భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డి.శంకరరెడ్డి, కావలి (నెల్లూరు)
ప్ర:మా గ్రామంలో వంద సంవత్సరాలకంటే ప్రాచీనమైన దేవాలయం ఉంది. దానిని పునరుద్ధరించటం మంచిదా? పడగొట్టి మళ్లీ నిర్మించటం మంచిదా?
సమా:పునరుద్ధరణ చేయటమే మంచిది. అందునా గర్భాలయం- దేవతాస్థాన అంతర్భాగం విషయంలో ఏ మాత్రం తొందరపడకూడదు. శైవాలయమైతే శృంగేరీ శారదా పీఠాధిపతులను- వైష్ణవ ఆలయమైతే చినజియ్యరు స్వాములను సంప్రదించటం మంచిది. ప్రాచీనమైన గుర్తులు చెరపకూడదు. అంతేకాదు ప్రాచీన దేవాలయాలలో ఆయా మహాపురుషుల ఆత్మబలం కూడా దైవబలానికి తోడై వుంటుంది. తొందర పడక పీఠాధిపతులను సంప్రదించండి!
టి.మహేశ్వరి, ఆకుపాలెం (ఆంధ్ర)
ప్ర: వివాహం?
సమా: ఇంకా ఆలస్యం కనిపిస్తోందమ్మా! శుక్ర దోష చ్ఛాయలున్నాయి. సంతోషీమాతా వ్రతం చేయండి! ఫలిస్తుంది!
కె.సంజీవరావు, భీమవరం (ప.గో.)
ప్ర:మహాశయా! నేను చాలా పేదవాడను. గొప్ప గొప్ప చికిత్సలు పొందలేను. మోకాళ్ల నొప్పులు- వినికిడి సమస్యతో బాధపడుతున్నాను. సులభమైన పరిష్కారం చెప్పగలరని మనవి.
సమా:మోకాళ్ల నొప్పులకు గాను ప్రతిరోజూ ఒక నిమ్మపండు రసం- అదే మోతాదులో వెల్లుల్లి రసం కలిపి ఒకే మోతాదులో రోజూ రెండు పూటలా తీసుకోండి. పైపూతగా ఆలువేరా తైలం రాయండి (కలబంద తైలం). వినికిడికి ఆయుర్వేదంలో బిల్వతైలం- హమియోలో మూలినా ఆయిల్ బాగా పనిచేస్తాయి. ఇవి ఏవీ ప్రమాదకరమైనవి కావు.
పి.శ్రీవిద్య - పెదకాకాని - ఆంధ్ర
ప్ర:నేను ఎమ్.హెచ్.ఆర్.ఎమ్ (పి.జి.కామర్సు) చేశాను. మావారు ఉద్యోగం చేయమంటున్నారు. చేయమంటారా?
సమా:తప్పక చేయండి. మీది విజయాంశ. మంచి పేరు సంపాదిస్తారు. ఆరోగ్యం విషయంలో గొంతు- నాసిన- ముఖ భాగంలో జాగ్రత్తగా ఉండండి.
కె.బాలాత్రిపురసుందరి, సజ్జాపురం (ప.గో)
ప్ర:నాకు శ్వాస సంబంధమైన సమస్య ఉన్నది. నివారణ అవుతుందా?
సమా:మీకు ఊపిరితిత్తులలో ఏమీ దోషం లేదు. నాసికా ప్రాంతంలోనే ఏదో ఒక ఒత్తిడి జరుగుతున్నట్టు కనిపిస్తున్నది. నాసల్ సంబంధమైన వైద్యుని సంప్రదించండి. నయమవుతుంది. తాత్కాలికంగా ఎప్పుడూ హారతి కర్పూరం వాసన చూస్తూ ఉండండి. ఉపశమనం కలుగుతుంది.
పి.ఎస్.నారాయణ - తిరువళ్ళూరు (తమిళనాడు)
ప్ర:బాబా నాకు మరలా ఎప్పుడు ఉద్యోగం ప్రసాదించును.?
సమా:బాబానే సమాధానం అడగండి! మీరు చెప్పిన సంఖ్య ప్రకారం నేను చెప్పగలిగేది- మీకు ప్రభుత్వ ధన ప్రాప్తి ఉన్నది.
వి.మహేశ్వరి - బీబీనగర్ (యాదాద్రి, తెలంగాణ)
ప్ర:నేను డిగ్రీ లేదా బి.టెక్ చేయగలనా?
సమా:బి.టెక్ చేయగలరు. అయితే విద్యా విఘ్నాలున్నాయి.
సి.చంద్రకళ, రాళ్ళకుంట (తెలంగాణ)
ప్ర:ఏ కోర్సు నాకు బాగుంటుంది?
సమా:మెకానికల్ లేదా సివిల్ ఇంజనీరింగ్.
ఎమ్.వెంకట అనంతరామయ్య, నరసరావుపేట, గుంటూరు
ప్ర:శర్మగారూ! నమస్కారం! నా వయస్సు అరవై రెండు సంవత్సరాలు. నాకు జన్మ లగ్నంలో శుక్ర - రాహువులు ఉన్నారు. ఆరోగ్యం - ధర్మపత్ని గురించి చెప్పగలరు?
సమా: ఏ లగ్నమో చెప్పకుండా కేవలం గ్రహస్థితి చెపితే ఏమీ చెప్పలేను. మీరు చెప్పిన సంఖ్య ఆధారంగా, పాదాలు- గొంతు భాగాలు ఆరోగ్యం జాగ్రత్త అవసరం. ‘్ధర్మపత్ని’ ధర్మపత్నియే- వ్యాఖ్యానం అనవసరం. ఈ వయసులో అసందర్భం.
కె.పాపారావు, మల్కాపురం (విశాఖపట్నం)
ప్ర:గురువుగారూ! నేను ఏది మాట్లాడినా చెడ్డ అవుతున్నది. వ్యతిరేకతలు వస్తున్నాయి. నన్ను ఏం చేయమంటారు?
సమా:సాధ్యమైనంతవరకూ తక్కువగా మాట్లాడండి. ‘మితభాషిత్వం’వల్ల గౌరవం పెరుగుతుంది. అడగనిదే ఎవ్వరికీ సలహా ఇవ్వకండి. తప్పులు ఎంచకండి. వాక్ స్థానంలో పాపగ్రహ దోష నివారణకుగాను ‘బుద్ధిమతాం వరిష్టం’ అయిన ఆంజనేయస్వామిని ఆరాధ్యదైవంగా కొలవండి!
యు.వినూషాదేవి, రాజమండ్రి (తూ.గో)
ప్ర:నేను సి.ఏ పూర్తిచేస్తానా? వివాహం ఎప్పుడు?
సమా:సి.ఏ పూర్తిచేయగలరు. ఉద్యోగరీత్యా కాని- వృత్తిరీత్యా కాని మంచి అభివృద్ధి సాధించగలరు. వివాహం ఆలస్యం- దక్షిణ ఆగ్నేయ దిశలు యోగకారకం.
శిరిగుప్ప కిరణ్‌కుమార్ శెట్టి, అనంతపురం (ఆంధ్ర)
ప్ర:మంచి రోజులు ఎప్పుడు వస్తాయి?
సమా:మనం మంచి అలవాట్లను అలవరచుకున్నప్పటినుండి మంచిరోజులు ‘గుడ్ హాబిట్స్ పే గుడ్ డివిడెండ్స్’ (ద్య్యిజూ ద్ఘఇజఆఒ ఔ్ఘక య్యజూ జూజ్పజజూళశఆఒ) ఆ మార్గం అనుసరింఛండి.
కిలిమి యోగేశ్, విజయవాడ (ఆంధ్ర)
ప్ర:నాకు వివాహం ఎప్పుడు? ఏ రంగం నాకు యోగించును?
సమా:జూన్ తరువాత వివాహ ఘడియలు రాగలవు. బీమా సంస్థలు- వ్యవసాయ రంగాలు- ధాన్య వ్యాపారం- సైనిక శాఖలు యోగిస్తాయి.
బి.చంద్రకళ- కొడిగూడెం (తెలంగాణ)
ప్ర:నేను ఏ విద్యలో రాణించగలను?
సమా: జియోలజీ (్భగర్భ శాస్త్రం) నిర్మాణ సంబంధంగా ఆర్కిటెక్ట్ వంటివి బాగుంటాయి.
దూదేకుల సుబ్బి సిద్ధయ్య, వెంకటాపురం (కర్నూలు)
ప్ర:ప్రభుత్వోద్యోగం - వివాహం?
సమా:ఉపాధ్యాయ సంబంధమైన శాఖలు- వివాహం- వాయవ్య దిశ యోగం.
చిల్లకూరు మహేశ్, సూళ్ళూరుపేట (నెల్లూరు)
ప్ర:ఉద్యోగం కోసం మలేషియా వెళ్లాలనుకుంటున్నాను. ఫలిస్తుందా?
సమా:తప్పక ప్రయత్నించండి. ఆస్ట్రేలియా ఎక్కువ అనుకూలం.
జి.ఆండాళు, హుజూర్‌నగర్ (తెలంగాణ)
ప్ర:నాకు తీర్థయాత్రల కోరిక తీరుతుందా?
సమా:‘గంగా స్నానానికి కొండుభొట్ల ఆజ్ఞ ఎందుకు’ అని సామెత- ప్రయత్నించండి. అయితే మీకింకా ఇల్లు- సంసారం - సంతానం పట్లనే ఎక్కువ వ్యామోహం ఉంది.
మువ్వల మల్లిఖార్జునరావు, కావలి (నెల్లూరు)
ప్ర:నేను బంగారం వ్యాపారం చేయవచ్చునా?
సమా:చేయవచ్చును. పట్టువస్త్రాలు, రెడీమేడ్ ఆభరణాలు- లావాదేవీలు- చిట్‌ఫండ్లు కూడా యోగిస్తాయి.

పేరు :
చిరునామా : ...................................................... ............................................................................
...........................................................................
తోచిన సంఖ్య (1 నుంచి 108 లోపు) :
ఆ సంఖ్యను అనుకున్న సమయం, తేదీ:
............................................................................
ప్రశ్న : .................................................................
................................................................... ...................................................................
సంతకం :

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్),
హైదరాబాద్- 500 059.