Others

స్టయిల్ హీరోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందంగా ఉండాలని అమ్మాయిలు తహతహలాడటం సహజం. మారుతున్న పరిస్థితులు నేడు అబ్బాయిలే స్టయిల్‌గా కనబడాలని తహతహలాడుతున్నారు. ఇందుకోసం వెతకని సామాజిక మాధ్యమం లేదంటే నమ్మండి. ముఖానికి మెరుపులద్దటానికి, నయా ట్రెండ్స్ ఫాలో అవుతూ అమ్మాయిలను ఆకర్షించటానికి చేయని ప్రయత్నం లేదు. సౌందర్య సలహాల యువకులు విపరీతంగా వెబ్‌సైట్లను వెతుకుతున్నట్లు ఇటీవల నిర్వహించిన సర్వేలో సైతం వెల్లడింది. వీరి కోసం ఫ్యాషన్ బ్లాగులు సైతం సృష్టిస్తున్నారు. సౌందర్య కిటుకులు, చిట్కాలు అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువగా చదువుతున్నారు. కాస్మోటిక్ అలవాట్లను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ అందానికి మెరుగులు దిద్దుకుంటున్నారు.
మగపిల్లలను సైతం ఎండలో ఎక్కువసేపు తిరగొద్దని తల్లిదండ్రులే హెచ్చరిస్తున్నట్లు ఆ సర్వే వెల్లడైంది. ఇంటి వారసుడి పిల్లలు అందంగా పుట్టాలని వారి ఆరాటం. అందుకే ఆడపిల్లలకే కాదు సౌందర్య చిట్కాలు పాటించమని కన్నవారే మగపిల్లలకు సలహా ఇస్తున్నారట. అందంగా ఉన్న పెళ్లికొడుకు, పెళ్లికూతురికే మార్కెట్‌లో డిమాండ్ బాగా ఉంది. అందుకే ఈ వయసు నుంచే ఫెయిర్‌నెస్ క్రీములను వాడుతున్నాం అని అబ్బాయిలు చెబుతున్నారు. అమ్మాయిలు కూడా అందంగా లేదా కనీసం చామన ఛాయగా ఉండే అబ్బాయిలనే ఇష్టపడుతున్నారు. సోషల్ మీడియా సృష్టిస్తున్న ట్రెండ్ వల్ల అబ్బాయిలు స్టయిల్‌గా ఉండే దుస్తులను ఎంపికచేసుకుంటున్నారు. అంతేకాదు హెయిర్ స్టయిల్‌ను ఎప్పటికప్పుడు మార్చేస్తున్నారు. స్టయిల్‌గా ఉండే అబ్బాయిలే అమ్మాయిలను ఆకర్షిస్తారు. కాబట్టి నలుగురు అమ్మాయిలు ఎల్లప్పుడు తమ చుట్టూ ఉండాలంటే స్టయిల్‌గా ఉండాలని తపనపడుతున్నారు. శారీరకంగా దృఢంగా ఉండటానికి కసరత్తులతో పాటు ఫెయిర్‌నెస్ క్రీములను వాడుతూ అమ్మాయిలను ఆకర్షించటానికి తెగ తాపత్రయపడటం సహజమైంది. కాస్మోటిక్స్ అధికంగా వాడాలని తాపత్రయం పడేవారు కొన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. వీరంతా ఆయుర్వేద క్రీములనే వాడుతున్నారట. రియాక్షన్స్ రాకుండా ముందు జాగ్రత్తగా. ఏదిఏమైనప్పటికీ అందం కోసం అబ్బాయిల ఫీట్లు అన్నీఇన్నీ కావు. అద్దం ముందు నిలబడి వివిధ భంగిమల్లో నిలబడి ఎలాంటి స్టయిల్ మెయింటెన్ చేయాలనే ఆరాటం ఆధునిక అబ్బాయిలకే ఉండటం వారి మనస్తత్వానికి అద్దం పడుతోంది.