మెయిన్ ఫీచర్

పేద పిల్లలకు సైన్స్ పాఠాలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టుకతోనే ఎవరూ శాస్తవ్రేత్తగా జన్మించరు. పసి మనసుల్లో ఆసక్తి, అభిలాష, సైన్స్‌పై మక్కువ ఉంటే శాస్తవ్రేత్తలను తయారుచేసుకోవటం పెద్ద కష్టం కాదు. ఈ సంకల్పమే శాస్తవ్రేత్తలయిన ఆ దంపతులను సేవాదృక్పథం వైపునకు మళ్లించింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సైన్స్, మేథ్స్ సబ్జెక్టులలో ఆసక్తి కల్పించే సంకల్పంతో ఆ దంపతులు తమ జీవితాన్ని త్యాగం చేశారు. లక్షల్లో జీతాలు వచ్చే ఉద్యోగాలు వదులుకున్నారు. లగ్జరీ జీవితాన్ని కాదనుకుని ఇండియాలోని ఓ కుగ్రామాన్ని ఎంపికచేసుకున్నారు. అమ్మో!సైన్సా? లెక్కలా? అని భయపడే ఆ గిరిజన పిల్లలు నేడు సైన్స్ పాఠాలను వల్లివేస్తున్నారు. లెక్కల జిమ్మిక్కులను సునాయాసంగా విప్పుతున్నారు. వివరాల్లోకి వెళితే...
శరత్ శర్మ, సంధ్యాగుప్తా ఆమెరికాలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ సైంటిస్టులు. పదిహేనేళ్ల పాటు తమ సేవలను అందించారు. తమ విజ్ఞానాన్ని నలుగురికి పనికొచ్చేలా ఉపయోగించాలనుకున్నారు. మనసులో అనుకున్న మరుక్షణమే మరో ఆలోచనకు అవకాశం లేకుండా ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ఇండియాకు వచ్చేశారు. హిమాచల్‌ప్రదేశ్ దక్షిణ భాగంలో ధౌలాధర్ ఏరియాలో పాలంపూర్‌కు కొన్ని కిలోమీటర్ల దూరంలో.. బాహ్యప్రపంచానికి దూరంగా ఉండే కాండ్ బరీ అనే కుగ్రామాన్ని ఎంపికచేసుకున్నారు. అక్కడ నివశించే గిరిజన గ్రామస్తులతో పాటు వీరు కూడా మట్టి ఇంటినే నివాసంగా చేసుకున్నారు. అప్పటికే వారికి షర్మిల అనే కుమార్తె ఉంది. ఆ చిన్నారిని పాఠశాలలో చేర్పించేందుకు వారు స్కూలు కోసం వెతుకుతుంటే.. వారికి తాము ఏమి చేయాలో..ఎవరికి సేవ చేయాలో బోధపడింది. అక్కడి పాఠశాలల దుస్థితి ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో.. పిల్లల్ని ఎవ్వరినీ పలుకరించినా.. అమ్మో సైన్సా? లెక్కలా? అంటూ భయపడిపోవటం గమనించారు. తాము నేర్చుకున్న విజ్ఞానాన్ని నలుగురికి పంచేందుకు సిద్ధమయ్యారు. సైన్స్, మేథ్స్ సబ్జెక్టుల పట్ల విద్యార్థులలో నెలకొన్న భయాన్ని పోగొట్టాలని నిశ్చయించుకున్నారు. ఇందుకోసం టీచర్లగా మారారు.
పరిశోధనలే ప్రపంచానికి దిశానిర్దేశం
మానవళి మనుగడకు శాస్ర్తియ విజ్ఞానం ఎంతో ఉపకరిస్తోంది. ఇందులోని పరిశోధనా ఫలాలే ప్రపంచానికి దిశానిర్దేశం అని నమ్మారు. ఈ దిశగా విద్యార్థులను తీర్చిదిద్దాలని భావించారు. విద్యార్థుల్లో సృజనాత్మకత అధికంగా ఉంటుంది. దీనికి పదును పెట్టేందుకు వారిలో సైన్స్, మేథ్స్ పట్ల జిజ్ఞాసను కలిగించాలని భావించారు. ముందు వారి అమ్మాయి షర్మిలను ఎన్నో వ్యయప్రయాసలతో ఉన్నంతలో ఓ మంచి పాఠశాలను వెతికి అందులో చేర్పించారు. ఆ తరువాత నుంచి తమ సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రాధమిక స్థాయి నుంచే విద్యార్థులకు సైన్స్, మేథ్స్ పాఠాలను విడమరిచి, ప్రయోగాత్మకంగా బోధించాలని భావించారు.
‘ఆవిష్కార్’కు శ్రీకారం
ఈ దంపతులిద్దరూ ఓ ఇన్‌స్టిట్యూషన్‌ను సంప్రదించి ‘ఆవిష్కార్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 2014లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందుకోసం ప్రతి పాఠశాలకు వెళ్లటం తమదైన పద్ధతిలో విద్యార్థులకు ఈ రెండు సబ్జెక్టులను బోధించటం ప్రారంభించారు. అంతేకాదు ఏ పాఠశాలలో విద్యార్థులు ఈ రెండు సబ్జెక్టులలో వెనుకబడి ఉన్నారో గ్రహించారు. వారందరినీ ఎంపికచేసి ఈ ‘ఆవిష్కార్’ కార్యక్రమం ద్వారా ప్రాక్టికల్‌గా పాఠాలు చెప్పటం ప్రారంభించారు. గత రెండేళ్లుగా సైన్స్, మేథ్స్ ఫెయిర్స్, వర్క్‌షాపులు నిర్వహిస్తున్నారు. అంతేకాదు రెసిడెన్షియల్ క్యాంప్స్ సైతం నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకూ వీరి ఆధ్వర్యంలో 270 రెసిడెన్షియల్ క్యాంప్స్ నిర్వహించారు. సైన్స్, మేథ్స్ ఫెయిర్స్, వర్క్‌షాపుల్లో దాదాపు వెయ్యి మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులకు సైతం ప్రత్యక తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ రెండు సబ్జెక్టుల విషయంలో విద్యార్థులలో ఆలోచనలు తలెత్తితే ప్రశ్నించే స్వభావం పెరుగుతుందని ఈ దంపతుల నమ్మకం. ఈ నమ్మకం ఒమ్ముకాదనుకుంటా. ఎందుకంటే సైన్స్ ప్రపంచాన్ని తెలియజేస్తుంది కాబట్టి.
*
chitram...
అమెరికా నుంచి హిమాచల్‌కు వచ్చిన దంపతులు
‘ఆవిష్కార్’కు అంకురార్పణ

విద్యార్థులతో సంధ్యా, శరత్ దంపతులు