రుచి

శాకాహారి... కోపోద్రిక్తత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘వెగాన్స్’ అంటే మరీ ఛాందస శాకాహారులు వీళ్లు. పాలు కూడా మాంసాహారంగా భావిస్తారు. జార్జియా (పాత సోవియట్ యూనియన్ రాజ్యం) లో వెగాన్స్ పరమ పచ్చి శాకాహారులు కొందరు అప్పుడప్పుడు హడావుడి చేస్తూంటారు.
ఒక 26 సంవత్సరాల యువతి జుడిత్ మోరియా ఆర్మ్‌స్ట్రాంగ్ హైవే మీద తన కారులో, హడావుడిగా స్పీడుగా వెళ్తోంది. ఎదురుగా ఒక పెద్ద ట్రక్కు వస్తోంది. దాన్నిండా కోడిపెట్టలే. హోటళ్లకు సప్లయ్ చేసే నిమిత్తం పోతున్న ఆ ట్రక్కులోని కోళ్లు ఆర్తనాదాలు చేస్తున్నాయనిపించింది అమ్మడు మారియాకి- అంతే కోపంతో వూగిపోయింది.
‘‘మీ దుంపల్దెగ!’’ అంటూ ఆ ట్రక్కుకు ప్రక్కగా పోయి, చచ్చేలా దాన్ని ఢీకొట్టింది. దాని టొపా రం పగిలి, కోళ్లన్నీ చెల్లాచెదురైనాయి గానీ, కోపం అప్పటికీ చల్లాక- ‘‘డౌన్ విత్ చికెన్ రుూటింగ్’’ అంటూ, మరోసారి తన కారు ముక్కు కూడా బజ్జీ అయ్యేలాగా ట్రక్కుని గ్రుద్దేసి, బాగా దెబ్బతిన్న తన కారును అలాగే డ్రయివ్ చేసుకుంటూ పారిపోయింది. రెండు వారాలు వెదికినా జాడ దొరకలేదు గానీ, ఆమె కారు నెంబరు వున్న ప్లేటు, ట్రక్కులో ఇరుక్కుపోయి వుండి దొరికింది. దాంతో ఆమె కూడా దొరికింది.
ఆ అమ్మాయి తప్పత్రాగి వచ్చి ట్రక్కును గ్రుద్దేసింది అంటారు పోలీసులు. లేదు, లేదు ‘్ఢ’కొట్టిన తర్వాతనే రెండు పెగ్గులు వేసుకున్నానంతే నంటుందా శాకాహార ఉద్యమకారిణి. ఐరోపాలో శాకాహారం దొరకడమే కష్టం. అక్కడ ఉద్యమమా?
శాకాహార హోటల్‌పై దాడి!
ఇదిలా వుండగా- జార్జియాలోనే, రాజధాని ‘టిబిరిసి’ నగరంలో శాకాహార హోటలు ఒకటి వుంది. బైదిబై ’83లో, నేను జార్జియా వెళ్లినపుడు రుూ వూరి పేరు ‘టిఫ్లిసి’. అప్పుడు ‘శాకాహారం’ అంటే అంతా భలే నవ్వేశారు వాళ్లు. కానీ యివాళ లెనిన్ గ్రాడ్‌లోలాగే జార్జియా రాజధానిలోనూ పెద్ద పెద్ద ఫక్తు శాకాహార భోజనశాలలు ఉన్నాయిట.
ఐతే ఆ ‘కిదీకఫే’ హోటల్ మీద కొంతమంది నాన్‌వెజ్ ఉద్యమకారులు మాంసాహార పదార్థాలు, చేపల వంటకాలు అవీ తీసుకొచ్చి, వాటిని విసురుతూ దాడి చేశారు. తాము తింటూ వుండ టం- మధ్య మధ్య రెస్టారెంట్‌లో తింటున్న విదేశీ టూరిస్టుల మీదికి ముక్క లు- ముద్దలు విసరడం చేశారుట.‘‘వీళ్లు ఉద్యమకారులే గానీ మరీ పచ్చి శాకాహారుల అలవాట్లు మార్చుకోవాలన్న పంతంతో అప్పుడప్పుడు యిలా దాడులు చేస్తూంటారని- రెస్టారెంట్ మ్యానేజరు చెప్పాడుట. వీటిని ‘నాజీ దాడులు’ అంటారు వాళ్లు. ఈ కొట్లాట రోడ్డుమీద దాకా వ్యాపించి- అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు తాపీగా వచ్చారుట. ‘‘అక్కడ జార్జియా జార్జియన్లకే’’ అన్న నినాదాలు ఎక్కువైనాయిట, ఈమధ్య! ఔరా!