Others

మేజిక్ బుల్లెట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోచికి 53 కిలోమీటర్ల దూరంలో ఉండే అలెప్పీలో ఓ ఆదివారం నాడు కొంతమంది యువకులు బుల్లెట్‌ల మీద వచ్చారు. సన్నీర్ షరీప్ ఇంటి తలుపు తట్టారు. తలుపు తీసిన ఆ కుటుంబ సభ్యులు బుల్లెట్ల మీద వచ్చిన అంతమంది యువకులను చూసి బెంబేలెత్తిపోయారు. భయపడవద్దని చెప్పి సనీర్ తల్లి లైలాకు రూ.13,600లు ఇచ్చారు. లైలా గొంతు క్యాన్సర్‌తో ఇబ్బంది పడుతుంది. ఆమె కుమారుడు సన్నీర్ షరీఫ్ కూలి. తన తల్లికి కీమోథెరఫీ ఇప్పించడానికి ఆర్థిక స్థోమత లేదు. దీంతో ఎబిసి సభ్యులు ఆమెకు ఆర్థిక సహాయం అందించారు.
ఇలా కుల, మతాలతో సంబంధం లేకుండా, అవసరం లేదా ఆపదలో వున్నవారికి సహాయం చేస్తే, భగవంతుడు ఆశీర్వదిస్తాడు’’ అన్న అంశమే ప్రధానంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అలెప్పీ బుల్లెట్ క్లబ్ సభ్యులు. బుల్లెట్ నడపడం ఇష్టపడే వారందరూ తొలు త ఒక గ్రూపుగా ఏర్పడ్డారు. తాము బుల్లెట్‌పై రైడింగ్‌కు వెళ్లినపుడు ఎదురైన అనుభవాలు, వారిలో వున్న మానవత్వం, ఉదారతలను మేల్కొలిపాయి. దీంతో వారు పేదలకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. కేరళ రాష్ట్రంలో అలెప్పీ ఒక జిల్లా కేంద్రం. అలెప్పీ జిల్లా వాసులతో ఒక ఫేస్ బుక్ గ్రూపును విష్ణు విజయన్ ఏర్పాటుచేసి, దానికి అలెప్పీ బులెట్ క్లబ్ (ఎ.బి.సి) అని పేరుపెట్టారు. ఈ క్లబ్‌లో ప్రస్తుతం 160 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో ఇంజనీర్లు, పోలీసు అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల, విద్యార్థులు, మత పెద్దలతోపాటు, ఇరువురు మహిళలు కూడా ఉండటం గమనార్హం. వీరందరూ అలెప్పీ జిల్లాకు చెందినవారే కావడం గమనార్హం.
అలెప్పీలో ప్రభుత్వం నిర్వహిస్తూన్న వికలాంగుల వసతి గృహానికి వెళ్లి, ఒక రోజు పిల్లలకు నచ్చిన టిఫిన్, మధ్యాహ్నం భోజనాన్ని అందించారు. ఆ రోజు ఆ పిల్లలు పొందిన ఆనందాన్ని చూడటం ద్వారా తమకు కల్గిన సంతోషం, తమ జీవితంలో ఎప్పుడు కలగలేదని చెబుతారు ఎబిసి సభ్యులు. మన్నచెర్రి అనే గ్రామంలో ఒక పాడుబడిన ఇంటిలో ఒక మహిళ, ఆమె నల్గురు పిల్లలు ఉండటం వీరి కంటపడింది. విచారించగా, నలుగురు పిల్లలు పుట్టిన తరువాత భర్త ఎటో వెళ్లిపోయాడు. తల్లి కూలీ పనులు చేసుకుంటూ, వస్తున్న అరకొర సంపాదనతో పిల్లల్ని పోషిస్తున్నది. పిల్లలకు చదువుకోవాలని ఉన్నా పుస్తకాలు, స్కూల్ ఫీజులకు డబ్బు లేక, వారిని పాఠశాలలకు పంపడంలేదు. ఎబిసి సభ్యులు విరాళాలు పోగుచేసి నల్గురు పిల్లల్ని పాఠశాలలో చేర్పించి, వారికి కావాల్సిన పుస్తకాలు, స్కూల్ యూనిఫామ్‌లు ఇప్పించారు.
వారికి 25 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఆర్థిక సహాయం చేసి తమ కుటుంబాన్ని ఆదుకొన్న ఎబిసి సభ్యులకు ఆమె కృతజ్ఞలు తెలుపుతూ, తమకు తరచు ఆర్థిక సహాయం చేయవద్దని అభ్యర్థించారు. దీనివల్ల తమలో సోమరితనం పెరుగుతుందని ఆమె పేర్కొనడం విశేషం. అలెప్పీ నగరం నడిబొడ్డున ఒక రిఫ్రిజిరేటర్‌ను ఏర్పాటుచేయడానికి ఎబిసి సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. ఆహారం ఎక్కువ ఉన్నవారు ఈ ఫ్రిజ్‌లో ఆహారాన్ని పెట్టవచ్చు. ఆకలితో అలమటించేవారు ఈ ఆహారాన్ని తీసుకొంటారు. దీనివలన పేదలలో కొందరి ఆకలినైనా తీర్చవచ్చనేది వీరి ఉద్దేశ్యం. కేవలం బుల్లెట్ రైడింగ్‌లకే ప్రాధాన్యం ఇవ్వకుండా, అవసరం ఉన్నవారికి ఆపన్నహస్తం అందిస్తూన్న ఎబిసి సభ్యులు అభినందనీయులు. భవిష్యత్తులో వీరు మరిన్ని సహాయ, సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆశిద్దాం.

అలెప్పీ జిల్లా వాసులతో ఒక ఫేస్ బుక్ గ్రూపును విష్ణు విజయన్ ఏర్పాటుచేసి, దానికి అలెప్పీ బులెట్ క్లబ్ (ఎ.బి.సి) అని పేరుపెట్టారు. ఈ క్లబ్‌లో ప్రస్తుతం 160 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో ఇంజనీర్లు, పోలీసు అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల, విద్యార్థులు, మత పెద్దలతోపాటు, ఇరువురు మహిళలు కూడా ఉండటం గమనార్హం.

- పి.్భర్గవరామ్