భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వై.నాగేంద్రబాబు, కుప్పం ద్రవిడ యూనివర్సిటీ, చిత్తూరు
ప్ర:మీరు చెప్పినట్లు స్వయంవర కళా యంత్రం ధరించాను. అయినా సంబంధాలు కుదరటంలేదు.
సమా:‘స్వయంవర కళాయంత్రం’ మార్కెట్ సరకు కాదు. మీరేం ధరించారో తెలియదు. తగు విధమైన మంత్ర పూజా సంస్కారంతో ధరించవలసింది. పైగా అందులో కన్యా వివాహ సిద్ధి వేరు, పురుష వివాహ సిద్ధి వేరు వేరుగా ఉంటాయి. మీరేది ధరించారో తెలియనిదే ఏమీ చెప్పటానికి రాదు.

శిరిగుప్ప కిరణ్ కుమార్‌రెడ్డి, అనంతపురం (ఆంధ్ర)
ప్ర:ఐదు రాష్ట్రాల ఎన్నికలలో ఏ పార్టీ గెలస్తుంది, చెప్పండి?
సమా:మీ ప్రశ్న మీకు సంబంధించినది కానే కాదు. పైగా సామూహిక క్రియకు సంబంధించింది. ఒక విధంగా మీ ప్రశ్న జూదం పందెం వంటిది. భవిష్యకాలానికి ఏ మాత్రం వర్తించదు. కొద్ది రోజులు ఓపిక పట్టేదానికి ప్రశ్నించవలసిన పనే లేదు. సరియైన ప్రశ్న కాదు.

బి.వి.ఎస్.శాస్ర్తీ (అడ్వకేట్) ఉప్పల్, హైదరాబాద్
ప్ర:నేను గురుజపము- మృత్యుంజయ జపమూ చేశాను. ఇంకా ఏం చేయాలి?
సమా:శాస్ర్తీగారూ! ‘సరిగమపదనిస’ అని కొన్నిసార్లు అనగానే సంగీతం అవుతుందా? మంత్ర జపాదులకు స్వరసిద్ధి- ఉపదేశ శుద్ధి ఉండాలి. సమర్థులైన విప్రులతో జపాదులు న్యాసాదులతో చేయించి తీర్థం తీసుకోండి. విశేషంగా చేయదలచుకుంటే అమృత పాశుపత విధానంగా ఆరోగ్యానికి ప్రత్యేక ఈశ్వరాభిషేకం చేయించండి.

పుట్టి శివరామకృష్ణ, ఏలూరు (ప.గో)
ప్ర:ఏండ్లు గడుస్తున్నా నాకు కోర్టు ద్వారా విడాకులు మంజూరు కావటంలేదు.
సమా:‘హిందూ వివాహ చట్టం’లో పురుషుడు విడాకులు కోరితే అంత తొందరగా మంజూరు కావు. పైగా విడాకుల ప్రాతిపదిక అంశం- సాక్ష్యాలు బలంగా ఉండాలి- మీరు చెప్పిన సంఖ్య ప్రకారం మీవైపు కేసు బలహీనంగా కనిపిస్తోంది. ఆలస్యం ఇంకా చాలా వుంది. కొంత నష్టం జరిగే అవకాశమూ ఉంది.

డి.హరికృష్ణ, బరంపురం (ఒడిసా రాష్ట్రం)
ప్ర:్భముల మీద కేసునుండి రావలసిన డబ్బు వస్తుందా?
సమా:కేసులో ప్రతిపాది మీరు మాత్రమే అయినట్టయితే మీ యోగం ప్రకారం మే, జూన్‌లలో కొంత అనుకూలం కావచ్చు. ఇంకా కొందరు కూడా ఉన్నట్టయితే వారి ప్రతికూల ప్రభావం కూడా ఉంటుంది.

డి.సాయికుమార్‌రెడ్డి, చామదల (నెల్లూరు)
ప్ర:ఏ వ్యాపారం కలిసి వస్తుంది?
సమా:కలప- ఫర్నిచర్- స్టీల్- సిమెంట్- సానిటేషన్ వంటివి యోగిస్తాయి.

ఎ.శైలజ, హిందూపూర్ (ఆంధ్ర)
ప్ర:ఉద్యోగమా? వ్యాపారమా?
సమా:వ్యాపారమే- కోచింగ్ సెంటర్- చిన్న పిల్లల ఆట వస్తువులు- ఆహార దినుసులు.

ఎస్.సునీత- బరంపురం (ఒడిసా స్టేట్)
ప్ర:అష్టమ శని దోషానికి శాంతి పరిష్కారం ఏమిటి?
సమా:‘శనిగ్రహ విజ్ఞానం’ అనే గ్రంథంలో వివిధ శని యంత్రాలు (పూజవి) చెప్పబడ్డాయి. వీలయితే అవి చేయించి తగు విధ సంస్కారాలతో ఇంట్లో పూజలో పెట్టుకోవచ్చు ప్రత్యేక దీపంతో- మామూలుగా అయితే శనిసింగాపురంలో అర్చన- ఆంజనేయస్వామికి శనివారంనాడు అర్చన- అన్నంలో నల్ల నువ్వులు కలిపి కాకులకు ఆహారం పరిష్కార మార్గాలు.

వి.వెంకటకృష్ణయ్య, నంద్యాల (కర్నూలు)
ప్ర:నాకు సరి అయిన భాగస్వామిని లభిస్తుందా?
సమా:ఎంతగా అనుకూలవతియైనా కొన్ని సమయాల్లో రాజీపడక తప్పదు. గ్రీకు తత్వవేత్త సోక్రటీసు అంతటివాడికే అర్థాంగి పోరు తప్పలేదు. ఇంకా చాలామంది మహాత్ములు భార్యతో ఇబ్బందులు పడటమో- భార్యనే ఇబ్బంది పెట్టటమో చేసినవారే.

ఎమ్.కళావతి, బరంపురం (ఒడిసా స్టేట్)
ప్ర:వివాహ యోగం ఎప్పుడు?
సమా:వివాహాలస్యానికి మీరే కారణంగా కనబడుతున్నారు. షరతులు, రిజర్వేషన్లు లేకుంటే ఈ సంవత్సరం అనుకూలం- గతంలోనే పూర్తి అవకాశాలు వచ్చి తప్పినట్టు సూచిస్తోంది.

ఐ.వి.సంతోష్- వైజాగ్ (ఆంధ్ర)
ప్ర:నాకూ మా అన్నదమ్ములకూ ఏదీ కలసి రావటంలేదు. ఇంట్లో అనారోగ్య సమస్యలూ ఉన్నాయి.
సమా:ఆంతరంగికంగా ఐకమత్యం కనిపించటంలేదు. గౌరవనీయమైన బాంధవ్యం వరుసగల స్ర్తిల ప్రమేయం కూడా కనబడుతోంది. ఒక తప్పుడు సలహావల్లనో, మోసంవల్లనో ధననష్టానికి గురియైనట్లున్నారు- గృహ వాస్తు సరి చూసుకోండి.

షరీఫ్ బాషా, కొండపల్లి (కృష్ణా)
ప్ర:గురువుగారూ! ప్రభుత్వ విద్యుత్ సంస్థలో చాలాకాలంగా తాత్కాలిక కార్మికునిగా పనిచేస్తున్నాను. పర్మనెంట్ కాగలనా?
సమా:ఏవో కార్మిక సంఘాలతో ప్రమేయం ఉన్నట్టుంది. అది ఆటంకంగా ఉంది. ఆలోచించండి.
పి.అయ్యపురెడ్డి, కావలి (నెల్లూరు)
ప్ర:నాకు స్వగ్రామంలో గృహయోగం కలదా?
సమా:తప్పక స్వగ్రామంలోనే గృహయోగం స్ర్తి సహాయంతో ఏర్పడగలదు.

కోరుకొండ ఆదిబాబు, సింహాచలం (విశాఖ)
ప్ర:ఉద్యోగం
సమా:సింహాచలం ఆదివరాహ నారసింహునికి ప్రతి మంగళవారం వడపప్పు- పానకం సమర్పించి పూజించండి. ప్రభుత్వోద్యోగ యోగం కూడా ఉన్నది.

పి.శ్రీనివాసులురెడ్డి, కావలి (నెల్లూరు)
ప్ర:సంతాన యోగం
సమా:్భర్యాభర్తల జాతకాలు పరిశీలించనిదే చెప్పటం కుదరదు.

ఎస్.వి.రామారావు, పుట్టపర్తి (ఆంధ్ర)
ప్ర:ఇంట్లో డబ్బులు దొంగతనం
సమా:మీరు ఏ సంఖ్యా వ్రాయలేదు. పరధ్యానంగా ఉంటున్నట్టున్నారు. సావధానత అలవరచుకోండి. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అని సామెత. కాని ఇంటివారు మాత్రం పట్టగలరు. ప్రయత్నించండి.

సిహెచ్.శ్రీనివాసరావు, నూజివీడు (ఆంధ్ర)
ప్ర:ఉద్యోగం
సమా:ఆలస్యంగా ఈశాన్య దిశలో దేవాలయ సమీపంలో కాని, తీర్థక్షేత్రంలో కాని దేవాదాయ శాఖలో దొరికే అవకాశం ఉంది.

కె.వి.ఎస్.మహాలక్ష్మి, తెనాలి, గుంటూరు
ప్ర:తనవారి తిరస్కారం- ఆవేదన-
సమా:గతాన్ని గురించి కాని- వర్తమానం గురించి కాని వైఫల్యాల గురించి ఆలోచించకండి. భవిష్యత్తును గురించి ఆలోచించండి. ‘్భగవద్గీతా’ తాత్పర్య సహితంగా నిత్య పారాయణం చేయండి. కర్తవ్యం బోధపడుతుంది.

సి.సైదామణి, గుంతకల్లు (ఆంధ్ర)
ప్ర:జీవితంలో పోరాడి పైకి వచ్చి ఒక స్థాయికి చేరుకున్నాను. భవిష్యత్తు ఎలా ఉంటుంది.
సమా:పోరాడి అంటున్నారు కనుక మీలో ధైర్యం ఆత్మవిశ్వాసం పుష్కలంగా ఉన్నాయి. అదే ధైర్యంతో ముందుకు నడవండి. సాధించగలరు.

ఎం.దశరథం, బందరు, ఆంధ్ర
ప్ర:గురువుగారూ! వివాహం కోసం పూజలూ జపాలూ చేశాను. ప్రస్తుతం ఆసక్తి లేదు. నాకు వివాహం జరిగే యోగం లేదా?
సమా:చేసిన దైవసేవ వృధా పోదు. ఆలస్యంగా ఫలించగలదు. మీ జాతకంలో శుక్రదోష చ్ఛాయలు కనిపిస్తున్నాయి. శుక్రదోషం దాంపత్య సుఖాన్ని భంగపరుస్తుంది. స్థానిక పండితులను సంప్రదించండి.

కాలువ భోజప్ప, అంబేద్కర్‌నగర్, హైదరాబాద్
ప్ర:జ్యోతిషం శాస్త్రం కేవలం అగ్రవర్ణాలకే గుత్త్ధాపత్యమా?
సమా:అదేమీ కాదు. హైదరాబాద్‌లోనే నారాయణగూడలో అత్యంత నిమ్న వర్గంలో జన్మించిన జ్యోతిష పండితుడు ఉన్నాడు- గ్రహించండి.

ఎగుడ సంజీవ, పెద్దపల్లి (తెలంగాణ)
ప్ర:జీవితంలో ఏ రంగంలో స్థిరపడగలను?
సమా:వ్యాపార రంగం- ఏజెన్సీ వ్యాపారం- ఫైనాన్సు- విద్యా సంబంధమైన వస్తువులు కూల్ డ్రింక్స్- మినరల్ వాటర్ వంటివి.

పేరు :
చిరునామా : ...................................................... ............................................................................
...........................................................................
తోచిన సంఖ్య (1 నుంచి 108 లోపు) :
ఆ సంఖ్యను అనుకున్న సమయం, తేదీ:
............................................................................
ప్రశ్న : .................................................................
................................................................... ...................................................................
సంతకం :

‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ