భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భవిష్యకాల పృచ్ఛకులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు
చాలామంది భవిష్యకాల పాఠకులు వచ్చేఆంగ్ల వత్సరం 2017లో దేశ పరిస్థితులు ఎట్లా ఉంటాయని వ్రాశారు- అందరి ప్రశ్న ఒకటే కనుక వారి పేర్లు వ్రాయటం సాధ్యం కాదు. ప్రశ్న ఫలం మాత్రం టూకీగా- మన దేశం కర్కాటక మకర రాసుల ప్రభావంలో వుంటుంది. మకరానికి ధనుస్సులో శని సంచారం- తులలో గురు సంచారాలు చెప్పుకోదగ్గ మార్పులు- వీటి ఫలితంగా వ్యాపార రంగానికి- సైనిక రంగానికి - రత్న- వస్త్ర- భోజన సంబంధమైన రంగాలకు ప్రారంభంలో ఇబ్బందులు కలిగినా సంవత్సర మధ్యభాగం నుండి లేదా ఏప్రిల్, మేల నుండి కీర్తిప్రతిష్ఠల విషయంలో అభివృద్ధి కలుగుతుంది. దేశ ప్రతిష్ఠ ఇనుమడించే అవకాశం వుంది. రాజకీయ రంగంలో కొందరి స్ర్తి ప్రముఖులకు ధనస్సులో శని ఆరోగ్య సంబంధమైన విషయాలలో అసౌకర్యం కలిగించవచ్చును. సామాన్యులకు అనుకూలం.
శ్రీరాముల ప్రభాసిని, రాజమండ్రి - (ఆంధ్ర)
ప్రశ్న: మానసిక వ్యాధి నయమవుతుందా? స్థిరత్వం ఎప్పుడు?
సమాధానం:మనస్సు స్వతహాగా చంచలం- ఏకాగ్రం అయినప్పుడు ఆ భావంలో మనసు లయమవుతుంది. ఏకాగ్రత అలవడుతుంది. నాసికాగ్రంమీద దృష్టి నిలిపి ప్రణవాన్ని జపించండి, ప్రతిరోజు గంటసేపు- మార్పు వస్తుంది.
కాకాని ప్రసాద్, వెంకటాపురం (తెలంగాణ)
ప్ర:ప్రస్తుత వ్యాపారం ఫైనాన్స్- మరో వ్యాపారమేదైనా సూచించండి. అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాను.
సమా:రచనా వ్యాసంగం సాధన చేయండి. బుక్స్- స్టేషనరీ వ్యాపారాలు బాగానే ఉంటాయి. ఒకసారి ఇంటి వాస్తు పరీక్షించుకోండి.
నూతలపాటి శివరామయ్య, నర్సారావుపేట, ఆంధ్ర
ప్ర:మా యింటికి తూర్పుఆగ్నేయంలో వీధిపోటు ఉన్నది. మా సమస్యలకు కారణం అదేనా?
సమా:వీధిపోటు కూడా ఒక కారణమే- ఆగ్నేయం నుండి వీధి పోటు మంచిదికాదు. దానికి ప్రత్యేకమైన వాస్తు యంత్ర ప్రతిష్ఠ చేయించాలి. స్థానిక పండితులను కలవండి. లేదంటే వ్యక్తిగతంగా సంప్రదించండి.
బి.బసవంతి, బరంపురం, (ఒడిసా)
ప్ర:నా ఆర్థిక పరిస్థితి బాగులేదు. మా అమ్మాయి వివాహం ఎలా చేయగలను.
సమా: ఒక స్థిరాస్తి అమ్మకం ద్వారా మీకు డబ్బు వచ్చే అవకాశాలున్నాయి. 2018లోగా మీ అమ్మాయి వివాహమవుతుంది.
బచ్చు కొండయ్య, విజయవాడ, ఆంధ్ర
ప్ర:్భవిష్యత్తులో నా ఆర్థిక పరిస్థితి
సమా:మీకు ధనకారకుడు- లాభకారకులు- ప్రతికూల స్థానంలో ఉన్నారు. స్వర్ణ దుర్గా మహామంత్రంతో కనకదుర్గాదేవికి ప్రతి మంగళ బుధవారాలు పూజ చేయించండి.
ఎల్ల రమేశ్, కోరుట్ల, తెలంగాణ
ప్ర:నాకు ఏ పనులు సక్రమంగా జరగటంలేదు. ఉద్యోగ ప్రయత్నం ఫలించటంలేదు.
సమా:ప్రతి సోమవారం- గురువారం- వినాయకునికి అటుకులు, బెల్లం యధాశక్తి సమర్పించండి. మీకు ఆగ్నేయ దిశలోకాని నైఋతి దిశలో కాని విద్యా రంగంలో ఉద్యోగం దొరుకుతుంది 2017లో.
సిహెచ్.వెంకట శివుడు, హబ్సిగూడ (హైదరాబాద్)
ప్ర:ఆరోగ్యం- ఆయుర్దాయం- భవిష్యత్తు
సమా:ఆరోగ్యరీత్యా నడుము భాగం- తొడలు- నరాల బలహీనత- మూల కారణాలుగా కనిపిస్తున్నాయి. ఆయుర్దాయం- మీరడుగరాదు- మేము చెప్పరాదు. భవిష్యత్తు గురించి అతిగా ఆలోచిస్తున్నారు. దైవం వైపు మనస్సు తిప్పండి.
కోగంటి ధరణి, ప్రసాదంపాడు, ఆంధ్ర
ప్ర:వివాహ విషయం?
సమా:ఇంకా ఆలస్యముంది. శని కుజ దోషాలకు తగు దైవ సేవ చేయించండి!
చాట్ల వెంకట రమేశ్‌బాబు, ఎనికపాడు (ప్రకాశం, ఆంధ్ర)
ప్ర:జ్యేష్ఠా నక్షత్రం, నాలుగవ పాదం- వివాహం ఎప్పుడు?
సమా:జ్యేష్ఠా నక్షత్రానికి జన్మ సమయంలో శాంతి చేయించారా? లేదంటే ప్రాయశ్చిత్త శాంతి చేయించుకోండి. వివాహం 2017 చివరలో అవకాశం వుంది.
మునుకుంట్ల సత్యనారాయణ, వీరవాసరం (ప.గో.)
ప్ర:ఇండియన్ బాంక్‌లో తాత్కాలిక ఉద్యోగం- పర్మినెంట్ అవుతుందా?
సమా:ఎవరో కొందరి కౌటిల్యం కారణంగా పైదాకా పోవటంలేదు. మానేయకండి. మంచి జరుగుతుంది.
నవీన్‌కుమార్, విజయవాడ, ఆంధ్ర
ప్ర:మీరు నా విషయంలో నక్షత్రాంశ దోషం అన్నారు. అంటే ఏమిటి? నివారణ ఏమిటి?
సమా:జన్మనక్షత్ర పాదవశాత్ మీది అష్టమాంశ- అంటే ధన సంబంధమైన విషయాలలో ప్రతికూలత- ప్రయత్నాలలో విఘ్నాలు. దాని నివారణకు సిద్ధి వినాయక సంబంధంగా ప్రతి చతుర్థినాడు సిద్ధి వినాయక వ్రత పూజ చేసి కుడుములు నివేదించండి.
వజ్జ రమేశ్, తామరం గ్రామం - వైజాగ్, ఆంధ్ర
ప్ర:కుమారునికి ఫిట్స్ వ్యాధి- మృగశిరా నాల్గవ పాదం- నివారణ చెప్పండి.
సమా:నా పరిశీలనలో మీ అబ్బాయికి తొడలు బలహీనం. మూత్రాశయం కూడా దోషం- తలకు సంబంధించి ఫిట్స్ వంటివి రాకుండా ఉండాలంటే హారతి కర్పూరం ధూపం వేయండి. శుభ్రమైన గుడ్డలో హారతి కర్పూరం (కల్తీలేనిది) చూర్ణం వేసి వాసన చూపిస్తూ ఉండండి. ఆహారంలో నువ్వులూ- వెల్లుల్లి బాగా వాడండి! లేదా రెండూ కలిపి శనగలవలె మాత్రలు చేసి ప్రొద్దున, సాయంత్రం తినిపించినా మంచిదే. ఉదయం చిట్టెపత్రి ఫలాచూర్ణం నీళ్ళలో కలిపి తాగించండి. మంచి ఫలితం కలుగుతుంది. కులదైవాన్ని పూజించండి.
భాస్కరుని వెంకటలక్ష్మీ నరసింహమూర్తి, నరసరావుపేట (ఆంధ్ర)
ప్ర:మనస్సు నిలకడగా ఉండాలంటే ఏం చేయాలి?
సమా:ప్రతిరోజు గంటసేపు ప్రణవాన్ని జపిస్తూ హృదయంలో ఉదయ సూర్య బింబాన్ని ధ్యానించండి. ‘జపతో నాస్తి పాతకం- యజ్ఞానాం జపయజ్ఞోస్మి’ అని గీతావాక్యం.
గుఱ్ఱం కొండ గురువప్ప, మదనపల్లె (చిత్తూరు, ఆంధ్ర)
ప్ర:ఆరోగ్య విషయం- కాళ్ళపైన కురుపులు-
సమా:మీరు చెప్పిన సంఖ్య ప్రకారం మిమ్మల్ని క్రిమికీటకములు కాని కుక్క కరపు లాంటి సంఘటనలు కాని జరిగినట్లు కనిపిస్తోంది. పావు చెంచా త్రిఫలచూర్ణములో అదే ప్రమాణంలో మినపపప్పు కలుపుకొని చూర్ణముగా నీళ్లలో వేసుకొని పరగడుపున తాగండి. స్నానం నీళ్ళలో కొంచెం ఉప్పు - హారతి కర్పూరం- నిమ్మరసం వేసుకొని స్నానం చేయండి. గృహ వైద్యంగా మంచి ఫలితముంటుంది.
టి.అనిల్‌కుమార్, విశాఖపట్నం, ఆంధ్ర
ప్ర:ఉమ్మడి కుటుంబం- రావలసిన డబ్బు ఎప్పుడు వస్తుంది.
సమా:మీరు చెప్పిన సంఖ్య ప్రకారం మీ వరకు మీకు మార్చిలో కొంత డబ్బు వచ్చే అవకాశముంది.
విజయ కిశోరు, చిలకలూరిపేట, ఆంధ్ర
ప్ర:వివాహ విషయం
సమా:2017 మధ్యభాగంలో ఒకటి రెండు తప్పి వాయవ్య దిశ నుండి వచ్చిన సంబంధము నిశ్చయమగును.
చంద్రావతీ టాగోర్ - సింగపూర్ (సింగపూర్)
ప్ర:సింగపూర్‌లో స్థిరాస్తి సంప్రాప్తించాలనుకుంటున్నాను- సాధించగలనా?
సమా:మీ ఆశయానికి మీ కుటుంబంలో వారే అంగీకరిస్తున్నట్టు లేరు. అనుకున్నంత సులభంగా జరగదు.

పేరు :
చిరునామా : ...................................................... ............................................................................
...........................................................................
తోచిన సంఖ్య (1 నుంచి 108 లోపు) :
ఆ సంఖ్యను అనుకున్న సమయం, తేదీ:
............................................................................
ప్రశ్న : .................................................................
................................................................... ...................................................................
సంతకం :

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్),
హైదరాబాద్- 500 059.
umapathisharma@ymail.com

‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ