ఐడియా

పావురాల బెడదకి విరుగుడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశంలో కుక్కల బెడద ఆ సేతుహిమవన్నగమూ వున్నది. ఇక వానర మూకల సంగతి అయితే చెప్పనే అక్కరలేదు. కనబడితే కాల్చిపారేయమన్నారు కోతుల్ని సిమ్లాలో! ‘కుక్కల్ని హింసిస్తే నేరం’ అంటూ వున్న కేరళ రాష్ట్రంలో మోతుబరులూ, పెద్దలూ అయిన వాళ్ళే- ‘తట్టుకోలేం, వీటిని చంపేస్తాం’’ అంటూ చందాలు వేసుకుని మరీ రంగంలోకి దిగారు.
ఇక మనిషితో సహజీవన సాంగత్యం చేసే పక్షులు వున్నాయి. చిలకల్నయితే పెంచుకుంటాంగానీ, పావురాలనెవరు పెంచుకుంటాడు? అవి అపార్ట్‌మెంట్లు గల సిటీలలో కుప్పలు కుప్పలుగా ప్రతీ బిల్డింగ్‌లోనూ- అలాగే దేవాలయాల గోపురాలలోనూ- క్రిక్కిరిసిపోయి మరీ జీవిస్తూ ‘కువ కువ’లతో జనాల్ని చంపుకుతినేస్తూంటాయి. వాటి సందడి అంతా యింతా కాదు. కొత్త జంటల్లాగా- నిత్య నూతన ప్రణయ కలాపాలు చూపిస్తూంటాయి. సరే, అట్లే కానిండు గానీ రెట్టలు వేసి చంపేస్తాయి మనల్ని.
అపార్టుమెంట్ కొత్తయితే, పావురాలు కొత్తా? అని సామెత కూడా పుట్టుకొచ్చింది. ఈ బెడద ప్రపంచ వ్యాప్తంగా వుందని యిప్పుడు తెలుస్తోంది. నగరాల జంక్షన్‌లలో వుండే నీటి ఫువ్వారాలలో జలకాలాడుతూ- ట్రాఫిక్‌క్రింద పొరపాటున కూడా పడకుండా అవి ట్రాఫిక్‌ని అడ్డుకుంటూ, సందడి చేసే రుూ పావురాలు స్పెయిన్ దేశంలోని బార్సిలోనా మహానగరవాసులకు గొప్ప ‘ఐసోరు’గా మారిపోయింది. ‘‘్ఛస్తున్నాం’’ అంటున్నారు వాళ్లు.
చారిత్రాత్మమయిన భవనాలు- అది హవామహల్ అవనీండి, తాజ్‌మహల్ అవనీండి- పావురాలకి ఆలవాలమే. ఈ కాణాచి భవనాల అందాన్నీ, ఆరోగ్యాన్నీ కూడా వీటి రెట్టలతో సర్వనాశనం చేస్తున్న రుూ పావురాల్ని ఎలా వదిలించుకోవాలి? అన్నది గొప్ప తలకాయ నొప్పయిపోయింది స్పెయిన్ గవర్నమెంట్‌కి.
పక్షుల్ని మూకుమ్మడిగా చంపేసే పద్ధతి ఒకటి వుంది. ‘కిల్లింగ్’ కాదది ‘కల్లింగు’ అంటారు. గానీ యిటీవల జంతువులపట్ల హింస తగదు అంటూ జీవకారుణ్య ఉద్యమం ఒకటి పుంజుకున్న నేపథ్యంలో పావురాల పీడ వదిలించుకోడానికి బార్సిలోనా పుర అధికారులు ఒక ట్రిక్కు- ఒక చిట్కా- ఒక విరుగుడు కనిపెట్టారు. అదేమిటి అంటే, గర్భ నిరోధక మాత్రలు వీటికి- అవి తినే గింజలలో, ఆహార పదార్థాలలో కలిపి, జల్లి వదిలేస్తే- అవి ఎంచక్కా వాటిని, ముక్కుతో నొక్కుకుని మింగేస్తాయి. ద్విగుణీకృతోత్సాహంతో ప్రణయ కలాపాలు సాగిస్తాయి. కానీ గుడ్లు పెట్టలేవు. పెట్టినా అవి పిల్లలుగా మారవు!
ఈ పద్ధతివల్ల వచ్చే నాలుగైదు ఏండ్లలో- రుూ కువ కువ పక్షుల సంఖ్య ఓ ఎనభై శాతం దాకా తగ్గుతుందిట. అలా అని ఆశపడుతున్నారు. అదేదో గర్భనిరోధక మందు మన మేనకా గాంధీగార్ని పంపించి మనమూ తెప్పించుకోవచ్చునేమో? దానికి కూడా ఆమె ఒప్పుకోదు అంటున్నారా! సరే వదిలేండి- అపార్ట్‌మెంట్లన్నిటికీ ఇనుప జల్లెడలు మస్తుగా వేయించుకోండి.