన్నది మన ఊహక్కూడా అందని విషయం. అరక్షణంలో అగ్గిపుల్ల గీసి దీపాన్నో, స్టవ్‌నో అంటించేస్తాం. అది లేని కాలంలో నిప్పు తయారీ చాలా కష్టమైన ప్రక్రియ. కర్రల రాపిడి వంటి క్లిష్టమైన మార్గాలలో రాజేసిన నిప్పును ఆర్పకుండా ఉంచుకునేవారు. ఎవరికైనా నిప్పు అవసరమైనపుడు నిప్పు ఉన్న ఇంటికెళ్లి ఒకటి, రెండు మండుతున్న కర్రలు తెచ్చుకుని తమ ఇంట్లో పని గడుపుకుని, తాము మిగిలిన నిప్పు పుల్లలను దాచుకునేవారు. డబ్బు కానీ, వస్తువులు కానీ అవసరమైనపుడు పక్కింటికో, ఎదురింటికో వెళ్లినట్లే నిప్పుకోసమూ వెళ్ళడం ఉండేది. ఏ కారణంగానైనా ఊళ్ళో అందరికీ అనిష్టుడైనవాడికి ఎవరూ నిప్పు ఇచ్చేవారు కాదు. అలాంటి వాడికి ఆ ఊళ్ళో నిప్పు పుట్టదు.
వెలుగూ, వేడీ మానవుడికి నిత్యావసరాలు. రెండింటికీ నిప్పు అవసరం (ఎలక్ట్రిసిటీ లేని రోజుల నాటి మాట). అతి ముఖ్యమైన నిప్పు కూడా ఎవరూ ఇవ్వలేదంటే ఆ వ్యక్తి సంఘ బహిష్కృతుడై ఉండి వుండాలి. సంఘం వెలివేసేటంత పెద్ద తప్పు ఏదైనా చేసి ఉండాలి. గత శతాబ్ది ఆరంభంలో సైతం కొన్ని సంఘ నియమాలను అతిక్రమించిన వారిని అందరూ వెలివేసేవారు. ‘వెలి’ని మించిన శిక్ష మరొకటి ఉండదు. ప్రస్తుతం ఎక్కడా సమాజం నుంచి ఎవరినీ వెలివేస్తున్నట్టు లేదు.
తాజాగా వెలిని గురించిన ఆలోచనలన్నిటికీ మూలకారణం- దేశంలో అందరికీ తెలిసిన ‘నిర్భయ’ కేసు. ఆ కేసులో దోషులకు పడిన శిక్షలు, వయస్సు నిబంధనలపై చర్చ, బాలనేరస్థుల చట్టంలో మార్పు తేవడం మొదలైనవి అందరికీ తెలిసినవే. ‘నిర్భయ’ కేసులో బాలనేరస్థుడు జైలుశిక్ష పూర్తి చేసి విడుదలైన సందర్భంలో 18 సంవత్సరాల వయసు నుంచి 16 ఏళ్ళకు బాల నేరుస్థుల వయః పరిమితిని తగ్గించారు. అయితే- 15 సంవత్సరాల పదకొండు నెలలవాడు తీవ్ర నేరం చేస్తే అది శిక్షార్హమైన నేరం కాకుండా పోతుందా? ప్రభుత్వం విధించే శిక్షల వల్ల నేర నియంత్రణ జరిగితే ఈపాటికి ప్రపంచంలో నేరమన్నది వుండనే కూడదు కదా. అత్యాచారమనే నేరం ఇంకా ఆగకపోవడానికి కారణం సరైన శిక్షావిధానం లేకపోవడమేనా?
నిజానికి అత్యాచారం అన్నమాటకు అసలైన నిర్వచనమేమిటి? స్ర్తిని కోరికతో చూడడం, ఆమెతో ఏకాంతంలో భాషించడం, ఆమె శరీరాన్ని స్పృశించడం మొదలైనవన్నీ శృంగారం క్రిందకే వస్తాయి. ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా జరిగే కార్యమే అత్యాచారం. ఈ విషయంలో నేటి సమాజంలో సాధారణ వ్యక్తుల దృష్టి ఎలా ఉంది? ఇప్పటికే కొన్ని రకాల రియాక్షన్స్‌ని మనం గమనించవచ్చు.
‘వాడు నావైపు అదోలా చూస్తున్నాడు..’ అంటే- ‘నువ్వు చూడకుండా నీకెలా తెలిసింది..?’ అనేవారికి కొదవలేదు. ‘బావ నన్ను చెయ్యి పట్టుకున్నాడక్కా..’ అనగానే ‘‘నా కాపురంలో నిప్పులు పోస్తున్నావు’-అన్న మాట నూటికి తొంభై శాతం మంది నోట వినిపిస్తుంది. ‘అది సరిగ్గా వుంటే వాడలా ఎలా చేస్తాడు..?’ అని తమకు తెలియని విషయాలలోనూ, తాము చూడని సంఘటనల గురించీ అనడానికి ఎవరూ వెనుకంజ వేయరు.
నేరస్థుణ్ణి వదిలిపెట్టి బాధితుల్ని శిక్షించే సమాజం నేడున్నది. అత్యాచారానికి గురైన ఆడదాన్ని ‘చెడిపోయింది’ అని ముద్రవేసే సంఘంలో శిక్ష పడడం సామాన్యంగా జరగదు. టిఆర్‌పిలు పెంచుకునే టీవీ చానళ్ళవల్లా, ఏదో ఒక సంఘటనను వాడుకుని పేరు ప్రతిష్ఠలు సంపాదించుకుందామనుకునే మహిళా సంఘాలవల్లా నిర్భయ కేసులో నేరస్థుల శిక్ష విషయంలో అందరూ గొంతు చించుకుని అరుస్తున్నారు. కానీ అలాంటి ఇతర కేసుల విషయం గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. 2014 సంవత్సరంలో కేవలం 48,193 అత్యాచార కేసులు కోర్టు ముందుకు వచ్చాయి. బయటపడటానికి భయపడిన అభాగ్యురాళ్ళు ఇంకెందరున్నారో తెలియదు. ఇన్ని అత్యాచారాలు జరగడానికి సినిమాలనూ, పాశ్చాత్య సంస్కృతినీ, కంప్యూటర్ సైట్లనీ తిట్టడం సులువు. నేరస్థుడి విషయంలో సంఘం ఉదాసీనత వహించడం, నేరస్థుణ్ణే వెనకేసుకుని రావడం అంతకన్నా ముఖ్య కారణాలు కావా?
ఈ విషయంలో విద్యావంతుల పక్షం కూడా రేపిస్టులవైపే ఉండడం, రేప్‌లో తప్పులేదనడం నిజంగా దురదృష్టకరం. రచయిత్రులు కూడా హీరో రేప్ చెయ్యడాన్ని వర్ణిస్తూ నవలలు రాశారు, ఆ నవలలను సినిమా కథలుగా మార్చారు. ఆ నవలలు మహిళా పాఠక జనాదరణకి నోచుకున్నాయి, స్ర్తి ప్రేక్షకుల హృదయాలను ఆకర్షించాయి. ఆ మధ్య ‘నిర్భయ’ కేసుపై తీర్పు వెలువడబోతున్న సమయంలో కూడా హీరో (తనను ప్రేమిస్తున్న) హీరోయిన్‌ని అపార్థం చేసుకుని శిక్షగా ఆమెను రేప్ చెయ్యడం, చివరలో వారిద్దరూ ఒక్కటై ‘శుభం’ కార్డు పడటంతో నవల ప్రచురితమైందంటే సమాజం దృష్టిలో రేప్ గురించిన దృక్పథం స్పష్టంగా తెలుస్తున్నది. హీరో రేప్ చెయ్యడం, హీరోయిన్ క్షమించడం, క్షమించేదాకా సంఘం ఆమెను శత్రుభావంతో చూడటంతో వచ్చిన నవలలకూ, సినిమాలకూ లెక్కలేదు.
ప్రాచీన కాలంలో అత్యాచారాన్ని మహత్తర కార్యంగా భావించలేదు. అది శిక్షార్హమైన నేరంగానే తలచారు. రంభ విషయంలో రావణాసురుడైతేనేమి, ద్రౌపది విషయంలో కీచక, సైంధవులైతేనేమి.. వారిని దుర్మార్గులనే సంఘం భావించింది, కావ్యకర్తలూ వారిని దుష్టపాత్రలుగానే చిత్రీకరించారు. ‘బంధకీ’ అని ద్రౌపదిని నిందించిన కర్ణుణ్ణి మహాపురుషుడిగా సినిమాలు తీస్తే ‘ఆహా’ అనే వారికి నేడు అంతులేదు. ఇటువంటి సమాజంలో రేప్‌ల సంఖ్య పెరగకుండా ఉండడం ఎలా సాధ్యం?
ప్రతి నేరస్థుడికీ శిక్ష కోర్టులోనే పడడం సాధ్యం కాదు. చట్టంలో లొసుగులుండవచ్చు, తెలివైన డిఫెన్సు లాయర్ కేసుని తనకు అనుకూలంగా మార్చుకుని నిందితుడికి శిక్ష పడకుండా చెయ్యవచ్చు, పోలీసు, న్యాయ శాఖల్లో అవినీతి కానీ, అసమర్థత కానీ లేక రెండూ కానీ ఉండవచ్చు, రాజకీయ నాయకుల జోక్యంతో తీర్పులో మార్పులుండవచ్చు. చట్టం నుంచి తప్పించుకున్నా సంఘం నుంచి తప్పించుకోలేమనే భయముంటే నేరాలు తగ్గే అవకాశం ఎక్కువ. పూర్వం అనేక రకాల తప్పులకు ‘వెలి’ అనే శిక్షను అందుకే వేసేవారు. బంధుమిత్రులూ, ఇరుగుపొరుగూ అందరూ కాదంటే తప్పు చెయ్యడానికి ఎవరైనా సంకోచిస్తారు. అత్యాచారాల విషయంలో ఆడవారికే సంఘంలో శిక్షపడటం చాలా విచారించవలసిన విషయం.
అత్యాచార నేరంలోనే కాదు ఏ నేరానికైనా ఇదే సూత్రం వర్తిస్తుంది. మితిమీరిన తాగుడుతో వశం తప్పిన ప్రముఖ నటుడు కారుని ఫ్లాట్‌ఫారంపై నిద్రిస్తున్న అభాగ్యులపైకి నడిపి వారి మరణానికి కారణమయ్యాడు. సాక్ష్యాధారాలు సరైనవి లేవని కోర్టు కేసుని కొట్టివేసింది. ఆనాడు పండుగ సంబరాలు చేసుకున్నారే తప్ప నేరస్థుడి సినిమాలను బహిష్కరించాలన్న ఊహ అందరికీ వచ్చి ఉంటే దేశంలో డ్రంకెన్- డ్రైవింగ్ యాక్సిడెంట్లు చేసే వారి సంఖ్య తగ్గిపోయి ఉండేది కాదా?

-పాలంకి సత్య