Others

సంక్రాంతి పండక్కి.. సొగసుగా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి సందడి ఆరంభమైంది. సంక్రాంతి నాడు తెలుగు లోగిళ్లు పుట్టింటికి వచ్చే అమ్మాయిలు, కొత్త అల్లుళ్లతో సందడిగా కళకళలాడుతుంటాయి. పెద్ద పండుగనాడు నలుగురు చూసేలా చూడముచ్చటగా ముస్తాబవ్వాలని ఆరాటపడుతుంటారు. ఆచారాలు, ఆనందాల కలయికతో జరుపుకునే ఈ పండుగనాడు వనె్న వనె్న చీరల్లో అందాన్ని రెట్టింపు చేసుకోవటానికే మగువలు ఇష్టపడుతుంటారు. అంతెందుకు కాలేజీ అమ్మాయిలు సైతం అసహజంగా, అసౌకర్యంగా అనిపించినా పండుగనాడు చీరకట్టుకే ప్రాధాన్యం ఇస్తారు. లెహంగా చోలీ వేసుకున్నా అది చీర వలే మేనిని తాకినట్లు అనిపించదు అనుకుంటారు. అందుకే విభిన్న డిజైన్లు, రంగుల్లో ఉన్న చీరలనే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. చీరలో ఓ మ్యాజిక్ ఉంది.విడిగా చూస్తే బాగుండని కొన్ని రంగులు, డిజైన్లు చీర మీదకు వచ్చే సరికి వయ్యారాలు ఒలకబోస్తూ ఆవిష్కృతమవుతాయి. దీంతో చీర సోయగం మరింత పెరుగుతుంది. వేడుకకు తగ్గట్టు వివిధ రంగుల్లో, డిజైన్లలో ఉన్న చీరలు అందుబాటులోకి వచ్చాయి. ఎరుపు, నలుపు రంగుల్లో మెరిసే కాంచీపురం పట్టుచీరకు హరివిల్లు వంటి పల్లుతో పాటు అంచును అందమైన బోర్డర్‌తో తీర్చిదిద్దారు. పండుగ సమయంలో ఆడంబరంగా కనిపించాలనుకుంటే కంజీవరం సిల్క్ చీరలను ఎంచుకుంటే ఎంతో మంచిది. కాస్త సాదాగా ఉన్నా ఫరవాలేదు అనుకుంటే డిజైనర్ చీరలను ఎంపిక చేసుకుంటే హుందాగా కనిపిస్తారు. ఇంటికి వచ్చే బంధుమిత్రుల మధ్య పండుగ తీపి జ్ఞాపకంగా మిగిలిపోవాలనుకుంటే ఆకృతికి నప్పేలా డిజైనర్ చీరతో పాటు డిజైనర్ బ్లవుజులు ధరిస్తే సరిపోతుంది. సన్నగా ఉన్నవారికి అన్నిరకాలు నప్పుతాయి. ఇలాంటివారు ప్రత్యేక ఆకర్షణగా నిలవాలంటే డిజైనర్ చీరలకు బార్డర్, కుచ్చిళ్లకు చక్కటి డిజైన్ ఉన్న చీరలను ఎంపికచేసుకుంటే మంచిది. మేనిఛాయ ఉన్నవారు ముదురు రంగు చీరలను ఎంపికచేసుకున్నా ఫరవాలేదు. సాదా పండుమిరప రంగు చీరకు నల్లటి బోర్డర్‌తో సింపుల్‌గా కనిపిస్తున్న చీరకు ఆడంబరంగా ఉన్న బ్లవుజు వేసుకున్నా నలుగురిలో అందంగా కనిపిస్తారు. బ్లూకలర్ చీర మీద సన్నటి డిజైన్‌తో పాటు పల్లు, బోర్డర్, అంచు అన్నీ కూడా భారీ పని తనంతో ఉన్న ఈ చీరకు సాధారణ బ్లవుజు వేసుకుంటే దేవకన్య వలే మెరిసిపోతుంటారు. నిండు గులాబీ రంగులో సాదాగా ఉన్న చీరకు గోల్డ్ కలర్‌లో భారీ బోర్డర్, పల్లుతో సింగారాన్ని రెట్టింపు చేస్తుంది. ఎరుపు రంగు సాదా చీర అంచుకు సింపుల్ డిజైన్ చేసిన చీర కూడా మెరుపులద్దుతుంది. సంక్రాంతి పండుగకు తగ్గట్టు సంప్రదాయ రంగుల్లో జిగేల్‌మనే చీరలను ఎంపికచేసుకుని సరదాల సంక్రాంతినాడు సందడి చేయండి.