Others

దరహాసిని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో ఒకప్పటి అగ్ర కథనాయిక సుహాసిని మణిరత్నం తమిళ బుల్లితెరపై సరికొత్త దరహాసంతో దర్శనమిస్తుంది. ఇందుకోసం ఆహార్యంలోనూ, ఆహారంలోనూ మార్పులు చేసుకుంటూ ప్రోగామ్స్‌ను రక్తికట్టిస్తోంది. సినిమాల్లో అవకాశాలు తగ్గటంతో అందరిలాగానే సుహాసిని కూడా ఖాళీగా కూర్చోకుండా టివీ ప్రోగ్రామ్స్ వాఖ్యాతగా ఆరంగ్రేటం చేశారు. జాతీయ అవార్డు గ్రహీత అయిన సుహాసిని తన ప్రోగ్రామ్స్‌కు తగ్గట్లు దుస్తులను, కాస్ట్యూమ్స్‌ను ఎంపిక చేసుకుంటూ హుందాగా కార్యక్రమాలను నిర్వహిస్తూ వీక్షకులను ఆకట్టుకుంటోంది. గతంలో తమిళ సినిమాలపై నిర్వహించే ‘హాసిని పెసమ్ పాదమ్’ కార్యక్రమంలో ఫ్యాంట్స్, టాప్స్‌తో దర్శనమిచ్చింది. ఇది తమిళ సినిమాలకు సంబంధించిన ఓ ఇంటర్నేషన్ కార్యక్రమం కాబట్టి ఆ కార్యక్రమానికి తగ్గట్టు ఆధునిక దుస్తుల్లో మెరిసింది. అధునాతన ఫ్యాంట్లుపై విభిన్న రకాల టాప్స్ వేసుకుంది. ప్రస్తుతం వస్తున్న ‘వీకెండ్ విత్ స్టార్స్’ ప్రోగ్రామ్ కోసం ఇండో-వెస్ట్రన్ డ్రెస్‌లను ఎంపిక చేసుకుంటోంది. అంతేకాదు ఈ షోలో వ్యాఖ్యాతగా నిలబడి చేయాలి కాబట్టి ఇరవై రోజుల్లోనే ఐదు కిలోల బరువు తగ్గింది. ఈ షో మొత్తం కూడా నిలబడే చేయాల్సి ఉంటుంది. దీంతో తోటి నటీనటుల ముందు వ్యాఖ్యాతగా తాను రాణించాలంటే బరువు తగ్గటమే ఉత్తమం అనుకుని యోగాసనాలు వేసి, ఆహారపు అలవాట్లు మార్పు చేసుకుని ఐదున్నరు కిలోల బరువు తగ్గిపోయింది. తనతో పాటే యోగా చేసిన ఆమె భర్త మణిరత్నం నెలలో ఆరు కిలోల బరువు తగ్గారట. వేసవి కాలంలోచెన్నై చాలా వేడిగా ఉంటుంది. దీంతో పొడవాటి జుట్టుతో ఈ షో చేయాలంటే సౌకర్యవంతమైన దుస్తులను ఎంపిక చేసుకోవటం ఎంతో ఉత్తమం అని సుహాసిని అంటారు.

భూమికకు రచనలు
పంపాలనుకునే వారు
రచనలను ఈ మెయిల్‌లో స్కాన్ లేదా పిడిఎఫ్ ఫార్మాట్‌లో ఇ్ద్య్యౄజర్ఘీబ్ఘశజ్ద్ఘూఇ్ద్య్యౄజ.శళఆకు మెయల్ చేయవచ్చు.
లేదా ఈ కింది చిరునామాకు పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03