సబ్ ఫీచర్

అడవిలో అద్భుతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ముదితల్ నేర్వగరాని విద్యగలదే ముద్దార నేర్పించినన్’ అనే నానుడి నిజం చేస్తూ ఎంతోమంది మహిళలు అవకాశం ఇస్తే సత్తా చాటుతున్నారు. ఇటువంటి కోవకు చెందిన మహిళ తెన్మాజీ. సర్పంచ్‌గా ఎన్నికైన ఈ 39 ఏళ్ల మహిళ తనను నమ్మి ఎన్నుకున్న గ్రామస్తుల కోసం అహర్నిశలు పాటుపడి ఐదేళ్లలోనే గ్రామ రూపురేఖలు మార్చేసింది. తమిళనాడులోని ధర్మపురి జిల్లాలోని సిట్లింఘీ అనే కుగ్రామం ప్రకృతి రమణీయతకు నెలవు. చుట్టూ వేలాది కిలోమీటర్లు దట్టంగా వ్యాపించిన ఆ అడవిపల్లె అందాలను చూడటానికి కనీస రవాణా సదుపాయాలు లేవు. మేథమెటిక్స్ గ్రాడ్యూయేట్ అయిన తెన్మాజీ ఓ ఆసుపత్రిలో అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేసేవా రు. జాబ్‌కు వెళ్లాలంటే ఎన్నోతిప్పలు. గ్రామ సమస్యలపై ఎన్నో వినతిపత్రాలు సమర్పించింది. సర్పంచ్‌ల నుంచి సరైన స్పందన రాలేదు. పురుషులైన సర్పంచ్‌లనుంచి సహకారం అందకపోవడంతో తానే ఎన్నికల్లో ఎందుకు నిలబడకూడదు అనుకుని 2011 ఎన్నికల్లో పోటీచేసింది. చదువుకున్న మహిళ కావటంతో ఆ అడవిపల్లెవాసులు ఆమెను నమ్మి ఎన్నుకున్నారు.
సర్పంచ్‌గా ఎన్నికైన వెంటనే గ్రామంలోని అభివృద్ధివైపు తన దృష్టిసారించింది. సిట్లింఘీ పల్లెను మరో ఏడు గ్రామాలను కలుపుతూ రూ. 30 కోట్ల వ్యయంతో బ్రిడ్జిని నిర్మించాలని ప్రతిపాదించింది. అంత డబ్బు సమకూరాలంటే ఎలా? ఢిల్లీలో జరిగిన మహిళా సర్పంచ్‌ల మీటింగ్‌కు వెళ్లినపుడు అక్కడ యూనియన్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌వారిని కలిసి తమ గ్రామ దుస్థితిని వారి దృష్టికి తీసుకువెళ్లింది. వారికి వినతిపత్రం సమర్పించి నాబార్డు సాయంతో రూ.30 కోట్లు మంజూ రు చేయించుకుని బ్రిడ్జిని నిర్మించింది. ఈ అడవిబిడ్డలకు అక్షరజ్ఞానం నేర్పించాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వ ఉన్నత పాఠశాలను మంజూరు చేయించింది. బ్రిడ్జి ఏర్పాటు చేయటంతో టీచర్లు కూడా ఆ గ్రామానికి రావటానికి ఇష్టపడ్డారు. ఉన్నత పాఠశాల ఏర్పడటంతో డ్రాపౌట్స్ తగ్గి చదువుకునే ఆడపిల్లల సంఖ్య పెరిగింది. రోగం వచ్చినా దాదాపు 11 కి.మీ దూరంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లాలి. తెన్మాజీ ఆసుపత్రిలో అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేసిన అనుభవంతో ఆమె జిల్లా వైద్యాధికారులకు ఇక్కడి సమస్యలు వివరించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయించింది. గ్రామంలో నెలకొన్న ఎన్నో సమస్యలు తీర్చేందుకు ఇప్పటికీ తెన్మాజీ ఉద యం 7.30 గంటల బస్‌కు కలెక్టరేట్‌కు వెళుతుంది. సాయంత్రం గ్రామానికి వస్తుంది. పంచాయతీకి వచ్చే ఆర్థిక వనరులు పరిమితంగా ఉండటంతో అధికారులకు గ్రామ సమస్య లు వివరించి నిధులు మంజూరు చేయించుకునేందు కు చెప్పులు అరిగేలా ఇప్పటికీ 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న కలెక్టరేట్‌కు వెళ్లటం దినచర్యగా చేసుకుంది కాబట్టే ఆమె నిబద్ధతను అధికారులు సైతం గుర్తించారు.