సబ్ ఫీచర్

వీధి కుక్కల నేస్తం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీధి కుక్కలను చూస్తే చీదరించుకుంటాం. కాని ఈడెన్ దియాస్ మాత్రం వాటితో సెల్ఫీలు దిగుతుంది. వీధికుక్కల కోసం ఆమె ఓ ఫేస్‌బుక్ సైతం నడుపుతుంది. కత్తికి రెండు వైపులా పదును ఉన్నట్లు సోషల్ మీడియాను మంచికీ, చెడుకీ రెండింటీ ఉపయోగించేవారు ఉన్నా రు. కొంతమంది పాములతో, సింహాలు వంటి క్రూర మృగాలతో సెల్ఫీలు దిగి పోస్ట్ చేస్తారు. మనతోపాటే ఉంటూ మనం తినగ మిగిలింది వేస్తే తిని వీధుల్లో ఎవరైనా అపరచిత వ్యక్తి వస్తే అప్రమత్తం చేసే వీధి కుక్కలను దరిచేరనీయం. పైగా రాత్రివేళల్లో వీటి గోల భరించలేక తరిమి తరిమి కొట్టేవారే అధికం. వీటన్నింటిని చూసిన ఈడెన్ దియాస్ వీటికోసం ఏదైనా చేయాలని భావించింది. థానేలో పెట్ ఓనర్స్ అండ్ యానిమల్స్ లవర్స్ (పిఎఎల్) అనే ఎన్జీఓ సంస్థలో పనిచేసే ఈడెన్ వీటి కోసం ఓ ఫేస్‌బుక్‌ను క్రియేట్ చేసింది. 2016 అక్టోబర్‌లో ఈ ఫేస్‌బుక్ ఖాతా తెరిచి వీధికుక్కతో దిగిన ఓ ఫొటోను పోస్ట్ చేసింది. ఈ ఫొటోతో పాటు ‘‘నేను ఈ వీధి కుక్కలతో చాలా క్లోజ్‌గా మూవ్ అవుతాను. వాటితో సెల్ఫీ దిగుతాను, ఇవి ఎలాంటి హానికరమైన జంతువులు కాదు’’ అని ఫొటోతో క్యాప్షన్ రాసింది. ఈ సెల్ఫీ ఫొటో, క్యాప్షన్ ఎంతోమందిని ఆకర్షించింది. వీధి కుక్కలతో సెల్ఫీలు దిగి ఫొటోలను పోస్ట్ చేశారు. స్నేహితులు, జంతువుల ప్రేమికుల నుంచి విపరీతమైన స్పం దన వచ్చింది. ఆమెను అభినందిస్తూ మెస్సేజ్‌లు వచ్చా యి. అప్పటి నుంచి ఈడెన్ దియాస్ ఫేస్‌బుక్‌కు విపరీతమైన ఫాలోవర్స్ ఏర్పడ్డారు. ఈ ఫేస్‌బుక్ వల్ల వీధి కుక్కలను చంపేయకుండా కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఆరంభించానని ఈడెన్ వెల్లడిస్తోంది. ఇలా కుర్రకారు సోషల్‌మీడియాను మూగజీవాల కోసం ఉపయోగించటం మరింతమందిని జంతు ప్రేమికులుగా మారుస్తుందనటంలో సందేహం లేదు.